newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఎంఐ టీవీ 4ఏ హారిజన్ 32-ఇంచెస్ సేల్స్ నేటి నుండే..!

11-09-202011-09-2020 12:12:27 IST
2020-09-11T06:42:27.807Z11-09-2020 2020-09-11T06:42:20.517Z - - 19-04-2021

ఎంఐ టీవీ 4ఏ హారిజన్ 32-ఇంచెస్ సేల్స్ నేటి నుండే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
షియోమీ కంపెనీకి చెందిన ఎంఐ టీవీ 4ఏ హారిజన్ ను భారత్ లో ఈ వారంలో లాంచ్ చేసింది. ముఖ్యంగా ఫ్రంట్ ఫ్రేమ్ లో చేసిన మార్పులు టీవీని కొనాలనుకుంటున్న వారికి ఒక మంచి చాయిస్ గా మారనుంది. స్పోర్ట్ షియోమీ వివిడ్  పిక్చర్ ఇంజిన్ కూడా  ఈ టీవీలలో పొందు పరిచారు.  పూర్తీ హై డెఫినెషన్ ను ఈ టీవీ సపోర్ట్ చేయనుంది.

ఈ టీవీలో రెండు వేరియంట్స్ ఉండనున్నాయి. 32 ఇంచెస్, 43 ఇంచెస్.. గూగుల్ ప్లే స్టోర్ కు సంబంధించిన కొన్ని వేల యాప్స్ ను ఈ టీవీలో ఇంస్టాల్ చేసుకోవచ్చు. టీవీ చూసే ఎక్స్పీరియన్స్ ను మారుస్తామని షియోమీ కంపెనీ గతంలో వెల్లడించింది.. అందులో భాగంగానే పలు విప్లవాత్మక మార్పులను తీసుకుని వచ్చింది. 32 ఇంచెస్ టీవీని ఈరోజు నుండి సేల్స్ లో పెట్టారు.

శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత 32 ఇంచెస్ ఎంఐ టీవీ 4ఏ హారిజన్ ను ఫ్లిప్ కార్ట్ లో అమ్మనున్నారు. 13,499 రూపాయలకు అమ్మనున్నారు. 43 ఇంచెస్ ఎంఐ టీవీ 4ఏ హారిజన్ ధరను 22,999 గా నిర్ణయించారు. సెప్టెంబర్ 15 సాయంత్రం 6 గంటల సమయం నుండి అమ్మకానికి ఉంచనున్నారు. షియోమీ రీటైల్ అవుట్ లెట్స్ లో కూడా ఈ టీవీలు లభించనున్నాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Mi TV 4a ప్రత్యేకతలు:

ఇంతకు ముందు వచ్చిన టీవీలతో పోల్చుకుంటే ఎంఐ టీవీ 4ఏ హారిజన్ లో క్లీనర్ డిజైన్ కనిపించనుంది.. మినిమల్ బెజెల్స్ తో పాటూ ఫ్రంట్ ఫ్రేమ్ లో కూడా మార్పులు చేశారు. 95 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో, 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్ ఉండనుంది. స్మాల్ స్క్రీన్ టీవీలలో హెచ్.డి. ప్లస్ రెజల్యూషన్ కాగా, బిగ్గర్ స్క్రీన్ లో ఫుల్ హెచ్.డి. ప్లస్ ఉండనుంది. ప్యాచ్ వాల్ యుఐ ఆధారంగా పని చేయనున్నాయి.

ఎల్.ఈ.డి. డిస్ప్లే ఉండగా.. బూటప్ టైమ్ గత టీవీలతో పోలిస్తే మరింత మెరుగైంది. Mi QuickWake ద్వారా టీవీని ఆన్ చేయొచ్చు. 20వ స్టీరియో స్పీకర్స్ కు డీటీఎస్-హెచ్.డి. ఆడియో ఉండనుంది. 3.5 ఎంఎం ఆడియో అవుట్ కూడా ఉంది.  SPDIFతో పాటూ  మూడు HDMI పోర్టులు కూడా ఉన్నాయి. 

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle