newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఒప్పొ కొత్త బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చింది..!

13-09-201913-09-2019 10:53:23 IST
2019-09-13T05:23:23.461Z13-09-2019 2019-09-13T05:23:17.360Z - - 15-04-2021

ఒప్పొ కొత్త బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చింది..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈ మధ్య కాలంలో మొబైల్‌ కంపెనీలు ‘బడ్జెట్‌’ ప్రజల మీద ఎక్కువగా దృష్టి పెట్టాయి. అందుకే నెలకు ₹ 12 వేల నుంచి ₹ 17 ధరలో కనీసం ఒక స్మార్ట్‌ ఫోన్‌ అయినా తీసుకొస్తున్నాయి. తాజాగా చైనాకు చెందిన ఒప్పో రెండు కొత్త మోడళ్లను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. గతేడాది వచ్చి విజయవంతమైన A5,A9కు సక్సెసర్లగా  రెండు కొత్త మొబైళ్లను తీసుకొచ్చింది.  

వీటికి విచిత్రంగా వచ్చే సంవత్సరం పేరు పెట్టింది. మామూలుగా పాత మొబైళ్లకు చిన్న మార్పులు చేసి ఈ సంవత్సరాన్ని ఆఖరులో యాడ్‌ చేస్తుంటారు. కానీ ఒప్పో వచ్చే ఏడాదిని తీసుకుంది.  వాటికి A9 2020, A5 2020 పేరు పెట్టింది.  వీటిలో ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. ఎప్పటిలాగే కలర్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తోనే పని చేస్తాయి. రెండింటిలోనూ వెనుకవైపు  నాలుగు కెమెరాలు ఉంటాయి. 

A9 2020 ఇలా ఉంటుంది...

ఒప్పో ఎ9 2020లో 6.5 ఇంచ్‌ వాటర్‌ డ్రాప్‌ నాట్‌ స్క్రీన్‌ ఉంటుంది. ఇది హెచ్‌డీ + స్క్రీన్‌. వెనుకవైపు ఓవెల్‌ షేప్‌లో ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ ఉంటుంది.  4 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ ధర ₹ 16,990. దీంతోపాటు 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ వెర్షన్‌ కూడా ఉంది.  దీని ధర ₹ 19,990.  ఇవి  ఈ నెల 16 నుంచి అమెజాన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ మొబైళ్లలో మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా మొమొరీని పెంచుకోవచ్చు. వెనుకవైపు ఉండే నాలుగు కెమరాల్లో మొదటిది 48 ఎంపీ సెన్సర్‌. ఇది కాకుండా 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ సెన్సర్‌, 2 మెగాపిక్సల్‌ మోనోక్రోమ్‌ సెన్సర్‌, 2 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ ఉంటాయి.  16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. స్నాప్‌డ్రాగన్‌ 665 ప్రాసెసర్‌తో ఈ మొబైళ్లు పని చేస్తాయి. వీటిలో ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. 

A5 2020 ప్రత్యేకతలు ఇవీ... 

ఒప్పో ఎ5 2020లో 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ వెర్షన్‌ ఒక్కటే అందుబాటులోకి తీసుకొచ్చారు.  దీని ధర ₹ 13,990. ఇది సెప్టెంబరు 21న అమెజాన్‌లో సేల్‌కి వస్తుంది. ఈ మొబైల్‌లో  వెనుకవైపు ఉండే నాలుగు కెమరాల్లో మొదటిది మారుతుంది.  48 ఎంపీ సెన్సర్‌ బదులు 12 ఎంపీ కెమెరా ఉంటుంది.  ఇది కాకుండా 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ సెన్సర్‌, 2 మెగాపిక్సల్‌ మోనోక్రోమ్‌ సెన్సర్‌, 2 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ ఉంటాయి. ఇందులో ముందువైపు 8 ఎంపీ కెమెరా ఉంటుంది.  స్నాప్‌డ్రాగన్‌ 665 ప్రాసెసర్‌తో ఈ మొబైళ్లు పని చేస్తాయి. వీటిలో ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. 

OPPO A9 2020, A5 2020 with quad rear cameras launched in India from Rs 12,490 onwards

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle