newssting
BITING NEWS :
* విశాఖ: పవన్‌ కల్యాణ్‌ది లాంగ్‌ మార్చ్ కాదు.. రాంగ్ మార్చ్.. పొత్తుల విషయంలో పవన్‌కు చంద్రబాబే ఆదర్శం.. ఐదేళ్లలో ఆరు పార్టీలతో పొత్తుపెట్టుకున్న ఏకైక వ్యక్తి పవన్-ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌* భారత్ - న్యూజిలాండ్ ఫస్ట్ టీ-20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా... సిరీస్‌లో మొత్తం ఐదు టీ-20లు ఆడనున్న భారత్, న్యూజిలాండ్*సీఎం జగన్ తీరుపై చంద్రబాబు ఫైర్ * కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొనసాగుతున్న పోలింగ్ *హైదరాబాద్‌: ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయసాయిరెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్, శామ్యూల్.. ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ జగన్ తరపు న్యాయవాది*రిపబ్లిక్‌ డే సందర్భంగా దేశవ్యాప్తంగా హై అలర్ట్.. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరిక*తెలంగాణ: మూడు వార్డుల్లో రీపోలింగ్. కామారెడ్డి మున్సిపాలిటీ 41వ వార్డులోని 101వ పోలింగ్ కేంద్రం, బోధన్ మున్సిపాలిటీ 32వ వార్డులోని 87వ పోలింగ్ కేంద్రం, మహబూబ్‌నగర్‌ 41వ వార్డులలోని 198వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్*హైదరాబాద్‌: నేడు ఓయూ బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు... ప్రొఫెసర్ కాశిం అరెస్ట్‌కు నిరసనగా బంద్*నారా లోకేష్ బహిరంగ లేఖ. లేఖతో పాటుగా మండలిలో గొడవ వీడియోను రిలీజ్ చేసిన లోకేష్

క్వాల్‌కోమ్‌ కొత్త ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ వస్తోంది...

05-12-201905-12-2019 13:51:19 IST
2019-12-05T08:21:19.374Z05-12-2019 2019-12-05T08:21:17.040Z - - 24-01-2020

క్వాల్‌కోమ్‌ కొత్త ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ వస్తోంది...
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పాస్‌వర్డ్‌, పిన్‌, ప్యాట్రన్‌ రోజులు పోతున్నాయి... ఇప్పుడు అంతా ఫింగర్‌ ప్రింట్‌, ఫేస్‌ అన్‌లాక్‌ చుట్టూనే తిరుగుతోంది. కొత్త మొబైల్స్‌లో పాస్‌వర్డ్‌, పిన్‌, ప్యాట్రన్‌ ఫీచర్లు ఉంటున్నా ఎక్కువమంది ఫింగర్‌ ప్రింట్ లాక్‌నే ఎక్కువగా వాడుతున్నారు.  మిగిలిన లాక్స్‌ కంటే ఇది ఎక్కువ ఉపయోగకరంగా ఉండటంతో యూజర్లు దీనిపై ఆసక్తిచూపుతున్నారు. అయితే ఇందులో కొన్ని ఇబ్బందులూ ఉన్నాయని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ రాబోతోంది. క్వాల్‌కోమ్‌ సరికొత్త త్రీడీ సోనిక్‌ మ్యాక్స్‌ అనే సెన్సర్‌ను తీసుకొచ్చింది.

ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ కన్నా.. త్రీడీ సోనిక్‌ మ్యాక్స్‌ 17 రెట్లు పెద్దదిగా ఉంటుంది. ఈ కొత్త సెన్సర్‌తో ఒకేసారి రెండు వేళ్లను ఒకేసారి స్కాన్‌ చేయొచ్చు. ఇటీవల మార్కెట్‌లోకి వచ్చిన శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌10లో త్రీడీ సోనిక్‌ సెన్సర్‌ను వినియోగించారు. ఇప్పుడు అందులో మార్పులు చేసి త్రీడీ సోనిక్‌ మ్యాక్స్‌ను తీసుకొస్తున్నారు.

ఈ సెన్సర్‌ 20ఎంఎం X 30 ఎంఎం సైజులో ఉంటుంది. అదే పాత సెన్సర్‌ సైజు అయితే 4 ఎంఎం X 9 ఎంఎం మాత్రమే. పెద్ద సెన్సర్‌ వాడటం వల్ల ఫింగర్‌ ప్రింట్‌ డిటక్షన్‌ మరింత ప్రభావవంతంగా ఉంటుంది. దీంతోపాటు స్క్రీన్‌ ప్రొటక్టర్‌ వేసినప్పుడు కూడా ఫింగర్‌ ప్రింట్‌ డిటెక్షన్‌ మరింత బాగుంటందని చెబుతున్నారు. 

Image result for Qualcomm launches new fingerprint sensor

రెండు ఫింగర్‌ ప్రింట్‌ల ఆధారంగా ఈ సెన్సర్‌ పని చేయనుండటంతో భద్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అయితే ఫింగర్‌ ప్రింట్‌ రియాక్ట్‌ అయ్యే వేగంలో ఎలాంటి మార్పు ఉండదు అని చెబుతున్నారు. మరి ఈ కొత్త సెన్సర్‌ను ఏ మొబైల్‌ ముందుగా తీసుకొస్తుందో చూడాలి. అయితే వచ్చే ఏడాది వచ్చే ఆపిల్‌ ఫోన్స్‌లో ఈ సెన్సర్‌ను తీసుకొస్తున్నారని వార్తలొస్తున్నాయి.

అయితే ఆపిల్‌ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మరోవైపుఏ శాంసంగ్‌ తన మొబైల్స్‌లో త్రీడీ సోనిక్స్‌ సెన్సర్‌ను వాడకూడదనుకుంటోంది. ఇటీవల వచ్చిన శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌ 10లో ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌లో సమస్యలొచ్చాయి. అందులో రిజిస్టర్‌ చేయని  ఫింగర్స్‌తో కూడా  ఫోన్లు అన్‌లాక్‌ అవుతున్నాయని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో శాంసంగ్‌ ఇక త్రీడీ సోనిక్‌ సెన్సర్లకు దూరమవుతోందని తెలుస్తోంది. 

Image result for Qualcomm launches new fingerprint sensor


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle