ఈ మూడు జియో ప్లాన్స్‌తో యమా బెనిఫిట్స్
09-05-202009-05-2020 11:32:44 IST
Updated On 09-05-2020 11:37:04 ISTUpdated On 09-05-20202020-05-09T06:02:44.721Z09-05-2020 2020-05-09T06:01:19.562Z - 2020-05-09T06:07:04.584Z - 09-05-2020

టెలికాం రంగంలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయింది రిలయెన్స్ జియో. లాక్ డౌన్ కారణంగా సాఫ్ట్ వేర్ ఇతర నిపుణులు కూడా స్టే హోం.. స్టే సేఫ్ అంటున్నారు. దీంతో మంచి డేటా ప్లాన్స్ కోసం వారు ఎదురుచూస్తున్నారు. రిలయన్స్ జియో తన ప్లాన్లతో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తోంది. దీనికి తోడు మీరు రోజువారి డేటా పరిమితిని మించిపోతే కనుక మీరు జియో వోచర్ల నుండి అదనపు డేటాను కూడా కొనుగోలు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. 28 రోజుల చెల్లుబాటుతో రిలయన్స్ జియో అందించే ప్లాన్లేంట్లో తెలుసా.. రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ రిలయన్స్ జియో సంస్థ అన్ని రకాల వారికి వివిధ రకాల ప్రయోజనాలను అందిస్తోంది. 28 రోజుల వాలిడిటీతో చాలా చవకగా వుండే ప్లాన్ కావాలంటే కనుక రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ మీకు సరిపోతుంది. 28 రోజుల చెల్లుబాటు కాలానికి లభించే రిలయన్స్ జియో రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ రోజువారీ 1.5జీబీ హై-స్పీడ్ డేటాను అందిస్తోంది. ఈ డేటా అయిపోయిన తరువాత దీని యొక్క వేగం 64 కేబీపీఎస్ కి తగ్గించబడుతుందని జియో చెబుతోంది. ఈ ప్లాన్ తో 1000 నిమిషాల నాన్-జియో కాల్స్ మరియు రోజుకు 100 మెసేజ్ లు చేసుకోవచ్చు. ఈ ప్లాన్ జియో యొక్క అన్ని యాప్ ల చందాకు ఉచిత యాక్సిస్ కూడా పొందుతారు. ప్రతి ఇతర జియో ప్లాన్ మాదిరిగానే జియో-టు-జియో కాల్స్ ఉచితం మరియు అపరిమిత కాలింగ్ సదుపాయం వుంటుంది. తక్కువ బడ్జెట్ వుండి డేటా అంతగా ఉపయోగించనివారికి ఈ ప్లాన్ అదుర్స్ అనే చెప్పాలి. రూ .249 ప్రీపెయిడ్ ప్లాన్ లాక్ డౌన్ వర్క్ ఫ్రం హోం కారణంగా డేటా వినియోగం భారీగా పెరిగింది. ప్రతి ఒక్కరికి ప్రతిరోజూ 3జీబీ డేటా అవసరం లేకుండా 2 జీబీ డేటా కావాలనుకునే వారికి ఈ ప్లాన్ బాగుంటుంది. కొంతమందికి రోజుకు 2జీబీ డేటా కావాలంటారు. అలాంటివారు రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్ ఎంచుకుంటే వారి అవసరాలకు సరిపోతుందని చెప్సాలి. రిలయన్స్ జియో యొక్క రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్‌ను పొందిన వారు 28 రోజుల వాలిడిటీ కాలానికి 1000 నిమిషాల నాన్-జియో కాల్స్, రోజువారీ 2జీబీ డేటా ఇంటర్నెట్ ప్రయోజనాలను పొందుతారు. ఈ ప్లాన్ జియో యొక్క అన్ని యాప్ లకు కాంప్లిమెంటరీ చందాను ఉచితంగా పొందుతారు. దానితో రోజుకు 100 ఎస్ఎంఎస్ లు చేసుకోవచ్చు. జియో నంబర్‌కు కాల్ చేసేటప్పుడు మీకు అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యం వుంటుంది. మిగతా సర్వీస్ ప్రొవైడర్ల కంటే ఈ ప్లాన్ ఉత్తమం. రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ అధిక డేటా పరిమితులతో పనిచేసేవారికి రిలయెన్స్ జియో అద్భుత అవకాశం కల్పించింది. రూ 249 ప్రీపెయిడ్ ప్లాన్ కంటే ఇది ఉత్తమమయింది. ఎందుకంటే కేవలం వంద రూపాయల తేడాతో రోజుకి అదనంగా మరో జీబీ డేటా లభిస్తుంది. వర్కింగ్ ప్రొఫెషనల్న్ ఈ ప్లాన్ ఎంచుకోవచ్చు. జియో రూ.349 ప్లాన్‌ను ఎంచుకుంటే కనుక ఇది 28 రోజుల చెల్లుబాటు కాలానికి ప్రతిరోజూ 3జీబీ హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. రోజువారి డేటా పూర్తి అయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64కేబీపీఎస్ తగ్గించబడుతుంది. ఈ ప్లాన్‌తో మీరు అదనపు ఖర్చు లేకుండా 1000 నిమిషాల నాన్-జియో కాల్స్ మరియు అన్ని జియో యాప్ లకు కాంప్లిమెంటరీ చందాను పొందుతారు. దీనితో, మీరు రోజుకు 100 ఎస్ఎంఎస్ లు పొందవచ్చు. అన్ని జియో-టు-జియో కాల్స్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యం ఉంది. 3 జీబీ డేటా ప్లాన్ లాక్ డౌన్ కాలంగా బాగా ప్రాచుర్యం పొందింది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా