newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఒప్పో రీనో 3 వచ్చేస్తోంది.. ఫీచర్లు ఏంటంటే?

11-11-201911-11-2019 09:15:56 IST
2019-11-11T03:45:56.174Z11-11-2019 2019-11-11T03:45:46.628Z - - 10-04-2021

ఒప్పో రీనో 3 వచ్చేస్తోంది.. ఫీచర్లు ఏంటంటే?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అఫొర్డబుల్‌ ఫ్లాగ్‌షిప్‌... ఇప్పుడు మొబైల్‌ మార్కెట్‌లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఫ్లాగ్‌షిప్‌ ఫీచర్లను అందుబాటు ధరలో అందించడం దీని ప్రత్యేకత. ఒప్పో ఇటీవల ఈ రేంజిల్‌లో రీనో పేరుతో ఓ సిరీస్‌ను తీసుకొచ్చింది. కెమెరా ప్రధానంగా రీనో సిరీస్‌ను ఒప్పో లాంచ్‌ చేసింది. రీనో 1, రీనో 2 సిరీస్‌లో వచ్చిన మొబైళ్లన్నీ మంచి ఆదరణ పొందాయి.

ఇప్పుడు వీటికి సక్సెసర్‌గా రీనో3 సిరీస్‌ను తీసుకురాబోతోంది. ఈ మొబైల్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్స్‌ ఇప్పుడు బయటకు వచ్చాయి. గత రెండు సిరీస్‌ల మొబైళ్లకు అదనపు ఫీచర్లు జోడించి ఈ రీనో3ను తీసుకొస్తారని సమాచారం. అయితే ఈ మొబైల్‌ ఎప్పుడు లాంచ్‌ చేస్తారనే విషయంలో స్పష్టత లేదు.

ఒప్పో రీనో3లో 6.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ ఆమోలెడ్‌ స్క్రీన్‌ ఉంటుంది. 90 హెడ్జ్‌ రిఫ్రెష్‌ రేటుతో ఇది పని చేస్తుంది. 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. వూక్‌ 4.0 ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టు ఉంటుంది. యూఎస్‌బీ టైప్‌-సి పోర్టుతో తీసుకొస్తున్నారు. వెనుకవైపు నాలుగు కెమెరాలుంటాయి. వాటిలో ఒకటి 60 ఎంపీ ప్రధాన కెమెరా ఉండబోతోంది. 13 ఎంపీ టెలీఫొటో షూటర్‌, 8 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా ఇస్తున్నారు. ముందువైపు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా అందిస్తున్నారు. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 6తో ముందు, వెనుక ప్రొటెక్ట్‌ చేస్తున్నారు.

ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ఉంటుంది. సరికొత్త క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 735 ప్రాసెసర్‌తో తీసుకొస్తున్నారు. ఇందులో 3.1 యూఎస్‌బీ టైప్‌ సి పోర్ట్‌ ఉంటుంది. దీంతోపాటు డ్యూయల్‌ స్టీరియో స్పీకర్లు, డాల్బీ ఆడియో, ఎన్‌ఎఫ్‌సీ, ఐఆర్‌ బ్లాస్టర్‌, కూలింగ్‌ టెక్నాలజీ కూడా ఉంటాయి. ఒప్పో రీనో 3 రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజీ ఉన్న మొబైల్‌ను సుమారు ₹33,200 ధరతో తీసుకొస్తారని సమాచారం. 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ అంతర్గత మెమొరీ వేరియంట్‌ను ₹36,200 ధరలో తీసుకొస్తారని తెలుస్తోంది.

 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   3 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle