newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఎన్నికల అక్రమాలపై వాచ్ డాగ్ ‘నిఘా’ యాప్

07-03-202007-03-2020 17:50:16 IST
2020-03-07T12:20:16.064Z07-03-2020 2020-03-07T12:20:13.953Z - - 14-04-2021

ఎన్నికల అక్రమాలపై వాచ్ డాగ్ ‘నిఘా’ యాప్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీతో పాటు ఇతర ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల్లో అక్రమాలను సామాన్యులు సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు నిఘా యాప్‌ రూపకల్పన చేసింది.ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం తాడేపల్లిలోని తన నివాసంలో నిఘా యాప్‌ను ఆవిష్కరించారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీని నివారించి, అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. 

ఎన్నికల సంఘం, పోలీస్‌ వ్యవస్ధ తీసుకుంటున్న చర్యలకు అదనంగా నిఘా యాప్‌ను రూపొందించింది. సామాన్యులెవరైనా ఈ నిఘా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దీని ద్వారా స్ధానిక సంస్ధల ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీకి పాల్పడుతున్న వారి వివరాలతో పాటు చట్ట వ్యతిరేకంగా తమ దృష్టికి వచ్చిన ఏ అంశంపైనా ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉంది. యాప్‌ ద్వారా చేసే ఫిర్యాదులు నేరుగా సెంట్రల్‌ కంట్రోల్‌ రూంకు చేరుతాయి. అక్కడ నుంచి సంబంధిత అధికారులు దానిపై చర్యలు తీసుకుంటారు. వీడియో, ఫోటోల రూపంలో ఫిర్యాదులు పంపించవచ్చు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బులు, మద్యం పంచి ఓటర్లను ఎవరైనా ప్రభావితం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వెనకాడకూడదని చెప్పారు. సొంత పార్టీ నేతలకు కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రలోభాలకు సొంత పార్టీ నేతలు దిగినా చర్యలు తప్పవని వెల్లడించారు. ఈ ఎన్నికల ఫలితాలపైనే కొంతమంది మంత్రుల భవిష్యత్తు ఆధారపడి వుంటుందని చెబుతున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి ఎవరయినా సరే మద్యం పంచుతూ లేదా ఓటర్లను ప్రభావితం చేసేలా డబ్బులు పంచుతూ కంటపడితే నిఘా యాప్‌ ద్వారా ఒక్క ఫిర్యాదు చేయవచ్చు. ఈ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులను సత్వరం పరిశీలిస్తారు. అభ్యర్థిపై వెంటనే విచారణ జరిగి నిజమని తేలితే అనర్హత వేటు కూడా వేస్తారు. అఫిడవిట్లలో తప్పులను కూడా నిఘా యాప్ ద్వారా ఈసీ దృష్టికి తేవచ్చు.

మరోవైపు నిఘా యాప్ ప్రారంభం సీఎం చేతుల మీదుగా జరపడం ఏంటని ఆక్షేపించారు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. సీఎం సూపర్ ఎలక్షన్ కమిషనర్ లా వ్యవహరిస్తున్నారని తీవ్రంగా విరుచుకుపడ్డారు. తక్కువ సమయంలో ఎన్నికలకు సిద్ధంకావడం ఏంటని బాబు ప్రశ్నించారు. రిజర్వేషన్లు ఇష్టారీతిన ప్రకటించారన్నారు. ఎన్నికలపై నిఘా పెట్టే బాధ్యత ఈసీదని, కానీ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఏంటన్నారు.  

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle