ఒక్కసారి ఛార్జ్ చేస్తే 452 కిలోమీటర్లు.... కోన కారు స్పెషాలిటీ
09-07-201909-07-2019 15:57:04 IST
Updated On 09-07-2019 15:58:39 ISTUpdated On 09-07-20192019-07-09T10:27:04.322Z09-07-2019 2019-07-09T10:27:01.066Z - 2019-07-09T10:28:39.158Z - 09-07-2019

గతంతో పోలిస్తే సోలార్, ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతోందనే చెప్పాలి. తాజాగా హ్యుందాయ్ సంస్థ సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘కోన’ను మార్కెట్లో అందుబాటులో ఉంచింది. ఈ కోన ఎక్స్ షోరూమ్ ధర రూ.25.30 లక్షలు. భారత్‌లో మొట్టమొదటి ఎస్‌యూవీగా ‘కోన’ రికార్డు సృష్టించింది.
ఇంటీరియర్, ఫీచర్లు, కారు లోపల విశాలమైన స్థలం.. ఇలా అన్నింటా ప్రత్యేకతలున్నాయి. కారు ముందు భాగంలో పగలు కూడా వెలిగే ఎల్ఈడీ బల్బ్‌లను అమర్చడం విశేషం.

కోన ఎలక్ట్రిక్ కార్లు రెండు రకాలుగా అందుబాటులో ఉంటాయి. అందులో 39.2 కిలోవాట్లు, 64 కిలోవాట్లతో పనిచేస్తాయి. ప్రస్తుతం దీనికి అమర్చిన బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 452 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇది 80శాతం ఛార్జింగ్ అయ్యేందుకు గంట సమయం చాలు. ఈ కారు కొనుగోలు చేసే ప్రయాణికులకు ఒక పోర్టబుల్ ఛార్జర్, ఏసీ వాల్ బాక్స్ ఛార్జర్లు ఇస్తారు.
పోర్టబుల్ ఛార్జర్‌ని త్రీ పిన్ 15 యాంపియర్స్ సాకెట్లో పెట్టి మూడు గంటలు టాప్ అప్ ఛార్జింగ్ చేసుకొని 50 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. 7.2కిలోవాట్ల బాక్స్ ఛార్జర్ ద్వారా గంట టాప్ అప్ ఛార్జింగ్ చేసుకొని 50 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.
ఈ కారులో 100 కిలోవాట్ల మోటార్ అమర్చారు. 557 కి.మీ. ప్రయాణిస్తుంది. ఈ కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 9.7 క్షణాల్లోనే అందుకుంటుంది.
వైర్ లెస్ ఛార్జింగ్ ద్వారా ఛార్జి చేసుకునే అవకాశం ఉంది. అన్ని చక్రాలకు డిస్క్ బ్రేక్, వర్చువల్ ఇంజిన్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సహకారంతో ముంబయి, చెన్నై, బెంగళూరు, ఢిల్లీలో కోన కారుకి ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్టు హ్యుందాయ్ ప్రకటించింది.
ఈ కోన కారుకి మూడేళ్ళ వారంటీ కూడా ఉంది. ఈ మూడేళ్ళలో ఎన్ని కిలోమీటర్లు తిరిగినా.. అందుకు పరిమితి లేదు. అలాగే 8ఏళ్ళలో లక్షా 60 వేల కిలోమీటర్లు తిరిగినా వారంటీ లభిస్తుందని సంస్థ తెలిపింది. భారతదేశంలో పెరిగిపోతున్న కాలుష్యానికి ఇలాంటి ఎలక్ట్రిక్ వాహనాలే పరిష్కారంగా చెబుతున్నారు.


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
2 hours ago

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా