newssting
BITING NEWS :
*హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో కారు బీభత్సం. అదుపుతప్పి హోటల్ లోకి దూసుకెళ్లిన కారు. తప్పిన ప్రమాదం, కారు వదలి పరారైన యువకులు. మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లుగా అనుమానం * అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న ట్రంప్. ఎయిర్ పోర్ట్ నుంచి ర్యాలీగా మొతేరా స్టేడియానికి ట్రంప్. మధ్యాహ్నం 12:30 గంటలకు నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగం*విశాఖ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్‌పై స్పందించిన నేవీ..మిలీనియం టవర్స్‌లో సచివాలయం పెట్టుకోవడానికి అనుమతి నిరాకరించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం*జనవరి 10న అమరావతి రైతుల మీద జరిగిన లాఠీఛార్జ్‌పై విచారణ ప్రారంభం..హైకోర్టు ఆదేశాల మేరకు తుళ్లూరులో విచారణ ప్రారంభించిన పోలీసులు..గుంటూరు అడిషనల్‌ ఎస్పీ స్వామిశేఖర్‌ నేతృత్వంలో కొనసాగుతున్న ఎంక్వైరీ *సికింద్రాబాద్ : బోయిన్ పల్లిలోనీ ఓ కెమికల్ గో డౌన్ లో భారీ అగ్నిప్రమాదం*చైనాలో 2400 పైగా చేరిన కోవిద్ 19 వైరస్ మృతులు. 78 వేలకు చేరిన వైరస్ బాధితుల సంఖ్య. ఇటలీలో కరోనా వైరస్ కారణంగా ఇద్దరు మృతి

ఎయిర్ టెల్, వోడా ఫోన్‌లపై సుప్రీం సీరియస్

14-02-202014-02-2020 14:06:27 IST
Updated On 14-02-2020 14:06:44 ISTUpdated On 14-02-20202020-02-14T08:36:27.225Z14-02-2020 2020-02-14T08:36:17.671Z - 2020-02-14T08:36:44.063Z - 14-02-2020

ఎయిర్ టెల్, వోడా ఫోన్‌లపై సుప్రీం సీరియస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లైఫ్ టైం ఇన్ కమింగ్ ఫ్రీ అంటూ కష్టమర్లను ఆకర్షించి.. ఇప్పుడు మినిమం ఛార్జీలు వసూలు చేస్తున్న సెల్ ఫోన్ కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిల విషయంలో తాత్సారం చేస్తున్నాయి. ప్రభుత్వానికి చెల్లించాల్సిన సర్దుబాటు చేసిన స్ధూల రాబడిపై బకాయిల చెల్లింపుల కోసం నూతన షెడ్యూల్‌ను ప్రకటించాలని కోరుతూ టెలికాం కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. కంపెనీల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఏజీఆర్‌ బకాయిల చెల్లింపుల్లో విఫలమైన టెలికాం కంపెనీలపై కఠిన చర్యలు ఎందుకు చేపట్టలేదని టెలికాం శాఖను మందలించింది.భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలపై కోర్టు ధిక్కరణ అభియోగాలకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈకేసు విచారణను మార్చి 17కు వాయిదా వేసింది. బకాయిల చెల్లింపులపై ఒత్తిడి చేయరాదని కోరుతూ అటార్నీ జనరల్‌కు లేఖ రాసిన టెలికాం శాఖ అధికారిపైనా సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. తనపై ఎందుకు చర్య తీసుకోరాదో వివరించాలని కోరుతూ ఆ అధికారికి కోర్టు ధిక్కరణ నోటీసును జారీ చేసింది.

ఏజీఆర్‌ చెల్లింపులపై పలుసార్లు ఉత్తర్వులు ఇచ్చినా ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించింది. దీనికి సంబంధించిన వివరణతో మార్చి 17న కోర్టుకు హాజరవ్వాలని ఆదేశించింది.  భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఇండియా సహా టెలికాం కంపెనీల ఎండీ, డైరెక్టర్లందరికీ కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు చేపట్టరాదో తెలపాలని సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. టెలికాం కంపెనీల పిటిషన్‌పై జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ ఎంఆర్‌ షాలతో కూడిన సుప్రీం బెంచ్‌ విచారణను చేపట్టింది. 

ఈ ఏడాది జనవరి నాటికి వోడాఫోన్, ఎయిర్ టెల్ కంపెనీలు ప్రభుత్వానికి ఏజీఆర్ రూపంలో చెల్లించాల్సిన బకాయిల విలువ రూ. 53 వేల కోట్లకు పైమాటే. ఈ బకాయిల చెల్లింపులు కంపెనీల మనుగడకే ప్రమాదకరంగా మారాయి.

దీనిపై ప్రభుత్వం ఉపశమన చర్యలు చేపట్టకపోతే కంపెనీ మూతపడడం ఖాయమని వోడాఫోన్ ఐడియా అధినేత కుమార మంగళం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చెల్లింపుల వల్లే వోడాఫోన్ ఐడియా రూ 50 వేల కోట్ల నష్టాలకు చేరింది. మరి సుప్రీంకోర్టు ఈ బకాయిల విషయంలో ఎలా వ్యవహరిస్తుందో చూడాలి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle