newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఉన్మాద క్రీడగా మారిన పబ్జి!

10-09-201910-09-2019 17:09:46 IST
Updated On 10-09-2019 17:47:48 ISTUpdated On 10-09-20192019-09-10T11:39:46.497Z10-09-2019 2019-09-10T11:39:33.117Z - 2019-09-10T12:17:48.212Z - 10-09-2019

ఉన్మాద క్రీడగా మారిన పబ్జి!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

పబ్ జి ..ప్రపంచ వ్యాప్తంగా యువతను ఉన్మాదంలో ముంచేస్తున్న ఆన్ లైన్ గేమ్. ఇది మల్టీ ప్లేయర్ గేమ్ కావడంతో వేగంగా వ్యాప్తి చెందింది. ఇది ఆన్ లైన్ గేమింగ్ యాప్. ఈ గేమ్ గ్రూప్ వాయిస్ గేమ్ కూడా. దీంతో ఒకరితో ఒకరికి ఏ మాత్రం పరిచయం లేకుండానే మాట్లాడుకోవచ్చు. గేమ్ ప్లాన్ పై చర్చించుకోవచ్చు. ప్రధానంగా ఇది విజయమో, వీరస్వర్గమో అన్నట్లుగా హింసాత్మక ప్రవృత్తిని రేకెత్తించే కిల్లింగ్ గేమ్. గరిష్టంగా వంద మంది వరకే ఈ పబ్జి ఆడే అవకాశం ఉండొచ్చు. ఇది టీమ్ గేమ్ కూడా...టీమ్ గా ఏర్పడిన సభ్యులు తప్ప మిగిలిన వారంతా శత్రువులే.

ఈ పబ్ జి  గేమ్ ఒక యుద్ధ క్రీడ. ఎదుటి వాడిని లేదా జట్టును ఓడించడమే ధ్యేయంగా ఆడే ఈ ఆట ఆరంభంలో సరదాగానే ఉన్నా రానురాను ఒక ఉన్మాదంలా మారిపోతుంది. ఇందుకు అనేక దాఖలాలు ఉన్నాయి. వ్యసనంగా మారిపోయిందని ఓ తండ్రి కుమారుడికి పబ్జి ఆడటానికి అంగీకరించకపోవడంతో ఆ కుర్రాడు కన్నతండ్రినే కర్కశంగా కడతేర్చేసిన సంఘటన ఈ ఆటలో పడిన వారు ఎంతటి ఉన్మాదులుగా మారతారో అవగతమౌతుంది. ప్రపంచ వ్యాప్తంగా పబ్జి ఆడే వారు పాతిక కోట్ల మంది ఉంటారన్నది ఒక అంచనా. సమయం, సందర్భం, పరిమితి, నియంత్రణ కోల్పోయి రోజంతా ఈ ఆటలోనే మునిగి తేలేంతగా బానిసలుగా మారిపోయిన వారి సంఖ్య నాలుగు కోట్ల పైమాటేనన్నది అధికారికంగా తేలిన లెక్క. 

ఈ ఆట ఆడేవారిలో ఉన్మాదం తారస్థాయికి చేరుకుంటుంది. హింసాత్మక ప్రవృత్తి ప్రబలుతుంది. విద్యార్థుల చదువులపై ఈ ఆట ప్రభావం పడుతోంది. పలు రాష్ట్రాలలో టెన్త్ ఫలితాలపై కూడా ఈ గేమ్ ప్రభావం కనిపిస్తున్నదని విద్యాశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అయితే టెన్త్ లో ఉత్తీర్ణతా శాతం గణనీయంగా పడిపోయింది. దీంతో ఆ రాష్ట్రంలో పబ్ జి గేమ్ ని నిషేధించాలన్న ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. ఇక గుజరాత్ లో అయితే విద్యాసంస్థలలో ఈ గేమ్ ఆడటాన్ని నిషేధించారు. ముఖ్యంగా హాస్టళ్లలో ఉండే విద్యార్థులలో పబ్ జి వ్యసనం విపరీతంగా కనిపిస్తున్నది. 

పబ్ జి కి బానిసైన వ్యక్తిలో ఎంతటికైనా తెగించేంతగా మానసిక నియంత్రణ కోల్పోతాడు. ఈ గేమ్ లో పరాజయం పాలైన ఒక యువకుడు మానసిక రోగిలా మారిపోయాడు. తిండి, నిద్ర కూడా గుర్తురానంతగా ఈ ఆట ధ్యాసలో పడి ఎందరో అనారోగ్యం పాలయ్యారు. వార్ గేమ్ కావడంతో గెలవడం ఒక్కటే లక్ష్యం, ఓటమి పాలైతే చావే అన్న మానసిక దౌర్బల్యానికి లోనౌతున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు. యువతను మానసిక దౌర్బల్యానికి లోను చేసే ఈ గేమ్ ను నిషేధాంచాలన్న డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది. ఇక పాఠశాల స్థాయి విద్యార్థులలో కూడా పబ్ జి  విపరీత పోకడలకు కారణమౌతున్నది. ఈ గేమ్ కు బానిస అయిన వారి శారీరక, మానసిక ఎదుగుదల లోపభూయిష్టంగా ఉంటోందని సైకాలజిస్టులు చెబుతున్నారు. పబ్ జి  గేమ్ ను నిషేధించాలన్న ఒక ఉద్యమం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నది. ఈ ఉద్యమానికి జాతీయ బాలల హక్కుల కమిషన్ మద్దతు కూడా ప్రకటించింది.

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle