newssting
BITING NEWS :
*హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో కారు బీభత్సం. అదుపుతప్పి హోటల్ లోకి దూసుకెళ్లిన కారు. తప్పిన ప్రమాదం, కారు వదలి పరారైన యువకులు. మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లుగా అనుమానం * అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న ట్రంప్. ఎయిర్ పోర్ట్ నుంచి ర్యాలీగా మొతేరా స్టేడియానికి ట్రంప్. మధ్యాహ్నం 12:30 గంటలకు నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగం*విశాఖ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్‌పై స్పందించిన నేవీ..మిలీనియం టవర్స్‌లో సచివాలయం పెట్టుకోవడానికి అనుమతి నిరాకరించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం*జనవరి 10న అమరావతి రైతుల మీద జరిగిన లాఠీఛార్జ్‌పై విచారణ ప్రారంభం..హైకోర్టు ఆదేశాల మేరకు తుళ్లూరులో విచారణ ప్రారంభించిన పోలీసులు..గుంటూరు అడిషనల్‌ ఎస్పీ స్వామిశేఖర్‌ నేతృత్వంలో కొనసాగుతున్న ఎంక్వైరీ *సికింద్రాబాద్ : బోయిన్ పల్లిలోనీ ఓ కెమికల్ గో డౌన్ లో భారీ అగ్నిప్రమాదం*చైనాలో 2400 పైగా చేరిన కోవిద్ 19 వైరస్ మృతులు. 78 వేలకు చేరిన వైరస్ బాధితుల సంఖ్య. ఇటలీలో కరోనా వైరస్ కారణంగా ఇద్దరు మృతి

కొంపముంచిన టిక్ టాక్ ప్రేమ.. పెళ్ళికి నో చెప్పాడని ఆత్మహత్య

09-02-202009-02-2020 10:24:32 IST
Updated On 10-02-2020 17:37:28 ISTUpdated On 10-02-20202020-02-09T04:54:32.350Z09-02-2020 2020-02-09T04:54:28.846Z - 2020-02-10T12:07:28.185Z - 10-02-2020

కొంపముంచిన టిక్ టాక్ ప్రేమ.. పెళ్ళికి నో చెప్పాడని ఆత్మహత్య
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈరోజుల్లో సోషల్ మీడియా జనంలోకి బాగా చొచ్చుకుపోతోంది. ఒక్కోసారి వారి మధ్య అగాధాలు కూడా సృష్టిస్తోంది. ముఖ్యంగా ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రాం, టిక్ టాక్ ల ద్వారా పరిచయాలు పెంచుకుని ప్రేమలో పడిపోతున్నారు యువతీ యువకులు. తాజాగా ఓ యువతి టిక్ టాక్ ప్రేమలో పడి.. ఓ యువకుడిని గాఢంగా ప్రేమించింది. కుర్రాడు పెళ్లికి నిరాకరించడంతో ఆత్మహత్యకు ప్రయత్నించింది.

వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకి చెందిన స్వప్న కు  హైదరాబాద్ లో ఓ ఐపీఎస్ అధికారి దగ్గర కార్ డ్రైవర్ గా పనిచేస్తున్న వీరబాబుతో టిక్ టాక్ లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.

తరచూ వీరిద్దరూ ఫోన్ చేసుకుని మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో వీరబాబుని పెళ్లి చేసుకోమని స్వప్న అడగడంతో వీరబాబు నిరాకరించాడు. ఆ అమ్మాయి బ్రతిమాలాడింది, ప్రాధేయపడింది కానీ వీరబాబు పట్టించుకోలేదు.

దీంతో జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన  జూబ్లీహిల్స్ పోలీసులు ఇద్దరిరి పిలిపించారు. వీరికి కౌన్సిలింగ్ ఇస్తున్న సమయంలో వీరబాబు అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదని, ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవటం కుదరదని నిక్కచ్చిగా చెప్పేశాడు. 

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన స్వప్న పోలీస్ స్టేషన్ బయటికి వచ్చి బ్లేడ్ తో కోసుకోవటానికి ప్రయత్నించడం పోలీసులు గమనించి అదుపులోకి తీసుకురన్నారు. సమీపంలోని ఆసుపత్రి కి తరలించారు. ఎటువంటి ప్రమాదం జరగకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle