newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనాపై యుద్ధానికి గూగుల్, టిక్ టాక్ భారీ సాయం

02-04-202002-04-2020 13:48:02 IST
2020-04-02T08:18:02.488Z02-04-2020 2020-04-02T08:17:56.549Z - - 14-04-2021

కరోనాపై యుద్ధానికి గూగుల్, టిక్ టాక్ భారీ సాయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ మహమ్మారినుంచి బయటపడేందుకు ప్రముఖులు, దిగ్గజ సంస్థలు తమవంతు సాయం చేస్తూనే వున్నాయి. కోవిడ్-19పై పోరుకు గూగుల్ సంస్థ భారీ సాయం చేయనుంది. చిన్న,మధ్య తరహా వ్యాపారులను ఆదుకుంటామని అందుకు రూ.5,990 కోట్లు సాయం చేస్తామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. చిన్న వ్యాపారాలతోపాటు మహమ్మారి కరోనాపై చేస్తున్న ఆరోగ్య సంస్థలు, ప్రభుత్వాలు, ఆరోగ్య కార్యకర్తలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు.  

వీటితో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా ప్రభుత్వ సంస్థలకు రూ.1,872 కోట్లుయాడ్ గ్రాంట్స్‌ను గూగుల్ అందించనుంది. వ్యక్తిగత రక్షణ పరికరాలు ఇతర వైద్య పరికరాల ఉత్పత్తిని పెంచడానికి ఆర్థిక సహాయం అందించనుంది. . త్వరలో 2 నుంచి మూడు మిలియన్ల ఫేస్‌మాస్క్‌లను ఉత్పత్తి చేసేందుకు మాజిడ్ గ్లోవ్స్ అండ్ సేఫ్టీతో కలిసి గూగుల్ పనిచేస్తోంది. 

అలాగే కమ్యూనిటీ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్లు, ఎన్జీవోలకు ప్రకటన గ్రాంట్లలో 20 మిలియన్ డాలర్లు ఇవ్వనుండగా, గూగుల్ యాడ్స్ క్రెడిట్స్‌లో 340 మిలియన్ డాలర్లు  మేర అర్హత ఉన్న ఖాతాలకు గూగుల్ స్వయంచాలకంగా క్రెడిట్‌ను అందుబాటులో ఉంచనుంది. చిరువ్యాపారులను ఆదుకునే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్జీవోలు, ఫైనాన్షియల్ సంస్థలకు 200 మిలియన్ డాలర్ల నిధిని ప్రకటించింది.

కరోనా వైరస్ మహమ్మారిపై అధ్యయనం చేసేందుకు విద్యాసంస్థలు, పరిశోధకులకు గూగుల్ క్లౌడ్‌లో 20 మిలియన్ డాలర్లను అందించనుంది. తద్వారా టీకాలు రూపకల్పన, చికిత్సలను అధ్యయనం చేయడానికి లేదా డేటాను ట్రాక్ చేయడానికి ఉపయోగించుకోవచ్చని  పిచాయ్ వివరించారు. గూగుల్ భారీ సాయంపై ప్రశంసలు అందుకుంటోంది. 

ఇటు కరోనా వైరస్‌ కట్టడికి భారత్‌ చేస్తున్న ప్రయత్నాలకు టిక్‌టాక్‌ భారీ విరాళం ప్రకటించింది. కరోనా బాధితులకు సేవలందిస్తున్న వైద్యులకు సుమారు నాలుగు లక్షల హజ్మత్‌ సూట్‌లు, రెండు లక్షల మాస్కు లు సమకూర్చేందుకు సిద్ధమైంది. వీటి విలువ సుమారు వంద కోట్ల రూపాయల వరకూ ఉంటుందని అంటున్నారు.

కరోనా వ్యాప్తిని అరికట్టడంలో సామాజిక దూరంతో పాటు, వైద్యులు సురక్షితంగా ఉండటం అత్యవసరమని టిక్‌టాక్‌ పేర్కొంది. కేంద్ర జౌళి శాఖ సహకారం తో తాము నిర్ణీత ప్రమాణాలతో కూడిన సూట్లు, మాస్కులు సిద్ధం చేశామని, వీటిని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు అందజేస్తామని తెలిపింది. టిక్ టాక్ సంస్థకు భారత్ మంచి మార్కెట్. యూత్ ఎక్కువగా ఈ యాప్ వైపు ఆకర్షితులవుతున్నారు. 

 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle