newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా వైరస్ కు విరుగుడు.. ఐఐటీ కొత్త ఆవిష్కరణ

11-04-202011-04-2020 17:53:53 IST
2020-04-11T12:23:53.194Z11-04-2020 2020-04-11T12:16:52.209Z - - 12-04-2021

కరోనా వైరస్ కు విరుగుడు.. ఐఐటీ కొత్త ఆవిష్కరణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇప్పుడు ఎక్కడ చూసినా జనం కరోనా వైరస్ పేరు చెబితే వణికిపోతున్నారు. భారత్ లో కరోనా వైరస్ బారిన పడి మరణించివారి సంఖ్య భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవడం, మనం తినే ఆహారపదార్ధాలను శుద్ధి చేసుకోవడం ఎంతో అవసరం.

నిత్యావసరాలైన పాలు, కిరాణా సామాన్ల ద్వారా ఈ వైరస్‌ వ్యాప్తి చెందకుండా చూసేందుకు రోపార్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) పరిశోధకులు ఒక వినూత్న సాధనాన్ని అభివృద్ధి చేశారు. ఇది అతినీలలోహిత కిరణాల సాయంతో సదరు వస్తువులను క్రిమిరహితంగా మారుస్తుంది. దీన్ని ఇంటి వాకిలి వద్ద పెట్టుకొని.. వెలుపలి నుంచి తెచ్చే వస్తువులను శుద్ధి చేసుకోవచ్చని పరిశోధకులు తెలిపారు.

బాబోయ్.. దీని ధర ఎక్కువుంటుందని మీరు కంగారుపడాల్సిన పనిలేదు. దీని ధర రూ.500 కన్నా తక్కువేనని ఐఐటియన్లు తెలిపారు. వస్తువులను ఇది అర గంటలోనే క్రిమిరహితంగా మారుస్తుంది.. అనంతరం వాటిని ఉపయోగించడానికి 10 నిమిషాల ఆగితే సరిపోతుందంటున్నారు.

చూడటానికి ఈ సాధనం ఒక ఇనుప పెట్టెలా ఉంటుందని ఇందులో కూరగాయలు, పాల ప్యాకెట్లు, చేతి గడియారాలు, పర్సులు, మొబైల్‌ ఫోన్లు వంటి వాటిని ఉంచితే ఇందులో వుండే యువీ కిరణాలు బ్యాక్టీరియా, వైరస్ ను నాశనం చేస్తుంది. అతినీలలోహిత క్రిమిసంహారక ఇరాడియేషన్ పరిజ్ఞానాన్ని ఇందులో ఉపయోగించారు. దీంతో ఇది ఎంతో సురక్షితం అంటున్నారు. 

ఇదిలా వుంటే.. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్  విధించే అవకాశాలున్నాయి. ప్రధాని - సీఎంల వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రజారోగ్యానికే పెద్దపీట వేయాలని ఏకాభిప్రాయం కుదిరింది. లాక్‌డౌన్ కొనసాగించాలని సూచించారు పలు రాష్ట్రాల సీఎంలు. దేశవ్యాప్తంగా 15 రోజుల పాటు లాక్ డౌన్ పొడిగించాలని ప్రధానికి ముఖ్యమంత్రుల సూచించారు. పరిశ్రమలకు ,వ్యవసాయానికి మినహాయింపు ఇవ్వాలన్నారు. రాష్ట్రాలకు వేగంగా రాపిడ్ టెస్టింగ్ కిట్స్ పంపాలని ప్రధానిని కోరారు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle