ఈ-బర్త్ సర్టిఫికెట్ తీసుకోవడం ఈజీ
31-01-201931-01-2019 15:48:24 IST
2019-01-31T10:18:24.587Z31-01-2019 2019-01-31T10:18:22.626Z - - 22-04-2021

టెక్నాలజీని బాగా వినియోగిస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనన ధృవీకరణ పత్రాలు పొందడాన్ని మరింత సులభతరం చేసింది. దేశంలో తొలిసారి జనన ధృవీకరణ పత్రాలను దరఖాస్తుదారులే నేరుగా ఆన్ లైన్ ద్వారా గాని, ప్రసవించిన దవాఖానాల నుండి కానీ పొందే అవకాశం కల్పించింది. ఇన్నిరోజులూ జనన ధృవీకరణ పత్రాల కోసం సంబంధిత సర్కిల్ మున్సిపల్ కార్యాలయాల చుట్టూ గానీ, మీ సేవా కేంద్రాల చుట్టూ గానీ తిరగాల్సి వచ్చేది. పత్రాలు పొందే క్రమంలో బ్రోకర్లకు ఎంతో కొంత డబ్బు చెల్లించేవారు. ఇకనుంచి ఏవిధమైన కష్టాలు లేకుండా ఈ విధానం అమలు చేస్తున్నారు. పిల్లలను పాఠశాలల్లో చేర్పించడంతో పాటు మరికొన్ని ముఖ్యమైన సందర్భాలలో జనన ధృవీకరణ పత్రాలు తప్పనిసరి. అందుకే వీటిని సులువుగా పొందడానికి తెలంగాణ సర్కార్ ఈ-బర్త్ విధానం ప్రవేశపెట్టింది. ప్రసవం అయిన దవాఖానా, ప్రైవేట్ ఆస్పత్రిలో వివరాలు నమోదు చేసి.. తల్లిదండ్రులే నేరుగా బర్త్ సర్టిఫికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అన్ని ప్రభుత్వ దవాఖానలతో పాటు ప్రైవేట్ దవాఖానాల్లో సైతం ఈ విధానం అమలు చేస్తున్నారు. ఈ-బర్త్ విధానానికి ప్రతి జిల్లాకు ఒక పాస్ వర్డ్ కేటాయించినట్లు, ఈ పాస్ వర్డ్ ల ద్వారా సంబంధిత దవాఖానా అధికారులు ఏరోజుకారోజు జన్మించిన శిశువుల వివరాలు ఈ-బర్త్ పోర్టల్ లో పొందు పరుస్తారని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ అధికారులు చెప్పారు. 2019, జనవరి 1 నుండి జన్మించిన శిశువుల సర్టిఫికెట్లను మాత్రమే ఈ విధానం ద్వారా పొందవచ్చు. ebirth.telangana.gov.in లోకి వెళ్లి అక్కడ అడిగిన వివరాలతో పాటు సంబంధిత ఆస్పత్రి సిబ్బంది డెలివరీ సమ్మరీ షీట్ లో జారీచేసిన యూనిక్ ఐడీ కోడ్ ను ఎంటర్ చేయాలి. వెబ్ సైట్ లో ఎంటర్ చేసిన వివరాల ఆధారంగా సంబంధిత శిశువు జనన ధృవీకరణ పత్రం వస్తుంది. దానిని నేరుగా ఇంటిలోనుండే డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. మరో విశేషం ఏంటంటే పిల్లలకు పేరు పెట్టిన తర్వాత కూడా పేరు నమోదుచేసి పత్రం పొందవచ్చు. ఈ-బర్త్ సర్టిఫికెట్ విధానంతో తల్లిదండ్రుల విలువైన సమయం, డబ్బు ఆదా అవుతుందని అధికారులు అంటున్నారు.

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం
5 hours ago

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021
ఇంకా