newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

ఈ రిస్ట్ బ్యాండ్ వుంటే... టెంపరేచర్ తెలుసుకోవడం ఈజీ

26-07-202026-07-2020 08:51:09 IST
2020-07-26T03:21:09.690Z26-07-2020 2020-07-26T03:20:42.901Z - - 03-08-2020

ఈ  రిస్ట్ బ్యాండ్ వుంటే... టెంపరేచర్ తెలుసుకోవడం ఈజీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రోజురోజుకీ కరోనా కేసుల ఉధృతి పెరుగుతోంది. కరోనా వైరస్ లక్షణాల్లో ముఖ్యమయినది శరీర ఉష్ణోగ్రత పెరగడం. దీనిని తెలుసుకోవాలని ధర్మామీటర్, ధర్మల్ గన్ అవసరం. అయితే అందరికీ అవి అందుబాటులో ఉండడం లేదు. ఐఐటీ మద్రాస్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్ మ్యూజ్ వేరబుల్స్ కరోనా వైరస్ లక్షణాలు గుర్తించి రిస్ట్ బాండ్ తయారు చేసింది. ఇందు కోసం రూ.22 కోట్లు సమీకరించింది. ఆగస్ట్ నాటికి ఈ రిస్ట్ బ్యాండ్ 70 దేశాల్లో మార్కెట్ లోకి అందుబాటులో రానుంది. శరీర ఉష్ణోగ్రత ఎంత వుంది అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడే ఈ రిస్ట్ బ్యాండ్ ధర రూ.3,500.

ఈ రిస్ట్ బాండ్ శరీర ఉష్ణోగ్రతనే కాదు అనేక అంశాలను పరిశీలిస్తుంది. గుండె కొట్టుకునే వేగాన్ని ట్రాక్ చేస్తుంది. బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ తెలియజేస్తుంది. కరోనా మహమ్మారి వ్యాధి లక్షణాలు ప్రారంభ దశలో ఉంటే వీటి ద్వారా ట్రాక్ చేయడానికి సులువు కానుంది. ఈ ఏడాది తాము 2 లక్షల ఉత్పత్తులను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, 2022 నాటికి పది లక్షలకు పెంచాలని భావిస్తున్నట్లు ఐఐటీ మద్రాస్ అలుమ్నీ కేఎల్ఎన్ సాయి ప్రశాంత్ చెబుతున్నారు.

తమపై నమ్మకం వల్లే నిధులు సమకూరాయంటున్నారు ప్రశాంత్. మ్యూజ్ వేరబుల్స్ తయారు చేస్తోన్న రిస్ట్ బాండ్‌ను మ్యూజ్ హెల్త్ యాప్ ద్వారా స్మార్ట్ ఫోన్‌కు కనెక్ట్ చేసుకునే అవకాశం కూడా వుంది. అంతేకాదు దీనిని బ్లూటూత్‌కు అనుసంధానించవచ్చు. యూజర్ డేటా ఫోన్, రిమోట్ సర్వర్‌లో సేవ్ అవుతుంది. ఇందులో మరిన్ని అదనపు ఫీచర్స్ వున్నాయంటున్నారు. ఈ యాప్ ద్వారా ఆరోగ్య సేతు యాప్ అలర్ట్స్ పొందవచ్చు.

యూజర్లు ఎవరైనా కంటైన్మెంట్ జోన్‌ లేదా కరోనా హాట్‌స్పాట్ సెంటర్‌లోకి వెళ్తే వెంటనే గుర్తించవచ్చు. ఈ రిస్ట్ బ్యాండ్ మీ చేతుల్లో వుంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మీరు ఎక్కడికి వెళ్లినా నిశ్చింతగా ఉండవచ్చు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle