ఐకూ.. 5 జీ స్మార్ట్ ఫోన్.. సూపర్ రెస్పాన్స్
27-01-202027-01-2020 10:09:47 IST
Updated On 27-01-2020 10:09:44 ISTUpdated On 27-01-20202020-01-27T04:39:47.054Z27-01-2020 2020-01-27T04:34:16.781Z - 2020-01-27T04:39:44.592Z - 27-01-2020

ఒకప్పుడు 2జీ.. తర్వాత 3 జీ.. ఇప్పుడు ఎక్కడ చూసినా 4 జీ.. విదేశాలలో అయితే 5 జీ. త్వరలో ఇండియాలో కూడా 5జీ రాబోతోంది. అందరికంటే ముందుగా ఆలోచించే చైనా కంపెనీలు 5 జీ ఫోన్లపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. చైనా కంపెనీలు భారతీయ మార్కెట్ ని ముంచేస్తున్నాయి. క్షణానికో కొత్త మోడల్. సోషల్ మీడియాలో తమ కంపెనీ ప్రొడక్ట్ లకు కారుచౌకగా పబ్లిసిటీ చేసేసుకుంటున్నాయి. ఫోన్ అసలు ధర ఎంతో ఎవరికీ తెలీదు. కానీ ఉత్పత్తి వ్యయానికి నాలుగైదు రెట్లు వేసుకుని దానిని గరిష్ట చిల్లర ధరగా మార్చేస్తారు. అమ్మకాలు తగ్గినప్పుడు ఉదారంగా వాటి ధరలు తగ్గించేస్తామని ప్రకటిస్తారు. ఇక ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి ఆన్ లైన్ దుకాణాలున్నాయి. వాటి ద్వారా 20 శాతం 30 శాతం తగ్గించేస్తాయి. దీంతో భారీగా అమ్మకాలు జరుగుతాయి. ఆఫ్ లైన్ అమ్మకాల కంటే ఆన్ లైన్ అమ్మకాలకే జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఆన్ లైన్ మార్కెట్ ని కబ్జా చేశాయి. స్మార్ట్‌ఫోన్స్ తయారీలో ఉన్న చైనా కంపెనీ ఐకూ ఫిబ్రవరిలో 5జీ స్మార్ట్‌ఫోన్‌తో ఎంట్రీ ఇవ్వనుంది. భారత్‌లో ఇదే తొలి 5జీ మోడల్ కానుందని అంటున్నారంతా. 5జీతోపాటు 4జీ మోడళ్లనూ ప్రవేశపెట్టనుంది ఐకూ. భారీగా అమ్మకాల లక్ల్యం పెట్టుకుంది. 2020లో దేశీయంగా 10 లక్షల ఫోన్లను విక్రయించనుంది. ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ అమ్మకాలు చేయాలని భావిస్తోంది. భారత్ లో బెంగళూరులో కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇప్పటికే చైనా మార్కెట్లో ఈ ఫోన్ విడుదల అయింది. ఐకూ 5జీ స్పెసిఫికేషన్స్ *ఆక్టాకోర్ 2.96 జీహెచ్ జెడ్ * స్నాప్ డ్రాగన్ 85 ప్లస్ *6.41 అంగుళాల స్క్రీన్ * 8 జీబీ ర్యామ్ *సూపర్ అమోలెడ్ డిస్ ప్లే * 48 ఎంపీ, 13 ఎంపీ, 2ఎంపీ కెమేరా *4500 ఎంఏహెచ్ బ్యాటరీ *12 ఎంపీ ఫ్రంట్ కెమేరా *టైప్ సీ ఫాస్ట్ ఛార్జింగ్ * ధర 38,999 (అంచనా)

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
3 hours ago

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా