కోవిడ్19 సమాచారానికి ఏపీ కోవిడ్19 యాప్
25-07-202025-07-2020 09:09:17 IST
Updated On 25-07-2020 10:47:48 ISTUpdated On 25-07-20202020-07-25T03:39:17.340Z25-07-2020 2020-07-25T03:39:07.134Z - 2020-07-25T05:17:48.658Z - 25-07-2020

ఏపీలో కరోనా కేసుల తీవ్రత మరింతగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కోవిడ్-19కు సంబంధించిన ముఖ్య సమాచారం కోసం Covid-19 Andhra Pradesh మొబైల్ అప్లికేషన్ అందుబాటులోకి తెచ్చారు అధికారులు. రాష్ట్రంలో కోవిడ్-19 టెస్టుల సంఖ్య పెంచే కొద్దీ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. కోవిడ్ లక్షణాలు ఉంటే ఎవరిని సంప్రదించాలి?ఎక్కడ టెస్టులు చేయించుకోవాలన్న సందేహాలు ఇప్పటికీ ప్రజల్లో ఉంటున్నాయి. కోవిడ్-19 కి సంబంధించిన అన్ని సందేహాలను తీర్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ *కోవిడ్-19 ఆంధ్రప్రదేశ్ అనే మొబైల్ అప్లికేషన్ రూపొందించింది. కోవిడ్-19పై పోరాటంలో ప్రజలకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలకు సంబంధించిన సమాచారం ఈ మొబైల్ అప్లికేషన్లో ఉంటుంది. రాష్ట్రంలోని కోవిడ్-19 ఆస్పత్రుల వివరాలు, క్వారంటైన్ కేంద్రాల సమాచారం, కోవిడ్ పరీక్షా కేంద్రాలతో పాటు ఏపీలోని కరోనా పాజిటివ్ కేసులు, డిశ్ఛార్జ్ అయిన వారు, మరణాల సంఖ్యతోపాటు ప్రతి రోజు ప్రభుత్వం విడుదల చేసే మీడియా బులిటెన్ సైతం ఈ యాప్ ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మనలో ఉన్న లక్షణాలను బట్టి *కోవిడ్ పరీక్ష* కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ ప్రాంతంలో ఉండే వార్డు వాలంటీర్, ఎఎన్ఎం, డాక్టర్ ను సంప్రదించడం తదితర వివరాలను తెలుసుకోవచ్చు. స్మార్ట్ఫోన్ యూజర్లు యాప్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి లింక్ నుంచి ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కోవిడ్-19కి సంబంధించిన ఎలాంటి సమాచారం కోసమైనా, ఇతర సహాయం కోసమైనా జాతీయస్థాయి హెల్ప్ లైన్ 1075, రాష్ట్రస్థాయిలో సహాయం కోసం 104 నెంబరుకి కాల్ చేయవచ్చు. అలాగే, వై.ఎస్.ఆర్. టెలీమెడిసిన్ నెంబర్ 14410కు మిస్డ్ కాల్ ఇచ్చి ఫోన్ ద్వారా డాక్టర్ గారితో మాట్లాడి మీ ఆరోగ్య సమస్యలను తెలపవచ్చు. ఇంకా కోవిడ్-19 కు సంబంధించిన అధికారిక సమాచారం కోసం 8297104104 వాట్సప్ నెంబర్ కు మెసేజ్ చేయవచ్చు లేదా 8297104104 నెంబర్ కు డయల్ చేసి ఐవిఆర్ఎస్ ద్వారా సహాయం పొందవచ్చు. కేంద్రం అందుబాటులోకి తెచ్చిన ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా సమాచారం తెలుసుకోవచ్చు. ఇప్పటికే ఈ యాప్ ను 15 కోట్లమందికి పైగా డౌన్ లోడ్ చేసుకుని వాడుతున్నారు.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా