newssting
BITING NEWS :
*హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో కారు బీభత్సం. అదుపుతప్పి హోటల్ లోకి దూసుకెళ్లిన కారు. తప్పిన ప్రమాదం, కారు వదలి పరారైన యువకులు. మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లుగా అనుమానం * అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న ట్రంప్. ఎయిర్ పోర్ట్ నుంచి ర్యాలీగా మొతేరా స్టేడియానికి ట్రంప్. మధ్యాహ్నం 12:30 గంటలకు నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగం*విశాఖ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్‌పై స్పందించిన నేవీ..మిలీనియం టవర్స్‌లో సచివాలయం పెట్టుకోవడానికి అనుమతి నిరాకరించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం*జనవరి 10న అమరావతి రైతుల మీద జరిగిన లాఠీఛార్జ్‌పై విచారణ ప్రారంభం..హైకోర్టు ఆదేశాల మేరకు తుళ్లూరులో విచారణ ప్రారంభించిన పోలీసులు..గుంటూరు అడిషనల్‌ ఎస్పీ స్వామిశేఖర్‌ నేతృత్వంలో కొనసాగుతున్న ఎంక్వైరీ *సికింద్రాబాద్ : బోయిన్ పల్లిలోనీ ఓ కెమికల్ గో డౌన్ లో భారీ అగ్నిప్రమాదం*చైనాలో 2400 పైగా చేరిన కోవిద్ 19 వైరస్ మృతులు. 78 వేలకు చేరిన వైరస్ బాధితుల సంఖ్య. ఇటలీలో కరోనా వైరస్ కారణంగా ఇద్దరు మృతి

కోవిడ్ 19 ఎఫెక్ట్,.. మొబైల్ ప్రదర్శన రద్దు

13-02-202013-02-2020 18:24:26 IST
2020-02-13T12:54:26.535Z13-02-2020 2020-02-13T12:54:23.351Z - - 24-02-2020

కోవిడ్ 19 ఎఫెక్ట్,..  మొబైల్ ప్రదర్శన రద్దు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కోవిడ్ 19 (కరోనా) దెబ్బకు దేశాలు విలవిల్లాడుతున్న సంగతి తెలిసిందే. కోవిడ్ 19 వైరస్ వల్ల వేలాదిమంది మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ కారణంగా వ్యాపారాలు కూడా ఢమాల్ మంటున్నాయి.  ఏటా జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ పై కూడా ఈ వైరస్ ప్రతాపం చూపించింది. స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఫిబ్రవరి 24 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించ తలపెట్టిన మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ 2020 ప్రదర్శన రద్దు చేశారు.

జీఎస్‌ఎంఏ ఈ ప్రదర్శనను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో వివిధ మొబైల్ తయారీ కంపెనీలు షాకయ్యాయి. కొన్ని కంపెనీలయితే తాము రాలేమని ప్రకటించాయి. ఈనేపథ్యంలో జీఎస్‌ఎంఏ ఈ ప్రదర్శనను రద్దు చేసింది. కరోనా వైరస్‌ ప్రభావం కారణంగానే ఆయా కంపెనీలు ప్రదర్శనకు హాజరు కావడం లేదని అంటున్నారు. ముఖ్యంగా చైనానుంచి ఎక్కువ కంపెనీలు ఈ ప్రదర్శనకు రావాల్సి వుంది.

ఒకవేళ ప్రదర్శన జరిగితే కరోనా వైరస్ వ్యాపిస్తుందేమోననే భయంతోనే కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. 2006లో మొదటగా ఈ ప్రదర్శన  ప్రారంభం కాగా ప్రతి ఏటా అవే తేదీల్లో ప్రదర్శనను నిర్వహిస్తారు. టెక్నాలజీ రంగంలో వచ్చే మార్పులు, కొత్త మొబైల్ ఫోన్ల గురించి ఇక్కడ వివరిస్తారు. వివిధ కంపెనీలు ఈప్రదర్శన రద్దు కావడంతో తమ నూతన ఉత్పత్తులను వచ్చే నెలలో వేర్వేరుగా విడుదలచేయనున్నాయి. మొత్తం మీద పెద్ద మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ కరోనా దెబ్బకు వణికిపోతోంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle