newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా వైరస్ నుంచి రక్షణకు ‘ఆరోగ్యసేతు’ యాప్

03-04-202003-04-2020 09:06:10 IST
Updated On 03-04-2020 12:21:24 ISTUpdated On 03-04-20202020-04-03T03:36:10.614Z03-04-2020 2020-04-03T03:35:56.535Z - 2020-04-03T06:51:24.793Z - 03-04-2020

కరోనా వైరస్ నుంచి రక్షణకు ‘ఆరోగ్యసేతు’ యాప్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా వైరస్ తన ప్రతాపం చూపుతోంది.  మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో ముందడుగు వేసి అధికారికంగా ఓ యాప్‌ను విడుదల చేసింది. ఆరోగ్య సేతు కోవిద్-19 ట్రాకర్ యాప్‌ను విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.  కరోనా వైరస్‌ కారణంగా ఇప్పటివరకూ 53 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 2,069 మందికి వైరస్‌ సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

వైరస్‌ బారిన పడ్డ వారిలో 155 మందికి నయం కావడం లేదా డిశ్చార్జ్‌ అయిపోవడం లేదా వలస వెళ్లిపోవడంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్‌–19 బాధితుల సంఖ్య 1,860గా ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. కోవిడ్‌ కారణంగా గత 24 గంటల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని, వీరిలో మహారాష్ట్రకు చెందిన వారు నలుగురు కాగా, మధ్యప్రదేశ్‌కు చెందిన వారు ముగ్గురని, పంజాబ్‌ నుంచి ఒక్కరు ఉన్నారు. 

కరోనా వైరస్ సోకిన వ్యక్తుల్ని గుర్తించడానికీ,  కరోనా నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికీ  కొద్దిసేపటి క్రితం  భారత ప్రభుత్వం అధికారికంగా "ఆరోగ్య సేతు"  అనే పేరుతో అత్యంత ఉపయోగకరమైన  కోవిడ్-19 ట్రాకింగ్ యాప్ ను  తెలుగుతో పాటు దాదాపుగా 11 భాషల్లో  రూపొందించింది.  మీకు కావాల్సిన భాషను మీరు ఎంచుకోవచ్చు. లొకేషన్ డేటా  మరియు బ్లూటూత్ లకు పర్మిట్లు ఇవ్వడం ద్వారా వైరస్ సోకిన వ్యక్తి మీ సమీపంలోకి వస్తే వెంటనే మీకు అలెర్ట్ వస్తుంది. అలాగే కరోనా పేషంట్ కు దగ్గర్లోకి వెళ్ళిన వారి వివరాలను కూడా ఈ యాప్ ఆరోగ్య శాఖకు  అందచేసి వైద్య సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. 

దీనితోపాటు  కరోనా వైరస్ గురించిన అనేక సూచనలనీ, సమాధానలనీ, సమాచారాలనీ , ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్డేట్లనీ కూడా మీరు ఈ యాప్ ద్వారా పొందవచ్చు.  నేను ఇంతకు ముందే ఈ యాప్ ను నా ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లలో  ఉపయోగించి చూసాను. చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ ఉపయోగకరమైన యాప్ ను మీరూ వాడి చూడండి. 

ఐ ఫోన్ యూజర్ల కోసం

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల కోసం

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle