newssting
BITING NEWS :
* చెదురుమదురు ఘటనలు మినహా తెలంగాణలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌*ఏపీ శాసనమండలి కీలక నిర్ఱయం.. మూడురాజధానుల బిల్లు సెలక్ట్ కమిటీకి.. టీడీపీ సంబరాలు * కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తో * జనసేన అధ్యక్షుడు పవన కల్యాణ్‌ భేటీ..పరిపాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశంపై చర్చ..పవన్‌ వెంట పలువురు బీజేపీ నేతలు*అమరావతి: ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు ఏపీ అసెంబ్లీ తీర్మానం *వివాదాస్పద స్వామీజీ నిత్యానందకు బ్లూ కార్నర్ నోటీసులు జారీచేసిన ఇంటర్ పోల్ *ఏపీ: నేడు శాసనసభ కార్యక్రమాలను బహిష్కరించిన టీడీపీ.. అసెంబ్లీకి హాజరుకాకూడదని నిర్ణయం*అమరావతి: ఏపీ రాజధాని పిటిషన్ల విచారణకు హైకోర్ట్ ప్రత్యేక బెంచ్.. సీజే ఆధ్వర్యంలో ఏర్పాటైన త్రిసభ్య ధర్మాసనం*దావోస్: పెట్టుబడుల ఒప్పందాలపై నేడు మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన*చైనాలో పంజా విసురుతోన్న 'కరోనా' వైరస్... ఇప్పటి వరకు 17 మంది మృతి*జోగులాంబ: ఎర్రవల్ల దగ్గర రోడ్డు ప్రమాదం... ట్రాక్టర్‌ను ఢీకొన్న కారు, ముగ్గురు మృతి

ఎంఐ బ్యాండ్‌ 4 వచ్చేస్తోంది!

11-09-201911-09-2019 14:01:18 IST
Updated On 11-09-2019 14:02:17 ISTUpdated On 11-09-20192019-09-11T08:31:18.162Z11-09-2019 2019-09-11T08:29:51.959Z - 2019-09-11T08:32:17.305Z - 11-09-2019

ఎంఐ బ్యాండ్‌ 4 వచ్చేస్తోంది!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇప్పుడు ఎవరినోట విన్నా ఫిట్‌ నెస్‌ మాటే... దానికి తోడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ‘ఫిట్‌ ఇండియా’ అన్నారు. అందుకే ఈ మధ్య ఏ యూత్‌ చేతికి చూసినా ఏదో ఒక ఫిట్‌ నెస్‌ బ్యాండ్‌ కనిపిస్తోంది. మీరూ అలాంటివాళ్లే అయితే మీకో గుడ్‌ న్యూస్‌. ‘ఎంఐ బ్యాండ్‌ 3’కి సక్సెసర్‌ ‘ఎంఐ బ్యాండ్‌ 4’ వచ్చేస్తోంది. చాలా రోజులుగా ఊరిస్తూ వచ్చిన షావోమీ ఎంఐ బ్యాండ్‌ 4 విడుదల తేదీని ప్రకటించింది.

ఈ నెల 17న ఏర్పాటు చేసిన స్మార్ట్‌ లివింగ్‌ కార్యక్రమంలో కొత్త బ్యాండ్‌ను లాంచ్‌ చేస్తారు. ఎంఐ బ్యాండ్‌ 4ను MI.COM, AMAZON.IN తోపాటు ఎంఐ హోమ్స్‌లో కొనుగోలు చేయొచ్చు. అయితే దీని ధరపై ఇంకా సమాచారం లేదు.ఎంఐ బ్యాండ్‌ 4 ఇప్పటికే చైనాలో విడుదలైంది. తాజాగా భారత్‌కు తీసుకొస్తున్నారు. ఇందులో 0.95 అంగుళాల కలర్‌ ఆమోలెడ్‌ డిస్‌ప్లే ఉంటుంది. 120X240 పిక్సల్స్‌ రిజల్యూషన్లో ఈ డిస్‌ప్లేను రూపొందించారు. ఒకసారి ఫుల్‌ ఛార్జి చేస్తే 20 రోజులవరకు బ్యాండ్‌ వినియోగించుకోవచ్చు.

ఇందులో సిక్స్‌ యాక్సిస్‌ యాక్సెలెరోమీటర్‌ ఉంటుంది. దీని వల్ల సైక్లింగ్‌, ఎక్సర్‌సైజ్‌, రన్నింగ్‌, వాకింగ్‌ లాంటి ఫిజికల్‌ యాక్టివిటీస్‌ను సులభంగా ట్రాక్‌ చేయగలుగుతుంది. ఇందులో 5 ఏటీఎం రేటింగ్‌ ఉండటం వల్ల దీంతో స్విమ్మింగ్‌ కూడా చేయొచ్చు. ఫ్రీ స్టైల్‌, బ్రెస్ట్‌ స్ట్రోక్‌, బటర్‌ఫ్లై లాంటి రకరకాల స్విమ్మింగ్‌ స్ట్రోక్స్‌ను హ్యాండిల్‌ చేయగలదు. ఇందులో గూగుల్‌ అసిస్టెంట్‌ కూడా ఉంది.

ఎంఐ బ్యాండ్‌ 4 ధరపై ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం లేదు. చైనాలో పెట్టిన ధరను పరిశీలిస్తే ఇక్కడ ₹ 1800 నుంచి ₹ 2000 వరకు ఉండొచ్చని సమాచారం. ఎంఐ బ్యాండ్‌ 3  ₹1,999 ధర పెట్టారు కాబట్టి బ్యాండ్‌ 4 కూడా అదే ధరలో ఉండొచ్చనేది పరిశీలకుల మాట.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle