newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనాకు చెక్ పెట్టే ఎల్జీ మాస్క్.. ధరెంతో తెలుసా?

01-09-202001-09-2020 16:02:43 IST
Updated On 01-09-2020 16:06:25 ISTUpdated On 01-09-20202020-09-01T10:32:43.307Z01-09-2020 2020-09-01T10:32:37.997Z - 2020-09-01T10:36:25.268Z - 01-09-2020

కరోనాకు చెక్ పెట్టే ఎల్జీ మాస్క్.. ధరెంతో తెలుసా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా కేసుల తీవ్రత బాగా పెరిగింది. ప్రపంచంలో ఒకరోజు 80 వేల కేసులు ఈమధ్యకాలంలో నమోదు కాలేదు. దీంతో ఇండియాలో కరోనా తీవ్రత ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పనిసరి అయింది.

ఈ నేపథ్యంలో ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఎల్‌జీ ప్యూరీకేర్ వేరబుల్ ఎయిర్ ప్యూరిఫైర్ ఫేస్ మాస్కును ఆవిష్కరించింది. రెండు ప్యాన్‌లు కలిగిన ఈ ఫేస్‌మాస్క్ తాజా, పరిశుభ్రమైన గాలిని అందిస్తుంది. మాస్క్ పెట్టుకుంటే వచ్చే ఇబ్బందులు దీని ద్వారా మీకు రావు. 

అందరికీ అమరే సైజులలో లభిస్తున్న ఈమాస్కులలో రెస్పిరేటరీ సెన్సార్ కూడా ఉందని ఎల్ జీ చెబుతోంది. సెప్టెంబరులో జరగనున్న ఐఎఫ్ఏ 2020లో దీనిని ప్రదర్శించనున్న ఎల్‌జీ ధర వివరాలను మాత్రం ప్రకటించలేదు.

ఎల్‌జీ ప్యూరీకేర్ వేరబుల్ ఎయిర్ ప్యూరిఫైర్‌లో గాలిని శుద్ధి చేసేందుకు రెండు హెచ్13 హెచ్‌ఈపీఏ ఫిల్టర్లు ఉపయోగించారు. ఇందులో అంతర్గతంగా రెండు ప్యాన్లను ఉపయోగించారు. ఇవి మూడు స్పీడ్ లెవల్స్ కలిగి ఉంటాయి. గాలి పీల్చుకునేటప్పుడు ఇవి వాటంతట అవే వేగం పుంజుకుని, వదిలేటప్పుడు నెమ్మదిగా గాలిని బయటకు విడులచేయడం విశేషం. 

ఈ మాస్క్‌లో ఉపయోగించిన రెస్పిరేటరీ సెన్సార్ మాస్క్ ధరించిన వారి శ్వాస చక్రం, పరిమాణాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా ఫ్యాన్ల వేగాన్ని సర్దుబాటు చేయడం విశేషం. ఫేస్‌మాస్క్‌లో 820 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. లో మోడ్‌లో 8 గంటలు, హై మోడ్‌లో రెండు గంటలు పనిచేస్తుంది. మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మాస్కు వేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు అది సరిగ్గా ఉపయోగించినప్పుడు మాత్రమే కలుగుతాయని గమనించాలి. మాస్కు వేసుకునేటప్పుడు, తీసివేసేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. 

మాస్కు వేసుకునేవారికి జాగ్రత్తలు

* మాస్కు వేసుకునే ముందు, తీసివేసిన తర్వాత, ప్రతిసారి తప్పనిసరిగా సబ్బు మరియు నీటితో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి  

* మాస్కుపై ఉన్న మడతలు బయటకు కనిపించాలి. కిందికి ఉండాలి  

* తాళ్లు ఉన్న మాస్కు అయితే మొదట పైతాళ్లు ఆ తర్వాత కింది తాళ్లు ముడి వేయాలి. తీసేటప్పుడు మాత్రం మొదటి కొంది తాళ్లు ఆ తర్వాత పై తాళ్లు విప్పాలి 

* రింగులు ఉన్న మాస్కు అయితే, రింగులు ఉపయోగిస్తూ  వేసుకోవాలి, తియ్యాలి  

* మీరు వేసుకున్న మాస్కు నోటిని, ముక్కును పూర్తిగా కప్పాలి  

* మాస్కుపై భాగాన్ని పదేపదే తాకకూడదు. మాస్కు తీసిన తర్వాత మీ కంటిని, నోటిని, ముక్కును తాకవద్దు. 

* మీ మాస్కు ఇతరులతో పంచుకోవద్దు. ఇతరుల మాస్కు మీరు వాడొద్దు  

* వదులుగా ఉన్న మాస్కు వేసుకోవద్దు. దానివల్ల బయట వున్న వైరస్ మీ నోటికి చేరుతుంది. 

* మాస్కు తేమ లేదా తడిగా అయితే వెంటనే మార్చాలి

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle