newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఒప్పో మొబైల్స్‌కు బంపర్‌ ఫీచర్‌ వస్తోంది!

21-11-201921-11-2019 09:37:24 IST
2019-11-21T04:07:24.801Z21-11-2019 2019-11-21T04:07:14.898Z - - 12-04-2021

ఒప్పో మొబైల్స్‌కు బంపర్‌ ఫీచర్‌ వస్తోంది!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మొబైల్‌లో ఛార్జింగ్‌ 20కి తగ్గిపోతే... ఛార్జింగ్‌ పెట్టుకో బాబూ అంటూ ఓ నోటిఫికేషన్‌ వస్తుంది. అయితే ఇది ప్రస్తుతం. త్వరలో ఈ మెసేజ్‌తోపాటు మీకు దగ్గర్లో ఫలానా ప్రాంతంలో ఛార్జింగ్‌ స్టేషన్‌ ఉందనే నోటిఫికేషనూ రాబోతోంది. అవును భలే ఉంది కదా ఫీచర్‌. అయితే ఇది కేవలం కలర్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పని చేసే మొబైల్స్‌కు మాత్రమే. అంటే ఒప్పొ, రియల్‌మీ ఫోన్లలోనే ఈ ఫీచర్‌ రాబోతోంది. కలర్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో వస్తున్న కొత్త వెర్షన్‌ ‘కలర్‌ ఓఎస్‌ 7’లో ఈ ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. ప్రస్తుతానికి ఇది చైనాలో మాత్రమే అందుబాటులోకి వస్తోంది. 

చైనాలో పవర్‌ బ్యాంక్‌ రెంటింగ్‌ స్టేషన్స్‌ను ఎక్కువగా ఏర్పాటు చేశారు. వాటిని కలర్‌ ఓఎస్‌ చక్కగా వాడుకోవాలని నిర్ణయించుకుంది. ఈ ఫీచర్‌ ప్రకారం మీ మొబైల్‌లో ఛార్జింగ్‌ తగ్గగానే నీకు 100 మీటర్ల దూరంలో ఛార్జింగ్‌ స్టేషన్‌ ఉందని మెసేజ్‌ వస్తుంది. దీంతోపాటు అక్కడ ఎన్ని ఛార్జింగ్‌ పోర్ట్‌లు ఉన్నాయి. వాటిలో ఎన్ని అందుబాటులో ఉన్నాయనేది చెబుతుంది.  ఈ నెల 20న కలర్‌ ఓఎస్‌ను చైనాలో లాంచ్‌ చేయబోతున్నారు. ఆ వేదిక మీద మరిన్ని ఫీచర్లు బయటికొస్తాయి. 

కొత్త కలర్‌ ఓఎస్‌ను మన దేశంలో ఈ నెల 26న లాంచ్‌ చేయబోతున్నారు. ఒప్పో తన ఓఎస్‌ గురించి భారత్‌లో ఈవెంట్‌ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇప్పటివరకు వచ్చిన ఓఎస్‌ వెర్షన్లకు భిన్నంగా పూర్తిస్థాయి లైట్‌ డిజైన్‌తో కలర్‌ ఓఎస్‌ 7 ఉండబోతుందని ఒప్పో చెబుతోంది. మన దేశ యూజర్ల కోసం కొన్ని ప్రత్యేక ఫీచర్లు కూడా యాడ్‌ చేస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల వన్‌ప్లస్‌ కూడా ఇలాంటి ప్రయత్నమే చేసింది. ఇండియా స్పెషల్‌ ఫీచర్లు అంటూ కొన్ని విడుదల చేసింది.  

రియల్‌మీ ఫోన్లలో కూడా కలర్‌ ఓఎస్‌నే వాడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి రియల్‌మీ ఫోన్ల కోసం కలర్‌ ఓఎస్‌లో మార్పులు చేసి ప్రత్యేక వెర్షన్‌ను తీసుకొస్తారని తెలుస్తోంది. ఇప్పటికే రియల్‌మీ ఇండియా సీఈవో మాధవ్‌ సేథ్‌ కూడా ఈ విషయాన్ని చెప్పాడు. స్టాక్‌ ఆండ్రాయిడ్‌కి దగ్గరగా ఈ ఓఎస్‌ ఉంటుందనే వార్తలూ వచ్చాయి. అవేంటో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle