ఎయిర్టెల్ గ్లోబల్ ప్యాక్స్‌లలో మరింత మెరుగైన ఫీచర్లు.. 82 దేశాలకు వర్తింపు
29-02-202029-02-2020 11:28:07 IST
2020-02-29T05:58:07.431Z29-02-2020 2020-02-29T05:58:05.432Z - - 17-04-2021

తన ప్రీపెయిడ్ కస్టమర్లకు రియల్ టైమ్ యూసేజ్ ట్రాకింగ్, ఇంటర్నేషనల్ రోమింగ్ సర్వీసును సింగిల్ టచ్‌తో ప్రారంభించడం లేక నిలిపివేయగల ఆప్షన్, ప్రీబుక్ ఐఆర్ ప్యాక్ తదితర ఎన్నో కొత్త ఫీచర్లను అందిస్తూ ఎయిర్టెల్ కొత్త ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్‌లను ప్రారంభించింది. ఈ సింగిల్ ప్యాకేజి దాదాపు 82 దేశాలను కవర్ చేస్తుందని సంస్థ ప్రకటించింది.
కస్టమర్ ప్రయోజనాలకు అనుగుణమైన ప్లాన్లను అందించడంలో భాగంగా భారతి ఎయిర్టెల్ తన మొబైల్ కస్టమర్ల కోసం ఇంటర్నేషనల్ రోమింగ్ (ఐఆర్) అనుభవాన్ని మెరుగుపరిచేందుకు మరో వినూత్న ఆవిష్కరణను ప్రవేశపెట్టింది.
వ్యాపార, పర్యాటక అవసరాల నిమిత్తం విదేశాలను సందర్శించే భారతీయుల సంఖ్య పెరుగుతుండటంతో ఆయా కస్టమర్లను ఆకట్టుకునేలా ఎయిర్టెల్ ఆకర్షణీయ ఫీచర్లతో గ్లోబల్స్ ప్యాక్స్‌ను లాంఛ్ చేసింది. ఎయిర్టెల్ కస్టమర్లు తమ ఎయరి్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా ప్రస్తుతం తమ అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్ యూసేజ్‌ను రియల్ టైమ్‌లో ట్రాక్ చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది.
కేవలం సింగిల్ టచ్‌తో అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌ను ఎనేబుల్, డిసేబుల్ చేసుకోవచ్చని ఎయిర్టెల్ తెలిపింది. మరో ప్యాక్‌ను తీసుకోవడం, టాప్ చేసుకోవడం థ్యాంక్స్ యాప్ ద్వారా చేపట్టవచ్చని వెల్లడించింది. ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లు తమ ప్రయాణ తేదీకి 30 రోజుల ముందుగా అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌ను కొనుగోలు చేయవచ్చని, వారు అంతర్జాతీయ మొబైల్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయిన తర్వాత నుంచే ప్యాక్ వ్యాలిడిటీ ప్రారంభమవుతుందని పేర్కొంది.
ఈ ఫీచర్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకూ అందుబాటులో ఉందని ఎయిర్టెల్ తెలిపింది. అంతర్జాతీయ ట్రావెల్లో కస్టమర్లు ఎదుర్కొనే ఇబ్బందులు, వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని అందుకు అనుగుణంగా అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌లను డిజైన్ చేశామని ఎయిర్టెల్ చీఫ్ మార్కెటింగ్, బ్రాండ్ ఆఫీసర్ శశ్వత్ శర్మ తెలిపారు.
ట్రావెల్ బేసిక్స్ - ప్రీపెయిడ్ కస్టమర్లకు గ్లోబల్ ప్యాక్ వివరాలు
రూ. 1199 - 1 జీబీ డేటా, భారత్‌లోనూ, అతిథేయ దేశంలోను 100 నిమిషాల ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్. 30 రోజులకు అపరిమిత ఎస్ఎమ్ఎస్లు పంపవచ్చు
రూ. 799 - భారత్‌లోనూ, అతిథేయ దేశంలోను 100 నిమిషాల ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్. 30 రోజులకు అపరిమిత ఎస్ఎమ్ఎస్లు పంపవచ్చు
రూ.4,999 - 1 జీబీ/ డే డేటా, అపరిమిత ఇన్ కమింగ్ కాల్స్, భారత్‌లోనూ, అతిథేయ దేశంలోను 500 నిమిషాల అవుట్ గోయింగ్ కాల్స్. 10 రోజులకు అపరిమిత ఎస్ఎమ్ఎస్లు పంపవచ్చు.


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా