newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కోవిడ్‌ వ్యాప్తిని ఫోన్లతో పట్టేస్తే... వేగంగా వైరస్‌ల కట్టడి సాధ్యం

03-05-202003-05-2020 06:28:23 IST
Updated On 03-05-2020 09:17:13 ISTUpdated On 03-05-20202020-05-03T00:58:23.422Z03-05-2020 2020-05-03T00:58:20.760Z - 2020-05-03T03:47:13.491Z - 03-05-2020

కోవిడ్‌ వ్యాప్తిని ఫోన్లతో పట్టేస్తే... వేగంగా వైరస్‌ల కట్టడి సాధ్యం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇంటినుంచి బయటకు వచ్చాక మీరు ఎక్కడికి వెళుతున్నారో, ఏఏ ప్రాంతాల్లో తిరిగారో నూటికి నూరుశాతం తేల్చిచెప్పే సదుపాయం మొబైల్స్‌లో ఎప్పటినుంచో ఉందనేది అందరికీ తెలుసు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి జరిగాక ఎవరికి ఎవరి ద్వారా కరోనా వైరస్ సోకిందో తెలుసుకోవడం కంటే ఇంకా మెరుగైన పద్ధతిని పరిశోధకులు కనుగొన్నారు. 2020 జనవరిలో చైనాలోని వూహాన్ నుంచి ప్రజలు పెద్ద ఎత్తున వేర్వేరు ప్రాంతాలకు వెళ్లడంద్వారా కరోనా వైరస్‌ని అన్నిచోట్లా అంటించిన  ఉదంతం బయటపడ్డాక ప్రజల కదలికలను గుర్తించి ముందుగానే కరోనా జాడల్ని పసిగట్టే ఒక వినూత్నమైన డేటా విశ్లేషణ పద్దతిని ఏల్ యూనివర్సిటీ సైంటిస్టులు కనుగొన్నారు. ఇక ముందు వ్యాధుల జాడను పసిగట్టడంలో ఈ కొత్త పద్దతి అద్బుత ఫలితాలను అందిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు

వివరాల్లోకి వెళ్లి చూస్తే..మొబైల్‌ఫోన్‌ డేటా విశ్లేషణ ద్వారా ప్రజల కదలికలను గుర్తించి తద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తిని రెండు వారాల ముందుగానే గుర్తించవచ్చునని అమెరికాలోని యేల్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. నేచర్‌ జర్నల్‌ తాజా సంచికలో ఈ పరిశోధన తాలూకూ వివరాలు ప్రచురితమయ్యాయి. ఈ ఏడాది జనవరిలో చైనాలోని వుహాన్‌ నుంచి ప్రజలు ఏ రకంగా వేర్వేరు ప్రాంతాలకు వెళ్లారో పరిశీలించి, ఆ సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చినట్లు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త నికోలస్‌ క్రిస్టాకిస్‌ తెలిపారు. 

ప్రజలు పెద్ద సంఖ్యలో వేర్వేరు ప్రాంతాలకు ప్రయాణమైతే స్థానికంగా ఉన్న ఆరోగ్య సమస్య కాస్తా ప్రపంచవ్యాప్త మహమ్మారిగా మారిపోతుందని నికోలస్‌ తెలిపారు. జనవరి ఒకటవ తేదీ నుంచి వుహాన్‌లో లాక్‌డౌన్‌ నిబంధనలను విధించినప్పటి జనవరి 24వ తేదీ మధ్యలో కనీసం రెండు గంటల పాటు ఆ మహా నగరంలో గడిపిన వారి వివరాలను తాము సేకరించామని, చైనాలోని 31 ప్రావిన్సుల్లోని కోవిడ్‌ బాధితుల సమాచారంతో దీని పోల్చి చూశామని నికోలస్‌ తెలిపారు. ప్రజల కదలికలను సుమారు 94 శాతం వరకూ నిలిపివేసిన క్వారంటైన్‌ నిబంధనలు వ్యాధి నియంత్రణలో ఎంతో కీలకమయ్యాయని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. 

అంతేకాకుండా ప్రజలు ఎలా ఎక్కడెక్కడకు కదిలారన్నది మొబైల్‌ఫోన్‌ డేటా ఆధారంగా గుర్తించడం వల్ల రెండు వారాల ముందుగానే వ్యాధి ఎక్కడెక్కడకు ఎంత మేరకు విస్తరిస్తుందో గుర్తించడం వీలైందని వివరించారు. తాము ఉపయోగించిన మోడల్‌ ద్వారా కరోనా వంటి మహమ్మారులు ఏఏ నగరాలను తాకే అవకాశముందో కూడా ముందుగా తెలుసుకోవచ్చునని చెప్పారు. సమీప భవిష్యత్తులో కోవిడ్‌ –19 సామాజిక స్థాయిలో వ్యాపించడం మొదలుపెడితే దాన్ని ముందుగానే గుర్తించడం ద్వారా కట్టడి చర్యలు సమర్థంగా పనిచేస్తాయని నికోలస్‌ వివరించారు. 

ప్రస్తుతం సాంక్రమిక వ్యాధుల జాడను పసిగట్టే పద్ధతుల స్థానంలో జనాభా కదలికలపై రియల్ టైమ్ డేటాను సేకరించి విశ్లేషిస్తే జనం కదలికలను మరింత నిశితంగా అంచనా వేయవచ్చని ఈ కొత్త పద్ధతి చెబుతోంది. అంటే ఫోన్ యూజ్ డేటా మరియు, అతి పెద్ద డేటా మూలం వంటివి జనం కదలికలను వాస్తవసమయంలో అతివేగంగా కనిపెడతాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మోడల్‌‌ను అమల్లోకి తెస్తే సాంక్రమిక వ్యాధుల ప్రభావాన్ని పరిమితం చేసి, మానవ జీవితాలను కాపాడటంలో ఇది మన విధాన నిర్ణేతలకు, సాంక్రమిక వ్యాధుల అధ్యయన శాస్త్రవేత్తలకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

ఏదైనా కొత్త ఆవిష్కరణ రంగంలోకి వస్తే గేమ్ చేంజర్ అంటూడటం పరిపాటి. జనం కదలికలపై మొబైల్ ద్వారా నిఘాపెట్టి వాటి ఆధారంగా జనాన్ని ఏకమొత్తంగా క్వారంటైన్ చేయగలిగితే వైరస్ల నియంత్రణకు వేగంగా పూనుకోవచ్చని ఈ కొత్త రకం డేటా విశ్లేషణ పద్దతి తెలుపుతోంది.

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   21 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle