newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఐఫోన్ మినీ వచ్చేస్తోంది.. ఎందుకంత స్పెషల్ అంటే..!

22-09-202022-09-2020 14:20:56 IST
Updated On 22-09-2020 14:44:42 ISTUpdated On 22-09-20202020-09-22T08:50:56.260Z22-09-2020 2020-09-22T08:50:25.823Z - 2020-09-22T09:14:42.530Z - 22-09-2020

 ఐఫోన్ మినీ వచ్చేస్తోంది.. ఎందుకంత స్పెషల్ అంటే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మొబైల్ ఫోన్లలో కొత్త మోడల్స్ వస్తున్న కొద్దీ స్క్రీన్ సైజు అంతకంతకూ పెరిగిపోతూ ఉంది. ప్రముఖ కంపెనీలు కూడా స్క్రీన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. తాజాగా యాపిల్ కంపెనీ కూడా 'ఐఫోన్ 12' సిరీస్ ను తీసుకుని రావాలని భావిస్తూ ఉంది. అయితే ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఐఫోన్ 12 మినీ రాబోతోందట..! ట్విట్టర్ లోని ఓ అకౌంట్ లో ఐఫోన్ 12 సిరీస్ లో వచ్చే ఓ మొబైల్ గురించి ట్వీట్ చేశారు. కేవలం 5.4 అంగుళాల సైజ్ లో ఉండే దీని పేరు 'ఐఫోన్ 12 మినీ' అని తెలుస్తోంది. 

ఇప్పటికే ఐపాడ్, మాక్ కంప్యూటర్లలో యాపిల్ మినీ వర్షన్లను తీసుకుని వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో 4, 5వ సిరీస్ ఫోన్లు చిన్నవే. కానీ ఐఫోన్ 12 సిరీస్ లో ఇలా కేవలం 5.4 అంగుళాల స్క్రీన్ ఉన్న మొబైల్ ఫోన్ రానుండడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఐఫోన్ ఫ్లాగ్ షిప్ లో వచ్చిన మొబైల్స్ లో ఐఫోన్ 11ప్రో స్క్రీన్ సైజ్ 5.8ఇంచెస్ ఉంది. ఇప్పుడు మినీ అంతకంటే తక్కువ స్క్రీన్ సైజ్ తో రానుంది. ఐఫోన్ సిరీస్ లో భాగంగా ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ కూడా రిలీజ్ అవ్వనున్నాయి. ఈ కొత్త ఫోన్లు 5జీ రేడియో తరంగాలకు మద్దతిస్తాయని, ఓఎల్ఈడీ స్క్రీన్లు, 60 హెర్జ్ రిఫ్రష్ రేటు ఉండనున్నాయి. అక్టోబర్ నెలలో ఐఫోన్ 12 సిరీస్ లాంఛ్ కాబోతోంది. ఇప్పటికే ఎంతో మంది ఐఫోన్ 12 సిరీస్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. యాపిల్ సంస్థ మొదటి సారి 5జీ ఫోన్స్ ను ఐఫోన్ 12 సిరీస్ లో భాగంగా తీసుకుని వస్తున్నారు. ఐఫోన్ 4 డిజైన్ లాగే ఫ్లాట్ ఎడ్జెస్ ను తీసుకుని వస్తున్నారు. 

ఐఫోన్ 11 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లను అమ్మనున్నారని చెబుతున్నారు. ఐఫోన్ 12 మ్యాక్స్ ప్రో ధర దాదాపు లక్ష రూపాయలు ఉండవచ్చని భావిస్తూ ఉన్నారు. 

 

JioFiber: కస్టమర్లకు జియో గుడ్ న్యూస్.. కేవలం 199 రూపాయలకే 1000జీబీ డేటా..!

JioFiber: కస్టమర్లకు జియో గుడ్ న్యూస్.. కేవలం 199 రూపాయలకే 1000జీబీ డేటా..!

   22-07-2021


వాట్సాప్ 2 మిలియన్ భారతీయ ఖాతాలను నిషేధించింది, నెటిజన్లు మీమ్స్ తో స్పందిస్తున్నారు

వాట్సాప్ 2 మిలియన్ భారతీయ ఖాతాలను నిషేధించింది, నెటిజన్లు మీమ్స్ తో స్పందిస్తున్నారు

   17-07-2021


ఓలాకి ఇంత డిమాండా.. ఊహించలేకపోయిన కంపెనీ.. బ్లాక్ అయిన వెబ్ సైట్

ఓలాకి ఇంత డిమాండా.. ఊహించలేకపోయిన కంపెనీ.. బ్లాక్ అయిన వెబ్ సైట్

   16-07-2021


డిజిటల్ ఫ్లాట్ ఫామ్ కాపాడటానికి కొత్త ఐటి నియమాలు: కేంద్రం

డిజిటల్ ఫ్లాట్ ఫామ్ కాపాడటానికి కొత్త ఐటి నియమాలు: కేంద్రం

   13-07-2021


అమెజాన్ వెబ్సైట్ లో అంతరాయం.. తీవ్రంగా ఇబ్బంది పడ్డ కస్టమర్లు

అమెజాన్ వెబ్సైట్ లో అంతరాయం.. తీవ్రంగా ఇబ్బంది పడ్డ కస్టమర్లు

   12-07-2021


అంతరిక్షంలోకి మన తెలుగమ్మాయి..

అంతరిక్షంలోకి మన తెలుగమ్మాయి..

   11-07-2021


ఈ బజాజ్ స్కూటర్, ఇంకా మార్కెట్ లోకి రానేలేదు అయినా..

ఈ బజాజ్ స్కూటర్, ఇంకా మార్కెట్ లోకి రానేలేదు అయినా..

   11-07-2021


రూ. 10 వేలకే రియల్‌ మీ 5 జీ మొబైల్స్

రూ. 10 వేలకే రియల్‌ మీ 5 జీ మొబైల్స్

   07-07-2021


అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బేజోస్‌ రాజీనామా.. ఆయన స్థానంలో ఆండీ జస్సీ

అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బేజోస్‌ రాజీనామా.. ఆయన స్థానంలో ఆండీ జస్సీ

   05-07-2021


సోషల్ మీడియా డే 2021: చరిత్ర మరియు ప్రాముఖ్యతను తెలుసుకోండి

సోషల్ మీడియా డే 2021: చరిత్ర మరియు ప్రాముఖ్యతను తెలుసుకోండి

   30-06-2021


ఇంకా

Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle