newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా బాధితుల కోసం ఫోన్ పే ఇన్స్యూరెన్స్

02-04-202002-04-2020 09:44:32 IST
Updated On 02-04-2020 11:37:03 ISTUpdated On 02-04-20202020-04-02T04:14:32.245Z02-04-2020 2020-04-02T04:14:24.616Z - 2020-04-02T06:07:03.553Z - 02-04-2020

కరోనా బాధితుల కోసం ఫోన్ పే ఇన్స్యూరెన్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశమంతా కరోనా భయం పీడిస్తోంది. తాజాగా 1834 కేసులు నమోదయ్యాయి. లాక్ డౌన్ అమలు అవుతున్నా కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు. ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫోన్ పే కేవలం రూ.156లకే బీమా పాలసీని తీసుకువచ్చింది. బజాజ్ అలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో ‘కరోనా కేర్’ పేరుతో ఈ బీమాను అందుబాటులోకి తెచ్చింది. కరోనా వైరస్ బారిన పడి ఆస్పత్రిలో చేరిన వారి వైద్య ఖర్చులకు ఈ బీమా ఆసరాగా ఉంటుందని ఫోన్ పే సంస్థ అధికారులు చెబుతున్నారు. ఒకేసారి రూ.156 చెల్లించి బీమా తీసుకుంటే వైద్య ఖర్చుల నిమిత్తం రూ.50 వేల వరకూ ఫోన్ పే చెల్లించనుంది.

హాస్పిటల్‌లో చేరడానికి ముందు తరువాత మొత్తం 30 రోజుల పాటు వైద్య పరీక్షలు, మందుల కొనుగోలు అయ్యే తదితర ఖర్చులను కూడా ఫోన్ పే చెల్లించనుంది. ఈ బీమాను కొనుగోలు చేసిన 15 రోజుల్లోగా కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తేనే ఇది చెల్లుబాటు అవుతుందని షరతులు విధించింది ఫోన్ పే సంస్థ. 55 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న వారు మాత్రమే దీనికి అర్హులవుతారు.

మరోవైపు కరోనా విశ్వాన్నే భయపెడుతోంది.  ఇప్పటి వరకు అమెరికాలో 4476 మంది కరోనాకు బలవ్వగా.. 2,13,372 కేసులు నమోదయ్యాయి. కేవలం న్యూయార్క్‌లోనే మరణాలు అధికంగా నమోదవ్వడం పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ నగరంలో దాదాపు 2 వేల మంది మృత్యువాతపడ్డారు. భారతదేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. ఈనెల 14 వరకూ లాక్ డౌన్ అమలుచేయనున్నారు.

ప్రజలంతా చేతులు శుభ్రం చేసుకోవాలని, కళ్లు, ముక్కు మొహానికి తాకకుండా చూసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.  ఢిల్లీలోని స‌ఫ్త‌ర్‌జంగ్ హాస్పిట‌ల్‌లో ప‌నిచేస్తున్నఇద్ద‌రు వైద్యులు కోవిడ్ భారిన ప‌డ్డారు. వారిలో ఒక‌రు ఇదే హాస్పిట‌ల్‌లో క‌రోనా రోగుల‌కు చికిత్స అందిస్తుండ‌గా, మ‌రొక‌రు బ‌యోకెమిస్ట్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ మూడ‌వ సంవ‌త్స‌రం చ‌దువుతున్న విద్యార్థిని. ఈమె కొన్నివారాల క్రిత‌మే విదేశాల‌కు వెళ్లివ‌చ్చిన‌ట్లు అధికారులు చెప్పారు.

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   3 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle