newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఉద్యోగులకు ఉబెర్ షాక్.. 600 మంది తొలగింపు

26-05-202026-05-2020 13:27:06 IST
Updated On 26-05-2020 15:16:05 ISTUpdated On 26-05-20202020-05-26T07:57:06.041Z26-05-2020 2020-05-26T07:55:48.852Z - 2020-05-26T09:46:05.502Z - 26-05-2020

ఉద్యోగులకు ఉబెర్ షాక్.. 600 మంది తొలగింపు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ అన్ని రంగాల్లోని ఉద్యోగాలపై ప్రభావం చూపిస్తోంది. లాక్‌డౌన్‌ సంక్షోభంతో క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ ఇండియాలో తన ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. వందలాదిమందిపై వేటు వేసింది. భారతదేశంలో 600 మందిని తొలగించనున్నట్టు ప్రకటించింది. వివిధ స్థాయిలు, టీమ్ లలో వీరిని తొలగించినట్టు ఉబెర్ తాజాగా ధృవీకరించింది. 

డ్రైవర్ , రైడర్ సపోర్ట్  ఇతర డివిజన్లలో భారతదేశంలో దాదాపు 600 మందిని తొలగిస్తున్నట్టు ఉబెర్ ఇండియా, దక్షిణ ఆసియా అధ్యక్షుడు ప్రదీప్ పరమేశ్వరన్ తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరికి కనీసం 10 వారాల జీతం చెల్లింపు, రాబోయే ఆరు నెలలకు మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్, అవుట్‌ప్లేస్‌మెంట్ సపోర్ట్, ల్యాప్‌టాప్‌ల వాడకానికి అనుమతి  ఇచ్చింది. అలాగే 3700 పూర్తికాల  ఉద్యోగులపై వేటు వేసింది. 

ఉబెర్ సీఈవో దారా ఖోస్రోషాహి మిగిలిన సంవత్సరానికి గాను తన మూల వేతనాన్ని వదులుకోనున్నారు. కంపెనీ నిర్ణయం వల్ల 14 శాతం ఉద్యోగులు రోడ్డున పడనున్నారు.  ప్రపంచవ్యాప్తంగా  450 డ్రైవర్ సేవా కేంద్రాల్లో 40 శాతం మూసివేస్తోంది.  కోవిడ్-19 మహమ్మారి తమ వ్యాపారాలను నాశనం చేసిందని ఉబెర్ పేర్కొంది. గత ఏడాది జూలై నుండి అక్టోబర్  వరకు పలుమార్లు 1,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించిన సంస్థ తాజాగా మరోసారి ఉద్యోగులపై వేటు వేయడంపై వారు మండిపడుతున్నారు. 

కరోనా కారణంగా ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో ఉబెర్ ఖర్చులను తగ్గించుకునే చర్యలకు దిగింది. ప్రస్తుత పరిస్థితిలో ఉబెర్ కు దాదాపు 20 మిలియన్ డాలర్ల ఖర్చులున్నాయి. దీంతో ఉద్యోగుల తొలగింపు తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదంటోంది. మరోవైపు ఉబెర్ కొత్త ఈట్స్ ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఇది రియల్ టైమ్ డెలివరీ ట్రాకింగ్‌తో  ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. తన ఆహార పంపిణీ వ్యాపారంతో కొంత కోల్పోయిన ఆదాయాన్ని తిరిగి పొందే అవకాశం వుందని భావిస్తున్నారు.

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   6 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle