newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఈ కామర్స్ సంస్థలకు కేంద్రం షాక్

19-04-202019-04-2020 18:17:24 IST
Updated On 19-04-2020 18:35:14 ISTUpdated On 19-04-20202020-04-19T12:47:24.037Z19-04-2020 2020-04-19T12:32:12.182Z - 2020-04-19T13:05:14.749Z - 19-04-2020

ఈ కామర్స్ సంస్థలకు కేంద్రం షాక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ నియంత్రణకు విధించిన రెండవ విడత లాక్ డౌన్ లో భాగంగా ఈ కామర్స్ సంస్థలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదలచేసింది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌ వంటి ఈ-కామర్స్‌ సంస్థలు మొబైల్‌ ఫోన్లు, టీవీలు, ఫ్రిజ్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్టేషనరీ ఉత్పత్తుల విక్రయాలు జరుపుకోవచ్చంటూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంది. 

ఏప్రిల్‌ 20 నుంచి వీటి విక్రయాలు ప్రారంభం కావాల్సి ఉండగా.. ఒక్కరోజు ముందు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోంమంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిత్యవసరాలు కాని వస్తువులను ఈ-కామర్స్‌ కంపెనీలు విక్రయించడానికి లేదని స్పష్టంచేసింది. ఈ-కామర్స్‌ విక్రయదారులు ఉపయోగించే వాహనాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. 

ఈకామర్స్ సంస్థలు టీవీలు, ఫ్రిజ్ లు, మొబైల్ ఫోన్లు, వాషింగ్ మెషీన్లు సరఫరా చేయడానికి సిద్ధపడ్డాయి. ఈనేపథ్యంలో నిత్యావసరాలు, కరోనా వైరస్ మందులు, మాస్కుల వంటివి తప్ప వేరేవాటిని డెలివరీ చేయడానికి కేంద్రం ఒప్పుకోలేదు. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ నిత్యావసరాలు మించి వేరేవి ఆర్డర్లు స్వీకరించడం గానీ, వాటిని సరఫరా చేయడం గానీ కుదరదని కేంద్రం పేర్కొంది. ఈమధ్యకాలంలో షాపులకు వెళ్లక్కర్లేకుండా ఇంటి ముంగిటకే అందుబాటులోకి వచ్చాయి. మనం నెట్లో బుక్ చేస్తే కొన్ని గంటల వ్యవధిలోనే అవి వినియోగదారులకు అందుతున్నాయి. కరోనా కారణంగా ఈ కామర్స్ సంస్థలు భారీ నష్టాలు చవిచూస్తున్నాయి. 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle