newssting
BITING NEWS :
*న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మరో 62 పాజిటివ్ కేసులు...మొత్తంగా 283కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*అత్యధికంగా హైదరాబాద్ లో 139 కేసులు నమోదు *దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

కరోనా ఎఫెక్ట్.. బీఎస్ఎన్ఎల్, జియో బంపర్ ఆఫర్లు

26-03-202026-03-2020 08:04:57 IST
Updated On 26-03-2020 08:04:55 ISTUpdated On 26-03-20202020-03-26T02:34:57.884Z26-03-2020 2020-03-26T02:34:31.109Z - 2020-03-26T02:34:55.210Z - 26-03-2020

కరోనా ఎఫెక్ట్.. బీఎస్ఎన్ఎల్, జియో బంపర్ ఆఫర్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో వివిధ రకాల సెల్ కంపెనీల వినియోగదారుల కోసం బంపర్ ఆఫర్లు ప్రకటించాయి. వర్క్ ఫ్రం హోం కారణంగా ఎక్కువ మంది వినియోగదారులు డేటా వినియోగం పెరగడంతో పలు ఆఫర్లు ప్రకటించాయి. దేశీయ సెల్ ప్రొవైడర్ బీఎస్ఎన్ఎల్ కరోనా కారణంగా దేశంలో నెలకొన్న పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. కొత్తగా కనెక్షన్లు తీసుకున్నవారికి నెలరోజుల పాటు ఉచితంగా బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం కల్పిస్తోంది.

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు, వివిధ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని సూచించిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో తమకు మరిన్ని కొత్త కనెక్షన్లు వస్తాయని బీఎస్ఎన్ఎల్ అంచనా వేస్తోంది. అందుకే కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు ఫ్రీ బ్రాడ్ బ్యాండ్ అంటూ సరికొత్త ప్లాన్ ప్రకటించింది. ఇప్పటికే ల్యాండ్ లైన్ కనెక్షన్ ఉన్నవారు కొత్తగా బ్రాండ్ బ్యాండ్ సౌకర్యం కావాలనుకున్నా ఈ ఆఫర్ వర్తిస్తుంది, మరో సౌలభ్యం ఏంటంటే ఇన్ స్టలేషన్ చార్జీలు కూడా వసూలు చేయడం లేదు. కానీ ఇంటర్నెట్ మోడెం కొనుగోలు చేయాలి. 

బీఎస్ఎన్ఎల్ కి తోడు జియో సంస్థ పలు అవకాశాలిచ్చింది. ఇంటి నుండి పని చేసేందుకు ఉద్యోగులకు అదనపు ప్రయోజనాలతో సవరించిన జియో 4జీ డేటా వోచర్‌లను జియో ప్రకటించింది. దీని ప్రకారం రూ.11-101 విలువైన 4జీ డేటా ఓచర్లతో రెట్టింపు డేటా, ఇతర నెట్‌వర్క్‌లకు అదనపు టాక్‌టైమ్‌ సదుపాయం కల్పిస్తున్నట్లు రిలయన్స్‌ జియో తెలిపింది. అధికవేగం డేటా పరిమితి ముగిశాక 64 కేబీపీఎస్‌ వేగంతో అపరిమితంగా వాడుకోవచ్చు. రూ.11కు 800 ఎంబీ అధికవేగం డేటా, 75 నిమిషాల టాక్‌టైమ్‌; రూ.21కి 2జీబీ డేటా 200 ని.టాక్‌టైమ్‌, రూ.51కి 6జీబీ డేటా, 500 ని.టాక్‌టైమ్‌, రూ.101కి 12 జీబీ డేటా, 1000 ని.టాక్‌టైమ్‌ లభిస్తుంది.

అంతేకాదు రూ.251 ప్లాన్ తో వర్క్ ఫ్రం హోం ఆఫర్ అందిస్తోంది. రోజుకి 2 జీబీ డేటాతో 51 రోజులు ఈ సేవలను పొందవచ్చని జియో ప్రకటించింది. 2 జీబీ డేటా ముగిశాక 64 ఎంబీపీఎస్ స్పీడ్ వస్తుంది. అయితే ఈ ఆఫర్లో ఎస్ఎంఎస్ లు, కాల్స్ చేసుకునే సదుపాయాలు లేవు. డేటా మాత్రమే అందుబాటులో వుంటుంది. బీఎస్ఎన్ఎల్ కు ఈ ఆఫర్ పోటీగా భావిస్తున్నారు. ప్రస్తుతం యాక్టివ్ ప్లాన్స్ వుంటే ఈ ఆఫర్ ద్వారా అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. 

 

మొబైల్ రీఛార్జ్ ఇబ్బందులకు చెక్.. ఏటీఎంకి వెళితే చాలు

మొబైల్ రీఛార్జ్ ఇబ్బందులకు చెక్.. ఏటీఎంకి వెళితే చాలు

   6 hours ago


సూపర్ మార్కెట్ వద్దు.. ఆన్‌లైన్ డెలివరీ ముద్దు

సూపర్ మార్కెట్ వద్దు.. ఆన్‌లైన్ డెలివరీ ముద్దు

   8 hours ago


నిత్యావసరాల సరఫరాకు సరికొత్త మార్గం.. నైబర్‌వుడ్ సప్లై యాప్

నిత్యావసరాల సరఫరాకు సరికొత్త మార్గం.. నైబర్‌వుడ్ సప్లై యాప్

   07-04-2020


ఆపిల్ నయా అవతార్.. అప్పుడు మాస్కులు.. ఇప్పుడు ఫేస్ షీల్డ్స్

ఆపిల్ నయా అవతార్.. అప్పుడు మాస్కులు.. ఇప్పుడు ఫేస్ షీల్డ్స్

   07-04-2020


వాట్సాప్ హ్యాకింగ్‌తో కుటుంబాలు, మిత్రులకు చేటు

వాట్సాప్ హ్యాకింగ్‌తో కుటుంబాలు, మిత్రులకు చేటు

   05-04-2020


క‌రోనా విజృంభిస్తున్న వేళ ఈ యాప్‌లతో ఉపయోగమెంతో?

క‌రోనా విజృంభిస్తున్న వేళ ఈ యాప్‌లతో ఉపయోగమెంతో?

   04-04-2020


కరోనా వైరస్ నుంచి రక్షణకు ‘ఆరోగ్యసేతు’ యాప్

కరోనా వైరస్ నుంచి రక్షణకు ‘ఆరోగ్యసేతు’ యాప్

   03-04-2020


కరోనాపై యుద్ధానికి గూగుల్, టిక్ టాక్ భారీ సాయం

కరోనాపై యుద్ధానికి గూగుల్, టిక్ టాక్ భారీ సాయం

   02-04-2020


కరోనా బాధితుల కోసం ఫోన్ పే ఇన్స్యూరెన్స్

కరోనా బాధితుల కోసం ఫోన్ పే ఇన్స్యూరెన్స్

   02-04-2020


హానర్ నయా స్మార్ట్ ఫోన్.. ధర కాస్త ఎక్కువే

హానర్ నయా స్మార్ట్ ఫోన్.. ధర కాస్త ఎక్కువే

   01-04-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle