ఒప్పో దెబ్బ... దిగ్గజ కంపెనీల అబ్బ!
22-01-201922-01-2019 18:37:34 IST
2019-01-22T13:07:34.326Z22-01-2019 2019-01-22T13:07:30.542Z - - 11-04-2021

షియోమీ తరహాలో మొబైల్ మార్కెట్లో పెను సంచలనం సృష్టించిన మరో మొబైల్ కంపెనీ ఏదైనా ఉందంటే... అది ఒప్పోనే! అప్పటివరకూ ఉన్న ఫోన్ల కంటే మరింత నాణ్యత గల కెమెరా ఫోన్స్‌ని ఒప్పో లాంచ్ చేయడంతో... దెబ్బకు దాని సేల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ‘బెస్ట్ కెమెరా ఫోన్’గా గుర్తింపు రావడంతో... మార్కెట్లో దీనికి తిరుగులేకుండా పోయింది. కొన్నాళ్ళపాటు మొబైల్ మార్కెట్‌ని ఓ కుదుపు కుదిపేసింది. దీన్ని సవాల్‌గా తీసుకున్న ఇతర సంస్థలు... ఆ కంపెనీకి ధీటుగా నాణ్యతగల కెమెరా ఫోన్లను విడుదల చేయడంతో... దాని డిమాండ్ కొంచెం తగ్గింది. ఈమధ్య విక్రయాలు కూడా అంతంత మాత్రంగా నడుస్తున్నాయి. తన గిరాకీ తగ్గిందని గ్రహించిన ‘ఒప్పో’... పూర్వవైభవం కోసం సరికొత్త సంచలనానికి తెరతీసింది. అద్భుతమైన కెమెరా ఫీచర్ గల ‘5x హైబ్రిడ్ ఆప్టికల్ జూమ్ సిస్టమ్’తో ఓ గ్రాండ్ స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈ అధునాతనమైన ఫీచర్ గల కెమెరాను ఇంతవరకూ ఏ మొబైలో సంస్థ తీసుకురాలేదు. తొలిసారి ‘ఒప్పో’ ఆ ఫీచర్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. దీన్ని మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2018లో ప్రదర్శనకైతే ఉంచింది కానీ... ఇంకా మార్కెట్లో విడుదల చేయలేదు. ఈ ఏడాది దీన్ని రిలీజ్ చేయాలని రెడీ అవుతోంది. ఈ టెక్నాలజీని ఉపయోగించుకునేందుకు మొత్తం మూడు కెమెరాల్ని ఈ ఫోన్లో పొందుపరిచారు. ఈ మూడు కెమెరాలు దేనికవే ప్రత్యేకంగా ఉంటాయి. ఒకటి అల్ట్రావైడ్ యాంగిల్‌తో, ఇంకొకటి ప్రైమరీగానూ, మరొకటి పెరిస్కోప్ స్టైల్ సెటప్‌తో కూడిన టెలిఫోటో యాక్షన్ కలిగి ఉంటుంది. ఈ మొబైల్ ఫోన్ ఉత్పత్తిని ప్రారంభించామని ప్రకటించిన ఒప్పో సంస్థ... కమర్షియల్‌గా అందుబాటులోకి ఎప్పుడు తీసుకొస్తుందన్న విషయాన్ని ఇంకా బయటపెట్టలేదు. కేవలం కెమెరా విషయంలోనే కాదు... వినియోగదారులకు మరింత సులువుగా ఉండేలా అద్భుతమైన ఫీచర్స్‌ని తీసుకొస్తోంది ఒప్పో సంస్థనే! ఇప్పటివరకూ ఉన్న ఫింగర్ ప్రింట్ టెక్నాలజీకి భిన్నంగా... మొబైల్ డిస్ప్లే ద్వారానే ‘అన్‌లాక్’ చేసేకునే సౌకర్యం కల్పించనుంది. కాగా... షియోమీ కూడా ఇలాంటి టెక్నాలజీ మీద కసరత్తు చేస్తోందని వార్తలొస్తున్నాయి కానీ... అధికారిక లాంచ్ ఎప్పుడన్నది క్లారిటీ లేదు.

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
13 hours ago

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా