‘క్రొకడైల్ హంటర్’ పై గూగుల్ డూడుల్
22-02-201922-02-2019 11:36:22 IST
2019-02-22T06:06:22.220Z22-02-2019 2019-02-22T06:06:18.742Z - - 11-04-2021

ప్రతిరోజు.. ఆ రోజుకున్న ప్రత్యేకతను డూడుల్ రూపంలో సెలబ్రేట్ చేస్తూ ఉంటుంది ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్. క్రొకడైల్ హంటర్‌గా పేరున్న స్టీవ్ ఇర్విన్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 22వ తేదీన ప్రత్యేకంగా గూగుల్ డూడుల్ రూపొందించింది. ఆయన జీవితంలో కీలక ఘట్టాలను స్లైడ్ షో రూపంలో నెటిజన్ల ముందు ఉంచింది. ప్రకృతి ప్రేమికుడైన స్టీవ్ ఇర్విన్ మొసలిని చేత్తో పట్టుకుని దిగిన ఫోటో డూడుల్‌లో మనం చూడవచ్చు. ఇర్విన్ భార్య టెర్రీ, పిల్లలు బిందీ, రాబర్ట్‌లు కూడా ఇక్కడ మనకు కనిపిస్తారు.
ఈ డూడుల్ గురించి ఇర్విన్ భార్య టెర్రీ ‘‘ఇవాళ గూగుల్ డూడుల్ నా భర్త ఇర్విన్ జీవితంలో కీలక ఘట్టాలు, వైల్డ్ లైఫ్, జంతువుల రక్షణ, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను ఎంతో చక్కగా వివరించింది’’ అంటూ రాసుకుంది. స్టీవ్ ఇర్విన్ 2006లో చనిపోయాడు. నాట్జియో, యానిమల్ ప్లానెట్, డిస్కవరీ ఇలా అనేక చానెళ్లల్లో జంతువులపై వచ్చే డాక్యుమెంటరీల్లో స్టీవ్ నవ్వు ముఖం కనిపించాల్సిందే. ఒడుపుగా మొసళ్లను పట్టడంలో నేర్పరి అయిన స్టీవ్ 'క్రొకడైల్ హంటర్'గా వన్యప్రాణి కార్యక్రమాల్లో ప్రత్యక్షమయ్యేవాడు. నిజానికి.. ఆయన మొసళ్ల రక్షకుడు. అవనే కాదు.. మనం భయంకరమైనవి, ప్రమాదకరమైనవి అనుకునే అనేక జంతువుల్ని మచ్చికచేసుకునేవాడు.
ఇర్విన్ కి తోడుగా ఆయన భార్య టెర్రీ 1996 దశకంలో అనేక యానిమల్ డాక్యుమెంటరీలు రూపొందించారు. ఆయన జీవితం అంతా జంతు సంరక్షణకే అంకితం అయింది. 2006లో ఓ అరుదైన ఫుటేజ్ కోసం సముద్రంలోని మంటా రేలతో కలసి ఈదుతున్న స్టీవ్‌కు ప్రమాదవశాత్తు ఓ మంటా రే ముల్లు గుండెల్లోకి గుచ్చుకుంది. చూడ్డానికి చాలా భారీగా ఉండే ఈ జీవులు అంత హానికరం కాదంటారు. కానీ దురదృష్టవశాత్తూ స్టీవ్ ఈ గాయం వల్ల ప్రాణాలు కోల్పోయాడు. ఇర్విన్ 1992లో టెర్రీని పెళ్ళాడాడు. ఆమెకు కూడా జంతువులు అంటే ఎంతో ఇష్టం. ఇర్విన్ తో పాటు ఆమె అనేక అడవులు తిరిగింది. ఆపదలో వున్న 1200 జంతువుల్ని వారిద్దరు కాపాడారు.
ఇర్విన్ పిల్లలు రాబర్ట్ ఇర్విన్, బిందీ ఇర్విన్లు తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారు. తండ్రి ప్రారంభించిన వన్యప్రాణి సంరక్షణ కేంద్రం బాగోగులు బాగా చూసుకుంటూ తల్లికి చేయూతనిస్తున్నారు. జంతు ప్రపంచాన్ని ఛాయాచిత్రాల్లో బంధిస్తూ రాబర్ట్ ఇప్పుడిప్పుడే పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నాడు. తండ్రి పరిచయం చేసిన ప్రాణుల్ని తండ్రి కన్నా ఎక్కువగా ప్రేమించడం విశేషం. అతడికి నాలుగేళ్లుండగా స్టీవ్ మరణించాడు. తండ్రి తనకు శాశ్వతంగా దూరమవడానికి కారణమైన రంగం నుంచి పక్కకు తప్పుకోకుండా సంరక్షణ బాధ్యతల్లో పాలుపంచుకోవడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
13 hours ago

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా