newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కళ్ల అలసటకు స్వస్తి.. ఇక వాట్సప్‌లో డార్క్ మోడ్

27-12-201927-12-2019 15:34:31 IST
Updated On 27-12-2019 16:58:27 ISTUpdated On 27-12-20192019-12-27T10:04:31.673Z27-12-2019 2019-12-27T10:04:08.407Z - 2019-12-27T11:28:27.172Z - 27-12-2019

కళ్ల అలసటకు స్వస్తి.. ఇక వాట్సప్‌లో డార్క్ మోడ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వాట్సప్ ఇప్పుడు అందరికీ చేరువ అవుతోంది. వినియోగదారులకు వివిధ రకాల కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది వాట్సప్. తాజాగా వాట్సప్ డార్క్ మోడ్ ను ఇంట్రడ్యూస్ చేస్తోంది. రాత్రివేళ కళ్ళకు శ్రమ లేకుండా వాట్సప్ డార్క్ మోడ్ పనిచేస్తుంది. ఇప్పటికే ఆండ్రాయిడ్ వెర్షన్ రెడీ అయింది. త్వరలో ఐవోఎస్ వెర్షన్ కూడా సిద్ధమవుతోందని తెలుస్తోంది. 

బ్రిటన్ కు చెందిన ఓ వెబ్ సైట్ ఆండ్రాయిడ్ యూజర్లలో అనేక మంది ఈ డార్క్ మోడ్ ను ఉపయోగిస్తున్నట్టు తెలిపింది. ఇంటర్నెట్ సమాచారం అంతా తెల్లని బ్యాక్ గ్రౌండ్లో కనిపిస్తుంది. దీనివల్ల కళ్ళు అలసటకు గురవుతుంటాయి. ఇప్పుడు డార్క్ మోడ్ లో దీనికి రివర్స్ లో కనిపిస్తాయి. అంటే నల్లని బ్యాక్ గ్రౌండ్లో తెల్లని అక్షరాలు మనకు కనిపిస్తాయి. దీని వల్ల రాత్రి సమయాల్లో వాట్సప్ మెసేజ్ లు చూడడానికి అంతగా శ్రమపడాల్సిన పని వుండదు. ఈ ఫీచర్ త్వరలో అందరికీ అందుబాటులోకి రానుందని వాట్సప్ చెబుతోంది.

వాట్సప్ కి ఇండియా భారీ మార్కెట్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం భారతదేశంలో వాట్సప్ వినియోగదారుల సంఖ్య 400 మిలియన్లకు చేరింది. రోజురోజుకీ ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఫేస్ బుక్ లా వాట్సప్ కూడా సేఫేనా అని చర్చ జరుగుతోంది. వివిధ మెసేజ్ ల విషయంలో జాగ్రత్తగా వ్యవరించాలని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎన్నికల సమయంలో ఈ వాట్సప్ వినియోగం పెరగడంతో కొన్ని నిబంధనలు అమలుచేసింది. ఏకంగా 2 మిలియన్ల అకౌంట్లను వాట్సప్ తొలగించిన సంగతి తెలిసిందే. గ్రూప్ మెసేజ్ ల విషయంలో వాట్సప్ కఠినమయిన నిబంధనలను అమలుచేస్తోంది. వాట్సప్ తీసుకుంటున్న జాగ్రత్తల వల్ల, ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్ట్ కావడం వల్ల థర్డ్ పార్టీకి మనం పంపే మెసేజ్‌లు చూసే అవకాశం ఉండదు. తాజాగా వచ్చిన డార్క్ మోడ్ ఎలా పనిచేస్తుందో చూడాలి. 

 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle