ఈ యాప్‌లు మీ దగ్గర ఉంటే తీసేయండి..
21-09-201921-09-2019 16:54:47 IST
2019-09-21T11:24:47.771Z21-09-2019 2019-09-21T11:24:46.003Z - - 14-04-2021

గూగుల్ ప్లే స్టోర్ ప్రమాదకర యాప్స్ ఉన్నప్పుడు కొన్ని సంస్థలు చెబుతూ ఉంటాయి. వాటిని వెంటనే మొబైల్ నుంచి అన్ఇన్స్టాల్ చేసుకోండి అని హెచ్చరిస్తుంటాయి. తాజాగా మరో రెండు యాప్‌ల గురించి సమాచారం బయటకు వచ్చింది.
వీటిని ఇప్పటివరకు ఏకంగా 15 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఒకవేళ మీ మొబైల్లో ఈ యాప్స్ ఉంటే వెంటనే తొలగించడం శ్రేయస్కరం. వాటిలో ప్రమాదకర యాడ్వేర్ ఉండటమే కారణమట.
మొబైల్స్‌లో డీఫాల్ట్‌గా కెమెరా ఉంటుంది. అది కాకుండా మా కెమెరాలో మీరు ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటే మరింత అందంగా వస్తాయంటూ కొన్ని యాప్‌లు ప్లే స్టోర్‌లో కనిపిస్తుంటాయి. అలాంటివాటిలో Sun Pro Beauty Camera, Funny Sweet Beauty Selfie Camera పేర్లు తాజాగా బయటకు వచ్చాయి. వాండెరా రీసెర్చర్స్ చేసిన పరిశోదనలో ఈ విషయం బయట పడింది.
ఈ యాప్‌లను మొబైల్లో లాంచ్ చేసేటప్పుడు అవి తీసుకున్న పర్మిషన్లను పరిశీలిస్తే ఈ విషయం బయటపడిందట. ఈ యాప్స్ యూజర్ల ఆడియోలను రికార్డు చేస్తున్నాయి. ఫోన్లో మాట్లాడేవే కాకుండా... ఫోన్ పరిసరాల్లోని మాటలు కూడా ఇది రికార్డు చేస్తోందట.
సన్ ప్రో బ్యూటీ కెమెరా యాప్ సెప్టెంబరు 2017లో లాంచ్ చేసింది. ఇప్పటివరకు ఈ యాప్‌ను పది లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఫన్నీ స్వీట్ బ్యూటీ కెమెరా అయితే ఈ ఏడాది జూలైలో లాంచ్ అయ్యింది. దీనికి 50 వేల వరకు డౌన్లోడ్స్ ఉన్నాయి. ఈ యాప్స్ మొబైల్లో ఉంటే వెంటనే అన్ఇన్స్టాల్ చేసి.. మొబైల్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
యాడ్వేర్ అంటే...
మొబైల్లో కొన్ని యాప్‌లు ఓపెన్ చేస్తే ఫుల్ పేజీ యాడ్స్ వస్తుంటాయి. వాటిని క్లిక్ చేస్తే ఆ యాప్ లేదా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ యాడ్స్ మీద క్లిక్ చేస్తే డెవలపర్లకు డబ్బులు వస్తాయి. ఇక్కడివరకు ఓకే. కానీ కొన్ని యాడ్స్ మొబైల్లో బ్యాగ్రౌండ్లో కంటిన్యూగా రన్ అవుతాయి. వీటినే యాడ్వేర్ అంటారు. దీని వల్ల మీ మొబైల్ బ్యాటరీ డౌన్ అయిపోతుంది. దీంతోపాటు యూజర్ల సమాచారం కూడా దొంగతనానికి గురవ్వొచ్చు.



గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా