newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఐఫోన్‌లో ఈ మార్పు చేస్తే బాగుంటుందేమో... ట్రంప్‌ సలహా

27-10-201927-10-2019 11:03:56 IST
2019-10-27T05:33:56.406Z27-10-2019 2019-10-27T05:33:50.823Z - - 17-04-2021

ఐఫోన్‌లో ఈ మార్పు చేస్తే బాగుంటుందేమో... ట్రంప్‌ సలహా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రెండేళ్ల క్రితం ఆపిల్‌ విడుదల చేసిన ‘ఐఫోన్‌’ ఫోన్స్‌ డిజైన్‌లో కొన్ని మార్పులు చేసింది. మొబైల్‌లో ఎక్కువగా వాడే హోం బటన్‌ను తొలగించింది. ఆ తర్వాత వచ్చిన ఐఫోన్‌ మోడళ్లలోనూ అదే పంథా కొనసాగించింది. హోం బటన్‌ లేకుండా గెస్చర్స్‌ విధానాన్ని కొనసాగిస్తూ వచ్చింది. దీని వల్ల యూజర్లు తొలినాళ్లలో కొంత ఇబ్బంది  పడినా... ఆ తర్వాత సర్దుకున్నారు.

ఇప్పుడు అదే అలవాటు అయిపోయింది కూడా. కానీ ఓ పెద్దాయన ఐఫోన్స్‌ గురించి దాని బాస్‌ టిమ్‌ కుక్‌కు ఓ సలహా ఇచ్చాడు. ఎవరా పెద్దాయన అనుకుంటున్నారా... అమెరికా ప్రధాని డొనాల్డ్‌ ట్రంప్‌. అవును ఆయనే కుక్‌కి సలహా ఇచ్చారు. 

డొనాల్డ్‌ ట్రంప్‌ ఐఫోనే వాడుతున్నారట. అది ప్రభుత్వం ఇచ్చిందే అనుకోండి. ఫిజికల్‌ హోం బటన్‌ తీసేసరికి ఆయన కూడా అందరిలాగే స్వైప్‌, గెస్చర్స్‌ విధానాన్నే వినియోగిస్తున్నారు. ప్రతిసారి హోం స్క్రీన్‌కి రావాలంటే స్వైప్‌ చేస్తున్నారు. మీరు కూడా అదే చేస్తుంటారనుకోండి. మీరు మహా అయితే ఇదేంటబ్బా... ప్రతిసారి ఇదేం పని అనుకొని ఊరుకొని ఉంటారు.

కానీ అక్కడ ట్రంప్‌ కదా ఏకంగా యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ ఓ సలహా ఇచ్చారు. ఐఫోన్‌ వినియోగంలో యూజర్ల పడుతున్న ఇబ్బందిని, తాను పడుతున్న ఇబ్బంది అందరికీ తెలిసేలా, ముఖ్యంగా ఆపిల్‌ టీమ్‌ తెలిసేలా తన వ్యక్తిగత ట్విటర్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు. 

‘‘టిమ్‌ ఐఫోన్‌లో స్వైప్‌ విధానం కంటే బటనే చాలా బాగుంది’’ అంటూ ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌కు తక్కువ సమయంలో రీట్వీట్లు, లైక్‌లు వచ్చిపడ్డాయి. మరి ట్రంప్‌ ట్వీట్‌ సలహాకు ఆపిల్‌ టీమ్‌, సీఈవో టిమ్‌ కుక్‌ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. 

2017లో విడుదల చేసిన ఐఫోన్ టెన్‌ మోడళ్లలో ఆపిల్‌ ఈ మార్పులు చేసింది. ఇటీవల విడుదల చేసిన ఐఫోన్‌ 11 ప్రో, 11 ప్రో మ్యాక్స్‌ ఫోన్లలో కూడా హోం బటన్‌ లేకుండానే విడుదల చేసింది. అన్నట్లు త్వరలో రాబోతున్న ఐఫోన్‌ ఎస్‌ఈ2లో హోమ్‌ బటన్‌ ఉండబోతోందని తెలుస్తోంది. బడ్జెట్‌ ధరలో రాబోతున్న ఈ మొబైల్‌ను మరి ట్రంప్‌ తీసుకుంటారామో. 

 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle