కొంపముంచిన టిక్ టాక్ వీడియో
15-05-202015-05-2020 12:20:41 IST
Updated On 15-05-2020 12:36:39 ISTUpdated On 15-05-20202020-05-15T06:50:41.539Z15-05-2020 2020-05-15T06:50:00.725Z - 2020-05-15T07:06:39.872Z - 15-05-2020

అసలే లాక్ డౌన్ టైం జనం టిక్ టాక్ వీడియోలతో హల్ చల్ చేస్తున్నారు. అయితే తమ భద్రత గురించి యువత ఆలోచించడం లేదు. సెల్ఫీలతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్న యువతీయువకులు ఇప్పుడు టిక్ టాక్ వీడియోల కోసం రిస్క్ చేస్తున్నారు. కర్నాటకలో ఓ యువకుడు టిక్‌టాక్ వీడియో చిత్రీకరిస్తూ కరెంట్ షాక్‌తో గాయపడ్డాడు. 22 ఏళ్ల యువకుడు కదులుతున్న గూడ్స్ రైలుపై నిలబడి టిక్‌టాక్ వీడియో చిత్రీకరిస్తున్నాడు. ఇంతలో ఈ గూడ్స్ రైలు హైటెన్షన్ విద్యుత్ వైర్ల కిందినుంచి వెళుతోంది. అది గమనించని యువకుడు టిక్ టాక్ వీడియోలో హడావిడిగా వున్నాడు. దీంతో హైటెన్షన్ వైర్లకు తగిలి యువకుడికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో అతడి ప్రాణానికి ప్రమాదం తప్పింది. మైసూర్ నుంచి వస్తున్న గూడ్స్ రైలు బెంగళూరు మెజెస్టిక్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ఈ సమయంలో నెమ్మదిగా నడుస్తున్న గూడ్స్ రైలుపై టిక్‌టాక్ వీడియో చేసేందుకు ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. వీడియో తీసుకునే సమయంలో హైటెన్షన్ విద్యుత్ వైరు తగలడంతో షాక్ తగిలి కిందపడిపోయాడు. ఇది గమనించిన రైల్వే అధికారులు ఆ యువకుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. టెక్నాలజీ ముసుగులో యువత ప్రాణాలకు మీదకు తెచ్చుకోవడం విమర్శలకు గురవుతోంది. ఒక్కోసారి రైల్వే ట్రాక్ లపై వీడియోలు, సెల్ఫీలు దిగుతుండడంతో ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. ఇటీవల కర్నాటకలో యువ జంట ఓ నది దగ్గరకు వెళ్లి సెల్ఫీ తీసుకుంటూ నదిలో పడి దుర్మరణం పాలయిన సంగతి తెలిసిందే. యువత తమ ప్రాణాలను లెక్కచేయకుండా ఇలాంటి క్రేజీ పనులకు సిద్ధపడుతూ కన్నవారికి శోకాన్ని మిగులుస్తున్నారు.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా