ఇయర్ ఫోన్స్ ఎంతసేపు వాడాలి?
13-07-201913-07-2019 18:35:07 IST
2019-07-13T13:05:07.660Z13-07-2019 2019-07-13T13:05:06.111Z - - 15-12-2019

ఈరోజుల్లో సెల్ ఫోన్ చేతిలో పట్టుకుని మాట్లాడ్డం చాలా తగ్గిపోయింది. టెక్నాలజీ రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో బ్లూటూత్ అనేది ఇప్పుడు అందరికీ కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరూ మాట్లాడటానికి వీటిమీదే ఆధారపడుతున్నారు. సంగీతం, చదవడం, సినిమాలు చూడడం, ఇంటర్నెట్ తదితరాల కోసం యువత బ్లూటూత్, ఇయర్ఫోన్లను ఎక్కువగా వాడుతున్నారు. రోజుకు ఎనిమిది గంటలకు మించి వాడితే త్వరలో శాశ్వత వినికిడి సమస్య వచ్చే అవకాశం ఉంది నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గుర్తింపు పొందిన కంపెనీల ఇయర్ ఫోన్లు, బ్లూటూత్‌లు వినియోగిస్తే మంచిదని సలహా ఇస్తున్నారు. మీ ఇయర్ ఫోన్ స్పీకర్ మెస్ పై పేరుకుపోయిన దుమ్మును డ్రై టూత్ బ్రష్ ద్వారా తొలగించవచ్చు. దుమ్ము పేరుకుపోయిన ప్రాంతంలో నెమ్మదిగా బ్రష్ చేయటం వల్ల డర్ట్ మొత్తం తొలగిపోతుంది. మీ ఇయర్‌ఫోన్‌ను సిలికోన్‌తో తయారైనట్లయితే డిష్ వాషర్ లిక్విడ్‌ను నీటిలో కలిపి అప్లై చేయవచ్చు. సాధారణంగా రోజుకి పావుగంట, అరగంటకు మించి ఇయర్ ఫోన్స్ వాడకూడదు.
ఇయర్ ఫోన్స్ వాడేటప్పుడు తక్కువ సౌండ్ తో వాడాలి. అయితే మధ్య మధ్య కొంత సమయం గ్యాప్ అవసరం. ఇయర్ ఫోన్స్ అప్పుడప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఇయర బడ్స్ ద్వారా వాటిని సింపుల్ గా శుభ్రం చేసుకునే అవకాశం ఉంది. అది ట్రైచేయవచ్చు. అదే పనిగా ఎక్కువ సమయం పాటు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సంగీతం వినేవారికి చెవుడు వచ్చే ప్రమాదం ఉందని ఈఎన్టీ వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా అతి మంచిది కాదు. ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కదాని అదే పనిగా వాడడం మానేయండి. అవసరం అయితే తప్ప వాటి జోలికి వెళ్లవద్దు.

విమెన్ సేఫ్టీ కోసం గూగుల్ నయా ఐడియా
12-12-2019

శాంసంగ్ రూ.12 కోట్ల ‘గోడ’ వచ్చేసింది!
09-12-2019

ఫేక్ ‘షావోమీ’ వస్తున్నాయట.. పైలం మరి!
09-12-2019

జియో గుడ్ న్యూస్... ఆ ప్లాన్లు మళ్ళీ వెనక్కి!
09-12-2019

క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 865 ముచ్చట్లు ఇవిగో...
08-12-2019

స్మార్ట్ ఫోన్ కొంటే కిలో ఉల్లిపాయలు ఫ్రీ.. ఎక్కడో తెలుసా?
07-12-2019

2021 ఐఫోన్ ముచ్చట్లు తెలుసా?
07-12-2019

గూగుల్ ఫొటోస్‌లో ఒక్కో ఫొటో పంపించాలా?
06-12-2019

క్వాల్‌కోమ్ కొత్త ఫింగర్ ప్రింట్ సెన్సర్ వస్తోంది...
05-12-2019

చవకైన మడత ఫోన్ వస్తోంది... మనకి తీసుకొస్తారా?
05-12-2019
ఇంకా