ఎలక్ట్రిక్ వాహనాలకే పెద్దపీట.. 2026 నుంచి న్యూ రూల్స్
07-06-201907-06-2019 13:46:09 IST
2019-06-07T08:16:09.155Z07-06-2019 2019-06-07T08:16:06.446Z - - 14-04-2021

దేశమంతటా కాలుష్యం బాగా పెరిగిపోతోంది. వాహనాల సంఖ్యకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. దీంతో ప్రభుత్వానికి దిక్కుతోచడం లేదు. పెట్రోల్,డీజిల్ ఇతర ఇంధన వనరులు బాగా తగ్గిపోతున్నాయి. ఈనేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై ఫోకస్ పెట్టింది. మున్ముందు కేవలం ఎలక్ర్టిక్ వాహనాలు మాత్రమే అమ్మేలా చర్యలు తీసుకోబోతోంది. దీంతో కేంద్ర రోడ్డు, రవాణా శాఖ ఒక నమూనా నోటిఫికేషన్ సిద్ధం చేస్తునట్టు తెలుస్తోంది. దీని ప్రకారం 150 సీసీ కన్నా తక్కువ సామర్థ్యం ఉన్న వాహనాలు కేవలం ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలని ప్రతిపాదించింది. 2024 ఏప్రిల్ 1వ తేదీ నుంచి త్రీవీలర్స్ ఈ నిబంధన వర్తింపజేయనున్నారు. అంటే 150 సీసీ కన్నా తక్కవ సామర్థ్యమున్న త్రీ వీలర్స్ అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలై అయి ఉండాలి. లేదంటే వాటికి పర్మిషన్ ఉండదు. 2026 ఏప్రిల్ నుంచి ఈ నిబంధనలను టూ వీలర్స్ కూడా వర్తింపచేస్తారు. అంటే 2026 ఏప్రిల్ 1 నుంచి టూ, త్రీ వీలర్స్ అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలే అయి ఉండాలి. 150 సీసీ లోపు వాహనాలన్నీ ఈ నిబంధన కిందకు రానున్నాయి. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం వారం లేదా పది రోజుల్లో విడుదల చేయబోతోంది.ఈ నిబంధనల్ని అమలుచేస్తే రోడ్లపై కాలుష్యం తగ్గనుంది. అయితే ఇంత తక్కువ వ్యవధిలో ఇన్ని వాహనాలు సమకూర్చడం, పాతవాటిని ఏంచేయాలనేదానిపై స్పష్టత లేదు. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో సోలార్ ఎనర్జీ, సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగనుందని మాత్రం తెలుస్తోంది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా