newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

ఐ ఫోన్ ...ఇక టూ-వే వైర్‌లెస్ ఛార్జింగ్

13-04-201913-04-2019 08:02:02 IST
2019-04-13T02:32:02.560Z13-04-2019 2019-04-13T02:31:48.582Z - - 22-07-2019

ఐ ఫోన్ ...ఇక టూ-వే వైర్‌లెస్ ఛార్జింగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐఫోన్లలో టూ-వే వైర్ లెస్ ఛార్జింగ్ ఫీచర్ తీసుకువస్తోంది. ఈ ఫీచర్‌తో ఇతర డివైస్‌లను ఐఫోన్ ఉపయోగించి ఛార్జింగ్ చేసుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎస్10, హువావీ మేట్ 20 ప్రో, హువావీ పీ30 ప్రో వంటి ఇతర ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లు ఇప్పటికే టూ-వే వైర్ లెస్ ఛార్జింగ్ తీసుకువచ్చాయి. ఈ ఫీచర్ కోసం శాంసంగ్ కొత్తగా బ్లూటూత్ ఇయర్ బడ్స్ కూడా విడుదల చేసింది.

పవర్ షేర్ ఫీచర్‌తో మీరు గెలాక్సీ బడ్స్ కేస్‌ని శాంసంగ్ గెలాక్సీ ఎస్10 వెనుకపెట్టి ఛార్జ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం యాపిల్ తన ఎయిర్ పాడ్స్‌ను వైర్ లెస్ ఛార్జింగ్ కేస్‌తో అమ్ముతోంది. అందువల్ల రాబోయే ఐఫోన్ పైన అమర్చుకొనే కొత్త కేస్ ను త్వరలోనే యాపిల్ ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. 

‌‌ఐఫోన్ ఎక్స్ఎస్, ఎక్స్ఎస్ మ్యాక్స్, ఎక్స్ఆర్‌ల అప్ డేట్ వెర్షన్స్‌లో టూ-వే వైర్ లెస్ ఛార్జింగ్ ఉండవచ్చని భావిస్తున్నారు. కొత్త ఫీచర్ల వల్ల బ్యాటరీ త్వరగా అయిపోకుండా యాపిల్ తన బ్యాటరీల సైజులను కూడా పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాతి ఐఫోన్ ఎక్స్ఎస్‌లో 20-25 శాతం బ్యాటరీ సామర్థ్యం పెరుగుదల ఉండవచ్చు. టూ-వే వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్ల వల్ల ఐఫోన్ అమ్మకాలు పెరగవచ్చంటున్నారు. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle