కాళ్లబేరానికొచ్చిన జియో.. కొత్త రీచార్జ్ ప్లాన్లు
22-10-201922-10-2019 10:42:23 IST
2019-10-22T05:12:23.748Z22-10-2019 2019-10-22T05:12:18.700Z - - 10-04-2021

వినియోగదారుల తీవ్రనిరనసలతో ప్రముఖ టెలికాం కంపెనీ రిలయెన్స్ జియో కాళ్లబేరానికి వచ్చినట్లే ఉంది. ఇటీవల నిమిషానికి 6 పైసల చార్జీల వడ్డనపై నిరసనలు వెల్లువెత్తడంతో జియో కొత్త ఎత్తుగడతో వచ్చినట్టు కనిపిస్తోంది. జియో ‘ఆల్ ఇన్ వన్ ప్లాన్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒకే ప్లాన్‌తో అపరిమిత సేవలు అందించనుంది. జియో ఆల్ ఇన్ వన్ ప్లాన్‌లో ప్రతిరోజూ 2జీబీ డాటాతో పాటు అన్ లిమిటెడ్ కాల్స్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు జియో పేర్కొంది. ఉచిత ఐయూసీ కాల్స్ ఆఫర్‌తో ‘జియో ఆల్ ఇన్ వన్ ప్లాన్స్ (మూడు రీచార్జ్ ప్లాన్ల)ను సోమవారం తీసుకొచ్చింది. ఈ ప్లాన్ల ద్వారా రోజుకు 2 జీబీడేటాను అందిస్తోంది. ప్రధానంగా ఈ ప్లాన్లలో విశేషం ఏమిటంటే జియోయేతర మొబైల్ నంబర్లకు 1,000 నిమిషాల ఉచిత టాక్‌టైమ్‌ను ఆఫర్ చేస్తోంది. దీంతోపాటు ఎప్పటిలాగే జియో టు జియో అన్లిమిటెడ్ కాలింగ్ సదుపాయం. రిలయన్స్ జియో కొత్త మంత్లీ ప్లాన్లను లాంచ్ చేసింది. ఈ కొత్త ప్లాన్స్ ఒక నెలకు రూ. 222, 2 నెలలకు రూ. 333, 3 నెలలకు రూ. 444 లు ప్లాన్లను ఎంపిక చేసుకోవచ్చు. తమ కొత్త ప్లాన్స్ ఇతర ప్రత్యర్థి కంపెనీల కంటే మార్కెట్లో కనీసం 20-50 వరకు వరకు చౌకగా ఉన్నాయని జియో ఒక ప్రకటనలో తెలిపింది. జియో కస్టమర్లు తమ ప్లాన్స్‌ను రూ. 111తో అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని పేర్కొంది. 3 నెలల 2జీబీ ప్యాక్(రూ. 448) తో పోలిస్తే.. రూ. 444 మాత్రమే ఖర్చు అవుతుంది. రూ. 396 (198x2) ప్లాన్స్‌లో మునుపటి ఖర్చుతో పోలిస్తే ఇపుడు రూ. 333 మాత్రమే ఖర్చవుతుందని, అలాగే అదనంగా 1,000 నిమిషాల ఐయూసీ వాయిస్ కాల్స్ ఉచితమని జియో తెలిపింది. విడిగా దీన్ని కొనాలంటే 80 రూపాయలు వినియోగదారుడు వెచ్చించాల్సి వస్తుందని జియో వెల్లడించింది. కాగా ఇంటర్‌కనెక్ట్ యూజర్ ఛార్జీ పేరుతో నిమిషానికి రూ. 6 పైసల వసూలును ఇటీవల జియో ప్రకటించింది. అలాగే ఒక రోజు వాలిడిటీ ఉన్న రూ.19 ప్లాన్‌ను, 7రోజుల వాలిడిటీ రూ. 52ప్లాన్‌ను తొలగించింది. దీనిపై వినియోగదారుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం కాగా, అటు ప్రత్యర్థి కంపెనీ వొడాఫోన్ స్పందిస్తూ తాము ఎలాంటి ఐయూసీ చార్జీలు వసూలు చేయబోమని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇతర టెలికాం కంపెనీల కంటే తక్కువ ధరకు తాము ఉత్తమ సేవలను అందిస్తున్నట్టు జియో చెబుతోంది. బేస్ ప్లాన్‌కు అదనంగా చెల్లించే రూ.111 ప్లాన్‌తో మరో నెల పాటు అపరిమిత సేవలు పొందొచ్చని తెలిపింది. ఇదిలా ఉంటే ఇతర కంపెనీలు రూ.249లతో నెలకు ఇచ్చే సౌకర్యాలను జియో రూ. 222లకే ఇస్తోంది. రెండు నెలల ప్లాన్‌ను ఇతరులు రూ. 500లకు ఇస్తుంటే జియో రూ.333లకే అందిస్తోంది. ప్రస్తుత జియో 3నెలల ప్లాన్ రూ. 448గా ఉంటే దాన్ని రూ. 444గా మార్చారు. దీంతో అదనంగా వెయ్యి నిమిషాల వాయిస్ కాల్స్(ఇతర నెట్ వర్క్ లకు) పొందొచ్చు. అలాగే రెండు నెలల ప్లాన్ రూ.396 బదులుగా రూ.333 మాత్రమే చెల్లించాలి. దీనిలో కూడా అదనంగా 1000 నిమిషాల వాయిస్ కాల్స్ పొందే అవకాశం ఉంది.

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
3 hours ago

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా