newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఎంఐ బ్యాండ్‌ 4కి పోటీగా లెనోవో వాచీ... చూశారా.!

17-09-201917-09-2019 10:07:38 IST
2019-09-17T04:37:38.742Z17-09-2019 2019-09-17T04:37:35.785Z - - 22-04-2021

ఎంఐ బ్యాండ్‌ 4కి పోటీగా లెనోవో వాచీ... చూశారా.!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మొబైల్‌ ధరల యుద్ధం జోరుగా సాగుతున్న వేళ... మార్కెట్‌లో ఫిట్‌నెస్‌ గ్యాడ్జెట్ల పోరు మొదలైంది. ఒకప్పుడు ఫిట్‌బిట్‌ ఫిట్‌నెస్‌ ట్రాకర్లు కొనాలంటే మధ్య తరగతి వాళ్లకు చాలా కష్టం. కానీ షావోమీ, హానర్‌, అమేజ్‌ఫిట్‌ వచ్చాక ఇది చాలా సులభం అయిపోయింది. ఈ పోటీలోకి ఇంటెక్స్‌ లాంటి సంస్థలు వచ్చినా మనుగడ సాధించలేకపోయాయి. ఇప్పుడు ఈ పోరులోకి నేనున్నా అంటూ లెనోవో వచ్చింది.  ₹ 4000 ధరలోపు ఓ ఫిట్‌నెస్‌ వాచీని తీసుకొచ్చింది. ఇది త్వరలో మార్కెట్‌లోకి రానున్న ఎంఐ బ్యాండ్‌ 4కి పోటీ అని చెప్పకనే చెప్పింది.

కార్మ్‌ (HW25P) పేరుతో లెనోవో ఓ స్మార్ట్‌ వాచీని ఆదివారం నుంచి లెనోవో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ₹ 3,499 ధరలో అత్యుత్తమ ఫీచర్లతో దీన్ని రూపొందించినట్లు లెనోవో తెలిపింది.  ఇది ఆన్‌లైన్‌లో ఫ్లిప్‌కార్ట్‌లోను, ఆఫ్‌లైన్‌లో క్రోమా స్టోర్‌లోనూ లభిస్తుంది. ఈ వాచీ నలుపు, ఆకుపచ్చ రంగులో అందుబాటులో ఉంటుంది. ఇందులో 1.3 అంగుళాల ఐపీఎస్‌ కలర్‌ డిస్‌ప్లే ఉంటుంది. IP68 వాటర్‌ ప్రూఫ్‌ సపోర్టు, డస్ట్‌ ప్రూఫ్‌ సాంకేతికత ఉంటాయి. ఇందులో 200 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. ఒకసారి ఫుల్‌ ఛార్జి చేసుకుంటే ఏడు రోజుల వరకు వాచీని వాడుకోవచ్చు. 

కార్మ్‌ వాచీలో పెడో మీటర్‌, హార్ట్ రేటింగ్‌ మానిటర్‌, స్లీప్‌ మానిటర్‌ లాంటి ఫీచర్లు ఉన్నాయి. స్కిప్పింగ్‌, బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌ బాల్‌, ఫుట్‌బాల్‌, స్విమ్మంగ్‌, వాకింగ్‌, రన్నింగ్‌, సైక్లింగ్‌ను ట్రాక్‌ చేసేలా ఇందులో 8 స్పోర్ట్స్‌ మోడ్‌ ఉంటుంది.  ఈమెయిల్స్‌, మెసేజెస్‌, కాల్స్‌, సోషల్‌ యాప్స్‌ నోటిఫికేషన్లను వాచీలో పొందొచ్చు. ఇది బ్లూటూత్‌ 4.2తో పని చేస్తుంది. కార్మ్‌ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ డివైజ్‌లకు సపోర్ట్‌  చేస్తుంది. మరి ఆసక్తికరమైన ఫీచర్లతో వస్తున్న కార్మ్‌... ఎంఐబ్యాండ్‌ 4కి ఎంతవరకు పోటీ ఇస్తుందో చూడాలి. 

Image result for lenovo smart watch

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   6 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle