newssting
BITING NEWS :
*న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మరో 62 పాజిటివ్ కేసులు...మొత్తంగా 283కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*అత్యధికంగా హైదరాబాద్ లో 139 కేసులు నమోదు *దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

కరోనా భయం .. పెరిగిన డేటా, గేమింగ్ యాప్స్ వినియోగం

24-03-202024-03-2020 08:41:23 IST
Updated On 24-03-2020 12:05:11 ISTUpdated On 24-03-20202020-03-24T03:11:23.730Z24-03-2020 2020-03-24T03:11:16.572Z - 2020-03-24T06:35:11.451Z - 24-03-2020

కరోనా భయం .. పెరిగిన డేటా, గేమింగ్ యాప్స్ వినియోగం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఉద్యోగులు ఆఫీసులకు వెళ్ళక్కర్లేదు. పిల్లలకు స్కూల్స్ సెలవు. దీంతో ఆటవిడుపుకోసం జనం మొబైల్స్ మీద పడ్డారు. దీంతో డేటా వినియోగం భారీగా పెరిగిపోయింది. రోజుకి 2 జీబీ కూడా వాడని వారు ఇప్పుడు డబుల్ డేటా వినియోగిస్తున్నారు. దీంతో వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు చేసేవారు ఇబ్బందులు పడుతున్నారు. ఇటు పిల్లల ఎక్కువగా ఇష్టపడే గేమింగ్ యాప్స్ కి బాగా డిమాండ్ పెరిగింది.

పుస్తకాలు చదవడం, కామిక్స్ చూడడం ఎక్కువైంది. గత రెండు నెలలుగా మొబైల్ బ్రౌజింగ్ యాప్ యాక్టివిటీ దాదాపు 40 శాతం పెరిగినట్టు ఓ నివేదిక వెల్లడించింది. కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో ఇళ్లకే పరిమితమైన ప్రజలు మొబైల్స్‌కే పరిమితమై న్యూస్, సమాచారం, ఎంటర్‌టైన్మెంట్ వంటి వాటిని అందులోనే వెతుక్కుంటున్నారు. ఈ విషయాన్ని బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ నివేదిక తెలిపింది.

జనవరి తొలి వారం నుంచి ఈ నెల 11 వరకు డేటా సిగ్నల్స్‌ను విశ్లేషించడం ద్వారా ఈ నివేదిక విడుదల చేసింది. దేశవ్యాప్తంగా లొకేషన్ ట్రెండ్స్, వినియోగదారుల ఇన్‌-యాప్ బిహేవియర్‌ను వెల్లడించింది. జనవరి నుంచి బుక్స్, కామిక్ యాప్స్ వినియోగం 200 శాతం పెరగ్గా, గేమింగ్ యాప్స్ వినియోగం 120 శాతం వరకూ పెరిగింది. ఇమేజ్, వీడియో ఎడిటింగ్ యాప్ వినియోగం 60 శాతం పెరిగింది. మొబైల్ బ్రౌజింగ్ యాప్ యాక్టివిటీ 37 శాతం పెరిగింది. మార్చి 5 నుంచి అయితే ఇమేజ్, వీడియో ఎడిటింగ్ యాప్ వినియోగం రాకెట్ స్పీడ్ అందుకుందని వివరించింది. ఫిబ్రవరి 12 నుంచి గేమింగ్ యాప్‌ల వినియోగం బాగా పెరిగింది.

నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్, ఆహా లాంటి ఓటీటీ యాప్స్ ను డౌన్లోడ్ చేసుకుని నాన్ స్టాప్ స్ట్రీమ్ చేస్తుంటారు. కానీ కొన్ని యాప్స్ సబ్ స్క్రిప్షన్ చార్జీలు ఎక్కువగా ఉండటం వల్ల వేరే వాటిపై ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఈరోస్ నౌ యాప్ ప్రజలకు బంపరాఫర్ ఇచ్చింది. రాబోయే రెండు నెలలు ఉచితంగా వాడుకునే అవకాశం కలుగుతోంది. ఈ యాప్ లో ఎవరైతే ‘స్టే ఫ్రీ’ అని ఇంగ్లీష్ కోడ్ ఉపయోగిస్తారో వాళ్లకు రెండు నెలలు యాప్ లోని సినిమాలు.. ప్రోగ్రామ్స్, రియాలిటీ షోలను ఉచితంగా పొందవచ్చు. అలాగే అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ వంటి అప్లికేషన్స్ కూడా ఇదే బాటలో వెళ్లనున్నాయి. 

జియో భలే ఆఫర్లు

టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఇంటి నుంచి పని చేసేవారికి అదనపు ప్రయోజనాలను కలిగిస్తూ నూతన 4జీ డేటా వోచర్లను తాజాగా ప్రకటించింది. 4జీ సౌకర్యంతో పాటుగా టాక్‌టైమ్‌ను రూ. 11 నుంచి రూ. 101 ప్లాన్స్ వరకు అందుబాటులో ఉంచింది. ఒకసారి అధిక వేగంతో డేటా ముగిసిన తర్వాత 64 కేబీపీఎస్‌తో అపరిమితంగా ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చని తెలిపింది.

అందులో భాగంగా రూ.11 – 800ఎంబీ డేటా.. 75 నిమిషాల టాక్‌టైమ్‌ లభిస్తుంది. రూ.21 – 2జీబీ డేటా.. 200 ని.టాక్‌టైమ్‌ అందుబాటులో ఉంది. రూ.51 – 6జీబీ డేటా.. 500 ని.టాక్‌టైమ్‌ అందిస్తోంది. రూ.101 – 12 జీబీ డేటా.. 1000 ని.టాక్‌టైమ్‌ అందిస్తోంది. కరోనా వల్ల డేటా వినియోగం బాగా పెరిగిందని, కస్టమర్లకు అందుబాటులో ఉండేలా ఈ ప్లాన్స్ అందిస్తామని జియో తెలిపింది. డేటా వినియోగం పెరగడం వల్ల నిజంగా పనిచేసేవారు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. 

 

 

మొబైల్ రీఛార్జ్ ఇబ్బందులకు చెక్.. ఏటీఎంకి వెళితే చాలు

మొబైల్ రీఛార్జ్ ఇబ్బందులకు చెక్.. ఏటీఎంకి వెళితే చాలు

   6 hours ago


సూపర్ మార్కెట్ వద్దు.. ఆన్‌లైన్ డెలివరీ ముద్దు

సూపర్ మార్కెట్ వద్దు.. ఆన్‌లైన్ డెలివరీ ముద్దు

   8 hours ago


నిత్యావసరాల సరఫరాకు సరికొత్త మార్గం.. నైబర్‌వుడ్ సప్లై యాప్

నిత్యావసరాల సరఫరాకు సరికొత్త మార్గం.. నైబర్‌వుడ్ సప్లై యాప్

   07-04-2020


ఆపిల్ నయా అవతార్.. అప్పుడు మాస్కులు.. ఇప్పుడు ఫేస్ షీల్డ్స్

ఆపిల్ నయా అవతార్.. అప్పుడు మాస్కులు.. ఇప్పుడు ఫేస్ షీల్డ్స్

   07-04-2020


వాట్సాప్ హ్యాకింగ్‌తో కుటుంబాలు, మిత్రులకు చేటు

వాట్సాప్ హ్యాకింగ్‌తో కుటుంబాలు, మిత్రులకు చేటు

   05-04-2020


క‌రోనా విజృంభిస్తున్న వేళ ఈ యాప్‌లతో ఉపయోగమెంతో?

క‌రోనా విజృంభిస్తున్న వేళ ఈ యాప్‌లతో ఉపయోగమెంతో?

   04-04-2020


కరోనా వైరస్ నుంచి రక్షణకు ‘ఆరోగ్యసేతు’ యాప్

కరోనా వైరస్ నుంచి రక్షణకు ‘ఆరోగ్యసేతు’ యాప్

   03-04-2020


కరోనాపై యుద్ధానికి గూగుల్, టిక్ టాక్ భారీ సాయం

కరోనాపై యుద్ధానికి గూగుల్, టిక్ టాక్ భారీ సాయం

   02-04-2020


కరోనా బాధితుల కోసం ఫోన్ పే ఇన్స్యూరెన్స్

కరోనా బాధితుల కోసం ఫోన్ పే ఇన్స్యూరెన్స్

   02-04-2020


హానర్ నయా స్మార్ట్ ఫోన్.. ధర కాస్త ఎక్కువే

హానర్ నయా స్మార్ట్ ఫోన్.. ధర కాస్త ఎక్కువే

   01-04-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle