newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా వైరస్‌పై బీఎస్ఎన్ఎల్, జియో ఏం చేశాయంటే.. ?

07-03-202007-03-2020 14:47:51 IST
2020-03-07T09:17:51.205Z07-03-2020 2020-03-07T09:17:34.042Z - - 23-04-2021

కరోనా వైరస్‌పై బీఎస్ఎన్ఎల్, జియో  ఏం చేశాయంటే.. ?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చేతిలో సెల్ ఫోన్ లేకుంటే క్షణం కూడా గడవదు. 90 దేశాలకు వ్యాపించిన కరోనా వైరస్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. ఈ నేపథ్యంలో దేశీయ టెలికాం సంస్థలు కీలక ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులకు కాల్‌ చేసిననపుడు ఒక అవగాహన సందేశాన్ని ప్లే చేస్తోంది. కరోనావైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి నివారణకు అనుసరించాల్సిన ముందు  జాగ్రత్త చర్యలతో ఈ సందేశం నిండి వుంది. ఇది వినియోగదారులను ఆకట్టుకుంటోంది. 

భారత ప్రభుత్వ రంగసంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌,  రిలయన్స్‌ జియో వినియోగదారులకు ఫోన్‌ చేసినపుడు  ఈ సందేశాన్ని వినియోగదారులకు అందిస్తోంది. జియో, బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు ఫోన్ చేసిన వెంటనే ఒక సందేశం వినిపిస్తోంది. ప్రీ కాలర్ ట్యూన్ అవగాహన సందేశం జియో,  బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫోన్ కనెక్షన్లలో ప్రారంభమైంది. ఫోన్ చేశాక దగ్గు శబ్దంతో సందేశం ప్రారంభమవుతుంది. 

"మీరు కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఆపవచ్చు. దగ్గినపుడు లేదా తుమ్ముతున్నప్పుడు మీ ముఖాన్ని చేతిరుమాలు అడ్డుపెట్టుకోండి. సబ్బుతో చేతులను నిరంతరం శుభ్రం చేసుకోండి" అనే సందేశం హిందీ, ఆంగ్లంలో ప్లే అవుతుంది. "ముఖం, కళ్ళు లేదా ముక్కును తాకకండి. ఎవరికైనా దగ్గు, జ్వరం లేదా ఊపిరి కష‍్టంగా వుంటే వారినుంచి కనీసం ఒక మీటర్‌ దూరంలో వుండండి. అవసరమైతే, వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించండి" అనే సందేశం వినిపిస్తోంది. 

కరోనా వైరస్ చాలా సాధారణంగా ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది, దగ్గు లేదా ముక్కు కారడం లాంటి ప్రారంభ లక్షణాలతో దానిని గుర్తించవచ్చు.కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కేసుల వల్ల ఇది జ్వరంతో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. తర్వాత పొడి దగ్గు తీవ్రంగా ఉంటుంది. ఇది వారం వరకూ అదే పరిస్థితి కొనసాగితే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మొదలవుతాయి. కానీ సీరియస్ కేసుల్లో ఇన్ఫెక్షన్ న్యుమోనియా లేదా సార్స్‌గా మారుతుంది.

కిడ్నీలు ఫెయిలై రోగి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. దగ్గు, తుమ్ములు వచ్చినప్పుడు కర్ఛీఫ్ లేదా తువాలు అడ్డుగా పెట్టుకోవాలి. షేక్ హ్యాండ్ ఇవ్వడం మానేయాలి. తరచూ చేతులను శానిటైజర్, హ్యాండ్ వాష్ తో శుభ్రం చేసుకోవాలి. కరోనావైరస్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

మొదట్లో కేవలం చైనాకు మాత్రమే పరిమితమైన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక్క అంటార్కిటికా ఖండంలో తప్ప అన్ని ఖండాలకు విస్తరించింది. రోజూ వందలాదిగా కొత్త కేసులు నమోదవుతునే ఉన్నాయి. ఈ వైరస్ విషయంలో అంతా జాగ్రత్తగా వుండాలి. కరోనా వైరస్ పై ప్రచారంలో బీఎస్ఎన్ఎల్, జియో ముందున్నాయి. మరిన్ని సంస్థలు కూడా ఈ ప్రచారంలో భాగస్వామ్యం కావడం సామాజిక బాధ్యత. 

 

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   21 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle