ఒకేసారి రెండు మొబైళ్లలో.. ఒకే వాట్సాప్
02-11-201902-11-2019 12:05:30 IST
Updated On 02-11-2019 17:48:58 ISTUpdated On 02-11-20192019-11-02T06:35:30.727Z02-11-2019 2019-11-02T06:35:26.008Z - 2019-11-02T12:18:58.591Z - 02-11-2019

మీ దగ్గర రెండు మొబైళ్లు ఉన్నాయి... కానీ ఒక నెంబరుతో ఒక మొబైల్లోనే వాట్సాప్ వాడుకోవచ్చు. రెండో దాంట్లో వాడదామంటే తొలి మొబైల్లో పోతుంది. చాలా రోజుల నుంచి వాట్సాప్ వినియోగదారులు పడుతున్న సమస్య ఇది. టెలీగ్రామ్ లాంటి మెసేజింగ్ యాప్‌లు దీనికి ఎప్పుడో చెక్ పెట్టాయి. ఇప్పుడు వాట్సాప్ కూడా ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఒకే సమయంలో రెండు మొబైళ్లలో వాట్సాప్ వాడుకునేలా మార్పులు చేయబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీటా టెస్టింగ్ జరుగుతోందని సమాచారం. వాబీటాఇన్ఫో కథనం ప్రకారం అయితే త్వరలోనే ఈ ఫీచర్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. అసైన్డ్ కీ అనే ఆప్షన్ ద్వారా మల్టిపుల్ డివైజస్ ఫీచర్‌ను వాట్సాప్‌లో తీసుకురాబోతున్నారు. మల్టిపుల్ వాట్సాప్ ఫీచర్‌ను ఒకేసారి ఆండ్రాయిడ్, ఐవోఎస్, ఐప్యాడ్ ఓఎస్, విండోస్‌లో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ ఆప్షన్ తీసుకొచ్చినప్పటికీ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉండేలా వాట్సాప్ చర్యలు తీసుకుంటోంది. కాబట్టి మీ ఛాటింగ్ అగంతుకుల చేతిలో పడినా వాళ్లేం చేయలేరు. త్వరలో కొత్త ఫీచర్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లను త్వరలో ప్రచురిస్తామని వాబీటాఇన్ఫో ఇటీవల ట్వీట్ చేసింది. వీలైనంత త్వరగా వాట్సాప్ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోందనేది టెక్ వర్గాల మాట. మరోవైపు వాట్సాప్ డార్క్ మోడ్ పనిలో బిజీగా ఉంది. అన్ని ప్రముఖ యాప్‌ల స్టైల్లో యాప్వైడ్ డార్క్ మోడ్‌ను టెస్ట్ చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన టెస్టింగ్ కూడా పూర్తయింది. ఈ ఫీచర్ తొలుత వినియోగదారులకు అందుబాటులో రానుంది. దీంతోపాటు డిస్అపియరింగ్ మెసేజెస్ ఫీచర్‌ను కూడా వాట్సాప్ టెస్ట్ చేస్తోంది. మీరు ఎంచుకున్న నిర్ణీత సమయం తర్వాత వాట్సాప్ మెసేజ్‌లు డిలీట్ అయిపోయేలా చేయడం ఈ ఫీచర్ ప్రత్యేకత. అయితే ఈ ఫీచర్ తొలిరోజుల్లో గ్రూప్స్‌కి మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తారు. గ్రూప్ సెట్టింగ్స్‌లో ఈ ఫీచర్‌ను పొందొచ్చు. అయితే ఆండ్రాయిడ్‌కి మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. ఐఓఎస్, విండోస్ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా