newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కాలర్ ట్యూన్ కాదది.. కరోనా ట్యూన్

10-03-202010-03-2020 13:53:44 IST
2020-03-10T08:23:44.570Z10-03-2020 2020-03-10T08:23:28.609Z - - 23-04-2021

కాలర్ ట్యూన్ కాదది.. కరోనా ట్యూన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఫోన్ మోగితే చాలు వందల రకాల కాలర్ ట్యూన్‌లు ప్రతి క్షణం వినిపిస్తూ మొబైల్ ప్రపంచాన్ని గణగణలాడిస్తూండటం గత పదేళ్లుగా చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుుడు భారతదేశంలోని ప్రతి ఫోన్‌ కూడా కొన్నాళ్లు కరోనా ట్యూన్ వినిపించబోతోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ముందస్తు ఆలోచన సెల్ ఫోన్లలో కొత్తరకం ట్యూన్‌ని వినిపిస్తోంది. 

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ గురించి, నివారణ చర్యలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడానికి కేంద్ర వైద‍్య ఆరోగ్య శాఖ ఓ అడుగు ముందుకు వేసింది. మీరు ఎవరికైనా ఫోన్‌ చేస్తే ముందుగా దగ్గుతున్న శబ్దం వస్తుంది.  ఆ తర్వాత దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చేతులు శుభ్రం చేసుకోవడం, జన సమ్మర్థం ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లకుండా ఉండటం వంటి సూచనలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం 30 సెకన్ల నిడివి గల ఓ ఆడియో క్లిప్‌ను  కేంద్ర వైద‍్య ఆరోగ్య శాఖ రూపొందించింది. 

ఇప్పుడు మీరు ఎవరికి ఫోన్‌ చేసినా ముందుగా దగ్గు, ఆ తర్వాత జాగ్రత్తలు పాటించడనే సందేశాన్ని వినిపిస్తోంది. ఏ మొబైల్‌ వినియోగదారుడైనా ఈ సందేశం వినకుండా తప్పించుకునే వీలు లేకుండా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని మొబైల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు ఆదేశాలిచ్చింది. గతంలో ఎప్పుడూ ఇలా అన్ని ఫోన్లకూ ఒకే కాలర్‌ ట్యూన్‌ వచ్చిన దాఖలాలు లేవు. దీంతో పలువురు వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కొందరికి ఫోన్‌ చేస్తే మాత్రం మాములుగానే రింగ్‌ సౌండ్‌ వినిపిస్తోందని పలువురు వినియోగదారులు చెబుతున్నారు.

రోజుకు ఓ 20 ఫోన్‌ కాల్స్‌ చేస్తే... ప్రతిసారి ఈ కాలర్‌ ట్యూన్‌ను వినాల్సిందేనా అని పలువురు వాపోతున్నారు. మరోవైపు కరోనా ట్యూన్‌పై సోషల్‌ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. అంతేకాకుండా కరోనా సందేశం వినిపించకుండా ...ఏం చేయాలనే దానిపై సుచనలు, సలహాలు కూడా ఇస్తున్నారు కొందరు. అయితే కరోనా ట్యూన్‌ తమ ప్రాణానికి వచ్చిందిరా బాబు అంటూ కొంతమంది విసుక్కుంటున్నారు కూడా. కాగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 45 కరోనా వైరస్‌ కేసులు నమోదు అయ్యాయి.

ఇప్పటికే 76 దేశాల్లో విస్తరించి 3,300 మందిని బలిగొన్న కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా లక్షమందికి సోకింది. భారత్‌లో కూడా విస్తరిస్తున్న కరోనా వైరస్ గురించి అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించడానికి కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా ట్యూన్‌ను తప్పనిసరిగా చేస్తూ టెలికాం ప్రొవైడర్లకు ఆదేశాలిచ్చింది.

కాగా, విదేశాలకు వెళ్లి తిరిగి వస్తూ తమ పర్యటన వివరాలను దాచి ఉంచుతున్న వారిపట్ల కఠిన చర్య తీసుకోవాల్సిందిగా కేరళ ప్రభుత్వం ఆదేశమిచ్చింది. గత నెల ఇటలీకి వెళ్లిన దంపతులు, వారి కుమారుడు తమ విదేశీ ప్రయాణం గురించి దాచివుంచటంతో  వారి బంధువులకు కూడా తర్వాత కరోనా వైరస్ సోకటం పట్ల కేరళ ప్రభుత్వం సీరియస్ అయింది. పైగా వీరు ఎయిర్ పోర్టు స్క్రీనింగ్‌ను కూడా తప్పించుకుని వచ్చారన్న  వార్త కలకలం రేపుతోంది

 

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   21 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle