ఒక్క గిఫ్... మీ వాట్సాప్ ని హ్యాక్ చేసేస్తుంది జాగ్రత్త..!
04-10-201904-10-2019 16:33:14 IST
2019-10-04T11:03:14.366Z04-10-2019 2019-10-04T11:03:12.310Z - - 17-04-2021

వాట్సాప్ లో హ్యాకింగ్... ఇది తరచూ చర్చకు వస్తున్న అంశం. డూప్లికేట్ యాప్స్, హ్యాకింగ్ లింక్స్, స్పామ్ మెసేజెస్ లాంటివి వాట్సాప్ లో వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మరో హ్యాకింగ్ విషయం బయటకు వచ్చింది. అదే మీకు తరచుగా వచ్చే గిఫ్ (GIFs). మీరు కూడా చాలాసార్లు మీ స్నేహితులకు గిఫ్ లు పంపిస్తుంటారు. మీకు కూడా వస్తుంటాయి. ఇప్పుడు అవే మీ వాట్సాప్ హ్యాకింగ్ కి టూల్ అయిపోయాయి. దీనిని డబుల్ ఫ్రీ బగ్ అని పిలుస్తున్నారు. అంటే ఇలాంటి బగ్ ని యూజర్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మీ మొబైల్ హ్యాకర్ చేతికి చిక్కినట్లే. దీనికి వాట్సాప్ ఫిక్స్ కూడా చేసింది. డబుల్ ఫ్రీ బగ్ గురించి ఓ ఔత్సాహిక నిపుణుడు పూర్తిగా వివరించారు. ‘‘డబుల్ ఫ్రీ బగ్ గిఫ్ రూపంలోనే ఉన్నప్పటికీ... అది ఇమేజ్ తరహాలో రాదు. అటాచ్ మెంట్ రూపంలో యూజర్ కు చేరుతుంది. ఓపెన్ చేసి చూస్తే అప్పుడు గిఫ్ లా మారుతుంది. ఆ వెంటనే మీ వాట్సాప్ హ్యాక్ అవుతుంది. మొబైల్ లోని గ్యాలరీ హ్యాకర్లకు చిక్కుతుంది. యూజర్ ఆ తర్వాత ఎలాంటి ఫొటోలు, వీడియోలు పంపకపోయినా హ్యాకర్ల కు రిమోట్ యాక్సెస్ వెళ్లిపోతోంది. ఆండ్రాయిడ్ 8.1, ఆండ్రాయిడ్ 9 వెర్షన్లలో ఈ బగ్ ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. ఆండ్రాయిడ్ 8.0 అంతకంటే ముందు వాటికి ఈ సమస్య లేదు. ఆ వెర్షన్లలో హ్యాకింగ్ ట్రై చేస్తే యాప్ క్రాష్ అవుతోంది’’ అని నిపుణుడు చెప్పారు. వాట్సాప్ వెర్షన్ 2.19.230 లో ఈ బగ్ ను ఫిక్స్ చేసినట్లు వాట్సాప్ పేరెంట్ కంపెనీ ఫేస్ బుక్ తెలిపింది. ‘‘డబుల్ ఫ్రీ బగ్ ఉన్న గిఫ్ ను అందుకున్న డివైజ్ మాత్రమే కాకుండా పంపిన గిఫ్ కూడా హ్యాకింగ్ బారిన పడే అవకాశం ఉంది’’ అని వాట్సాప్ ప్రతినిధి తెలిపారు. అయితే వాట్సాప్ చెప్పినది సరికాదు అని నిపుణుడు అంటున్నాడు. వాళ్ల ఆలోచనలు, వివరణలు ఎలా ఉన్నా... వినియోగదారులు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది. కాబట్టి ఆండ్రాయిడ్ 8.1, ఆండ్రాయిడ్ 9 వెర్షన్ ఓఎస్ ఆధారిత మొబైల్స్ వాడుతున్న వాళ్లు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. వెంటనే వారి మొబైళ్లలో వాట్సాప్ ను అప్ డేట్ చేసుకోవాలి.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా