newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కియా సెల్టోస్‌కి పోటీ ఇవ్వనున్న ఆల్ న్యూ హ్యుండయ్ క్రెటా

04-03-202004-03-2020 14:12:04 IST
Updated On 04-03-2020 14:18:21 ISTUpdated On 04-03-20202020-03-04T08:42:04.237Z04-03-2020 2020-03-04T08:42:01.973Z - 2020-03-04T08:48:21.299Z - 04-03-2020

కియా సెల్టోస్‌కి పోటీ ఇవ్వనున్న ఆల్ న్యూ హ్యుండయ్ క్రెటా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈనెల భారత్‌లో లాంఛ్‌ కానున్న ఆల్‌ న్యూ హ్యుందాయ్‌ క్రెటా ఇంటీరియర్స్‌ను కంపెనీ వెల్లడించింది. మరో వారంలో లాంచింగ్‌కు సిద్ధమైన వాహనాన్ని ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ రూ 25,000 చెల్లించి బుక్‌ చేసుకోవచ్చు. భిన్న ఇంజన్‌, గేర్‌బాక్స్‌ కాంబినేషన్‌తో కూడిన న్యూ హ్యుందాయ్‌ క్రెటా ఈ, ఈఎక్స్‌, ఎస్‌, ఎస్‌ఎక్స్‌, ఎస్‌ఎక్స్‌ (ఓ) విభాగాల్లో లభిస్తోంది. 

న్యూ హ్యుందాయ్ క్రెటా నలుపు మరియు లేత గోధుమరంగు రంగులతో సరికొత్త డ్యూయల్-టోన్ క్యాబిన్‌తో ఆకర్షణీయంగా రూపొందింది. ఎయిర్-కాన్ వెంట్స్, డోర్ హ్యాండిల్స్ చుట్టూ సొగసైన క్రోమ్ ఇన్సర్ట్‌లు ఉన్నాయి. తొలిసారి హ్యుందాయ్ క్రెటాకు ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ లభిస్తోంది.

ఇంకా ప్రత్యేకతల విషయానికి వస్తే రిమోట్ ఇంజిన్ స్టార్ట్, రియర్ సీట్ హెడ్‌రెస్ట్ కుషన్, బోస్ సౌండ్ సిస్టమ్ మరియు రెండు-దశల వెనుక సీటు రిక్లైనింగ్ ఫంక్షన్‌తో అందుబాటులోకి రానుంది. 

రెండవ తరం హ్యుందాయ్ క్రెటా ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కోసం 7 అంగుళాల డిస్‌ప్లేతో,10.25-అంగుళాల సమాంతర టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్లూలింక్ స్మార్ట్‌వాచ్ యాప్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, యాంబియంట్ లైటింగ్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టిపిఎంఎస్), రియర్ వ్యూ మానిటర్ వంటి ఫీచర్లతో రూపొందింది. బీఎస్‌ 6 ప్రమాణాలతో ఆల్‌ న్యూ హ్యుందాయ్‌ క్రెటా కస్టమర్ల ముందుకు రానుంది.

హ్యుండయ్ క్రెటా బీఎస్6 ప్రమాణం కలిగిన ఇంజన్లతో మూడు రకాల వెర్షన్లతో వస్తోంది. చౌకధరతో కూడిన పెట్రోల్‌తో నడితే రకం 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ సామర్థ్యంతో పనిచేస్తుంది. ఇది 115పిఎస్ పవర్‌ని 250 ఎన్ఎమ్ టార్క్యూని కలిగి ఉంటుంది. ఇక రెండో రకం పెట్రోల్ వాహనం 1.4 లీటర్ల టర్బో జీడీఐ ఇంజన్‌తో పస్తోంది. ఇది 140 పీఎస్ పవర్‌తో 242 ఎన్ఎమ్ టార్క్యూతో వస్తోంది. ఇక మూడవదైన 1.5 లీటర్ వీజీటీ రకం 115 పిఎస్ పవర్‌తో, 250 ఎన్ఎమ్ టార్క్యూతో మార్కెట్లోకి వస్తోంది. 

హ్యుండయ్ క్రెటా భారతీయ మార్కెట్లో గత కొద్దినెలలుగా దూసుకుపోతున్న కియా సెల్టోస్‌తో పోటీ పడనుంది. గత సంవత్సరమే అనంతపురం జిల్లాలో ప్రారంభమైన కియా మోటర్స్ ఈ జనవరిలోనే 15 వేల యూనిట్లను విక్రయించింది. క్రెటా కొత్త వెర్షన్ కారు తనదైన ధనిక వినియోగదార్లను ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.

Image result for Hyundai Creta interiors revealed in pictures, bookings open

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   3 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle