కరోనా దెబ్బ... పడిపోయిన స్మార్ట్ ఫోన్ అమ్మకాలు
29-08-202029-08-2020 08:28:05 IST
Updated On 29-08-2020 08:36:57 ISTUpdated On 29-08-20202020-08-29T02:58:05.153Z29-08-2020 2020-08-29T02:57:40.566Z - 2020-08-29T03:06:57.087Z - 29-08-2020

కనిపించని కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఆర్ధిక వ్యవస్థ మొత్తం స్తబ్ధంగా మారిపోయింది. పరిపాలన, విద్య, వైద్యరంగం, టెక్నాలజీ రంగాల్లో భారీగా పతనం నమోదవుతోంది. అగ్రరాజ్యాల కరెన్సీ సైతం కరోనా ప్రభావం నుండి కోలుకోలేకపోతోంది.. అమెరికన్ డాలర్ కొద్దిరోజులుగా గ్రాఫ్ పడిపోతోంది. అధ్యక్ష ఎన్నికలు జరిగే వేళ పౌరులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న కరోనా కేసులు ఒకవైపు, ఉద్యోగాలు కోల్పోతూ మరోవైపు యువత భవితపై బెంగతో వుంది. అమెరికాలో అలాంటి విపత్కర పరిస్థితులు వుంటే మిగతా ప్రపంచ దేశాల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు. ఈ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలపై పడుతుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ సేల్స్ పడిపోయాయని నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే రెండు అతిపెద్దస్మార్ట్ ఫోన్ మార్కెట్లు చైనా, ఇండియా. రెండుదేశాల్లో 260 కోట్లమందికి పైగా జనాభా వుంది. ఏమోడల్ డిజైన్ చేసినా రెండుదేశాల్లోని అన్ని వర్గాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళుతుంటాయి కంపెనీలు. అలాంటి ఈ భారీ మార్కెట్లో అమ్మకాల తగ్గుదల భారీగా కనిపిస్తోందని తాజాగా ఓ సర్వేలో తేలింది. గత సంవత్సరం రెండో క్వార్టర్ అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు 20.4 శాతం తగ్గాయి. చైనాలో అమ్మకాలు ఏడు శాతం, ఇండియాలో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు 46 శాతం తగ్గినట్లుగా ఆ సర్వే తెలిపింది. ఉన్నంతలో అమ్మకాలపరంగా మొదటి స్థానంలో శామ్సంగ్ నిలవగా తదుపరిస్థానాల్లో హువావే, ఆపిల్, షావోమీ, ఒప్పోలు ఉన్నాయి. అయితే చైనాలో పరిస్థితులు చక్కబడుతున్నకొద్దీ డిమాండ్ రికవరీ అవుతోందని తెలుస్తోంది. ప్రయాణాలపై ఆంక్షలు పెట్టడం, అత్యవసరం కాని వస్తువుల కొనుగోళ్లు తగ్గడంతో స్మార్ట్ ఫోన్ల సేల్స్ పడిపోయాయని వివరించారు. జనం ఆహారం, పోషకాహారం, వైద్యం వంటి అత్యవసరమయిన వాటికే ఎక్కువగా ఖర్చులు చేస్తున్నారు. చైనా వస్తువులపై భారత్ నిషేధం విధించడంతో చైనా స్మార్ట్ ఫోన్ మార్కెట్లో వివిధ స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్ ల అమ్మకాలు తగ్గాయి. చైనాలో హువావే మార్కెట్ లీడర్. దీనికి అక్కడ 42 శాతం వరకు మార్కెట్ షేర్ తో శామ్సంగ్ స్థాయిలో ఇది ఫోన్లను అమ్మగలుగుతోంది. అయితే అమెరికా ప్రభుత్వం ఆంక్షల్లో భాగంగా గూగుల్ సేవలను వాడొద్దని ఆదేశాలు ఉన్నాయి. దీంతో హువావే ఫోన్లలో గూగుల్ ప్లేసర్వీసులు లేకుండానే విడుదల చేసింది. దీంతో కస్టమర్లు హువావేకు దూరమవుతున్నారు.

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021
ఇంకా