newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఈ రెడ్‌మీ ఫోన్‌... ఆఫ్‌లైన్‌ కోసమే

19-11-201919-11-2019 10:16:42 IST
Updated On 19-11-2019 12:13:53 ISTUpdated On 19-11-20192019-11-19T04:46:42.893Z19-11-2019 2019-11-19T04:46:41.023Z - 2019-11-19T06:43:53.556Z - 19-11-2019

ఈ రెడ్‌మీ ఫోన్‌... ఆఫ్‌లైన్‌ కోసమే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బడ్జెట్‌ మొబైల్స్‌ ఆన్‌లైన్‌ మార్కెట్‌లో రారాజుగా వెలుగొందుతున్న షావోమీకి ఆఫ్‌లైన్‌లో కూడా మంచి మార్కెటే ఉంది. దాన్ని ఇంకా పెంచుకోవడానికి మరిన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో కొత్త ఫోన్‌ రెడ్‌మీ నోట్‌ 8కి ఆఫ్‌లైన్‌ మార్కెట్‌ పెరగడానికి ఆలోచనలు చేస్తోంది. దీని కోసం కొత్తగా ఓ వేరియంట్‌ను లాంచ్‌ చేస్తోంది. ఆఫ్‌లైన్‌ మొబైల్‌కు సంబంధించి రిటైల్‌ బాక్స్‌ ఒకటి బయటికొచ్చింది. దాని ప్రకారం చూస్తే ఈ మొబైల్‌ 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ అంతర్గత మెమొరీతో వస్తుంది.

నోట్‌ సిరీస్‌లో భాగంగా గత నెలలో రెడ్‌మీ నోట్‌8 మొబైల్‌ను షావోమీ లాంచ్‌ చేసింది. అయితే గతానికి భిన్నంగా కేవలం 4 జీబీ ర్యామ్‌ + 64 జీబీ ఇంటర్నల్‌, 6 జీబీ ర్యామ్‌ + 128 జీబీ ఇంటర్నల్‌ వెర్షన్స్‌ ను మాత్రమే తీసుకొచ్చింది. వాటిని ఎంఐ.కామ్‌, అమెజాన్‌లో సేల్‌కు తీసుకొచ్చింది. 3 జీబీ ర్యామ్‌ + 32 జీబీ ఇంటర్నల్‌ వెర్షన్‌ను ఎందుకు తీసుకురాలేదో ఆ రోజు చెప్పలేదు. కానీ ఇప్పుడు ఆ వెర్షన్‌ వస్తోంది. అయితే ఇది కేవలం ఆఫ్‌లైన్‌ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకునే వస్తోంది. అది కూడా మన దేశానికే పరిమితం అని తెలుస్తోంది. దీని ధరను రూ. 9,799గా నిర్ణయించారు. అంటే ఆన్‌లైన్‌లో దొరుకుతున్న 4 జీబీ ర్యామ్‌ + 64 జీబీ ఇంటర్నల్‌ వెర్షన్‌కు కేవలం రూ. 200 తక్కువ ధరలో. 

స్పెసిఫికేషన్స్‌ ఇవీ...

రెడ్‌మీ నోట్‌ 8లో 6.39 ఇంచ్‌ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ ఉంటుంది. 2340X1080 పిక్సల్స్‌ రిజల్యూషన్‌తో వస్తుంది. మొబైల్‌ను ముందు, వెనుక గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటక్షన్‌ ఇస్తున్నారు. ఇందులో క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాన్‌ 665 ప్రాసెసర్‌ ఉంటుంది. అడ్రినో 610 జీపీయూ అందిస్తున్నారు. మైక్రో ఎస్‌డీ కార్డుతో మెమొరీని పెంచుకోవచ్చు.

ప్రస్తుతం ఈ మొబైల్‌ ఆండ్రాయిడ్‌ 9 ఆధారిత ఎంఐయూ10తో పని చేస్తోంది. త్వరలో ఎంఐయూఐ11 వస్తుంది. ఈ మొబైల్‌ వెనుకవైపు నాలుగు కెమెరాలు ఉంటాయి. 48 ఎంపీ ప్రధాన కెమెరా కాగా, 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 2 ఎంపీ మాక్రో లెన్స్‌, 2 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ ఉంటాయి. ఈ మొబైల్‌లో 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ అందిస్తున్నారు. 18 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు ఇది సపోర్టు చేస్తుంది. 

 

 

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   5 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle