ఐఫోన్ 5 వాడుతున్నారా... ఇంకా ఓఎస్ అప్డేట్ చేసుకోలేదా!
03-11-201903-11-2019 15:10:42 IST
2019-11-03T09:40:42.162Z03-11-2019 2019-11-03T09:40:38.811Z - - 15-04-2021

ఆపిల్ తన మొబైల్స్‌కు ఎప్పటికప్పుడు కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను రిలీజ్ చేస్తుంటుంది. ఆండ్రాయిడ్ మొబైల్స్ శైలిలో కాకుండా కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను అన్ని మొబైల్స్‌కు లాంచ్ చేస్తుంది. అలా ఎప్పుడో సుమారు ఆరేళ్ల క్రితం వచ్చిన ఐఫోన్ 5 సిరీస్‌కు కూడా తాజా ఐఓఎస్ 13 అందిస్తోంది. అయితే మీరు ఐఫోన్ 5 వాడుతుంటే ఈ సమాచారం మీ కోసమే. ఐఫోన్ 5 సిరీస్ మొబైళ్లు వాడుతున్న వాళ్లు వెంటనే ఓఎస్‌ను అప్డేట్ చేసుకోవాల్సిందే. ఈ మేరకు యాపిల్ అధికారిక వెబ్సైట్లో ప్రకటించింది. అప్డేట్ చేసుకోకపోతే ఆ మొబైల్‌కు ఆన్లైన్ సర్వీసులు ఆగిపోతాయి. ఒకవేళ సర్వీసులు ఆగిపోయాక అప్డేట్ చేద్దామనుకుంటే కంప్యూటర్‌కు కనక్ట్ చేయమని అడుగుతుంది. ఈ రోజు (నవంబరు 3) సాయంత్రం 5 తర్వాత ఐఫోన్ 5 మొబైళ్లలోని ముఖ్యమైన ఫీచర్లు నిలిచిపోతాయి. ఐఫోన్ 5లోని జీపీఎస్ ఆధారిత ఫంక్షన్లు పని చేయాలంటే అప్డేట్ తప్పనిసరి అట. లేకపోతే జీపీఎస్, డేట్ లాంటి ఫీచర్లు పని చేయక ఆప్ స్టోర్ సర్వీసులు ఆగిపోతాయి. దాంతోపాటు ఐ క్లౌడ్, ఈమెయిల్, వెబ్ బ్రౌజింగ్ లాంటివి నిలిచిపోతాయి. ఐఫోన్ 5తోపాటు 2012కు ముందు తయారైన ఐఫోన్ 4, కొన్ని ఐప్యాడ్ మినీ, ఐప్యాడ్ 2, ఐప్యాడ్ 3 జనరేషన్ డివైజ్‌లకు కూడా ఓఎస్ అప్డేట్ చేయాల్సిందే. ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ విషయంలో జీపీఎస్ టైమ్ రోల్ ఓవరే కారణమని ఆపిల్ అంటోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జీపీఎస్ టైమ్ రోల్ ఓవర్ చేసింది. ‘‘జీపీఎస్ టైమ్ రోల్ ఓవర్ కారణంగా జీపీఎస్ ఆధారిత ఉత్పత్తులు, సర్వీసులపై ప్రభావం పడుతోంది. అందుకే వెంటనే ఓఎస్ అప్డేట్ చేయమంటున్నాం’’ అని యాపిల్ ప్రతినిధి అంటున్నారు. జీపీఎస్ టైమ్ రోల్ ఓవర్ అంటే... ఆగస్టు 21, 1999లో తొలిసారిగా జీపీఎస్ టైమ్ రోల్ఓవర్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో రెండోసారి చేశారు. వీక్ నంబర్ కౌంట్‌ని జీపీఎస్ 10 బిట్ వీక్ నంబరుగా తీసుకుంటుంది. అలా వీక్ నంబరు 1111111111కు చేరింది. దీంతో రిసెట్ చేసి తిరిగి 0000000000కి తీసుకొచ్చారు. దీనినే జీపీఎస్ టైమ్ రోల్ ఓవర్ అంటారు. ఐఫోన్ 5ఎస్ అంతకంటే ముందు సిరీస్ మొబైల్స్ ఈ రోల్ ఓవర్‌కు తగ్గట్టు మారే ఆప్షన్ లేనివి. దీంతో ఓఎస్ అప్డేట్ అనివార్యమైంది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా