newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

క్లిక్ చేస్తే అన్నీ కోల్పోయినట్లే..!

23-09-202023-09-2020 12:22:03 IST
2020-09-23T06:52:03.677Z23-09-2020 2020-09-23T06:52:00.012Z - - 17-04-2021

క్లిక్ చేస్తే అన్నీ కోల్పోయినట్లే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఏదో వెబ్సైట్ ను ఓపెన్ చేస్తే మరేదో వెబ్సైట్ ఓపెన్ అవుతూ ఉంటుంది.  అలా ఓపెన్ చేసిన తర్వాత అనవసరమైన యాప్స్ మన ఫోన్ లోకి డౌన్ లోడ్ అయిపోతూ ఉంటాయి. అలాంటి వాటి వలన చాలా ప్రమాదం అని తెలిసిందే..! ఒక్క క్లిక్ తో మన ఫోన్ లో ఉన్న డేటా మొత్తం వారి చేతిలో పెట్టేసిన వాళ్లమవుతాము. ఇప్పటికే ఎంతో మంది ఇలాంటి యాప్స్ బారిన పడి సర్వం కోల్పోయారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంపై హెచ్చరికలు జారీ చేసింది. 

కేంద్ర ప్రభుత్వానికి చెందిన సైబర్‌ ఆవేర్‌నెస్‌ ట్విట్టర్‌లో స్మార్ట్‌ ఫోన్లు వాడే వారు తెలియని యూఆర్‌ఎల్‌ (URLS) నుంచి వచ్చే 'ఆక్సీమీటర్‌ యాప్స్‌' ను డౌన్‌ లోడ్‌ చేసుకోవద్దని ఈ హెచ్చరికలు జారీ చేసింది. కేంద్ర హోంశాఖ సైబర్‌ దోస్త్‌ అనే ట్విట్టర్‌ అకౌంట్‌ను నిర్వహిస్తోంది. సైబర్‌ నేరాలు జరుగకుండా దాని ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. 

ఈ యాప్స్‌ మనుషుల శరీరంలో ఎంత ఆక్సిజన్‌ ఉందో చెబుతుందంటూ వచ్చే యాప్స్ ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే మీ వ్యక్తిగత సమాచారం, మీ ఫోటోలు, మీ వీడియోలు, కాంటాక్ట్‌ నంబర్లు, పాస్‌వర్డ్‌లు దొంగిలిస్తాయని కేంద్రం హెచ్చరిస్తోంది.  ఈ యాప్స్‌ ద్వారా మొబైల్‌లో ఏ ఇంటర్‌నెట్‌ సెర్చ్‌ చేస్తున్నారో, ఏ వీడియోలు ఎక్కువగా చూస్తున్నారో తెలిసిపోతుందట..! ఎలాంటి చాటింగ్‌లు చేస్తున్నారు లాంటి వివరాలన్ని హ్యాకర్లకు అందిస్తాయి. మీ వేలిముద్రలు, స్కానింగ్‌ వంటి డేటాను కూడా హ్యాకర్లకు పంపిస్తాయి. కొన్ని యాప్స్‌ బయోమెట్రిక్‌ ఫింగర్‌ ప్రింట్స్‌ కూడా అడుగుతాయని కేంద్రం హెచ్చరిస్తోంది.

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో చాలా మంది ఆక్సీమీటర్లు కొనుగోలు చేస్తున్నారు. వ్యాధి సోకిన వారిలో రక్తం ఆక్సిజన్‌ లెవెల్స్‌ తగ్గితే ఆక్సీ మీటర్‌ ద్వారా వెంటనే తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమై ఆస్పత్రికి వెళ్లవచ్చు. వీటిని దృష్టిలో పెట్టుకుని హ్యాకర్లు ఇలాంటి యాప్స్ కు సంబంధించిన లింక్స్ ను పంపిస్తూ ఉన్నారు. 

ఈ-వాలెట్‌ యాప్‌లను యాపిల్‌ స్టోర్‌, గుగూల్‌ స్టోర్‌ నుంచి మాత్రమే డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచిస్తోంది. ఎస్‌ఎంఎస్‌, లింక్‌ రూపంలో వచ్చే యాప్‌లను నమ్మవద్దని కేంద్రం సూచిస్తోంది. 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle