ఇన్ స్టాగ్రామ్ మరింత సంగీతమయమైంది...
17-09-201917-09-2019 17:48:59 IST
Updated On 17-09-2019 17:37:14 ISTUpdated On 17-09-20192019-09-17T12:18:59.463Z17-09-2019 2019-09-17T11:59:31.788Z - 2019-09-17T12:07:14.331Z - 17-09-2019

ఫేస్ బుక్ మీద యువత ఆసక్తి తగ్గించుకోవడం గమనించిన ఫేస్ బుక్ యాజమాన్యం యూజర్లు ఇతర సర్వీసులపై వైపు వెళ్లకుండా తన మరో సోషల్ మీడియా యాప్ ఇన్ స్టాగ్రామ్ వైపు మళ్లిస్తోంది. అందుకే ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆప్షన్లు తీసుకొచ్చి ఆకర్షిస్తోంది. తాజాగా మరో ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఇన్ స్టాగ్రామ్ స్టోరీలు మరింత ఆకర్ణణీయంగా మారాయి. ఈ ఫీచర్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి ప్రయోగాత్మకంగా అందుబాటులో ఉంది. ఇప్పుడు అందరికీ ఈ ఆప్షన్ ని ఇన్ స్టాగ్రామ్ ఎనేబుల్ చేసింది.
యూజర్లు తమకు నచ్చిన ఫొటోలు, వీడియోలను ఇన్ స్టాగ్రామ్ లో యాడ్ చేస్తుంటారు. మనం వాట్సాప్ స్టేటస్ లో పెడుతుంటాంగా అలాగే. ఇప్పుడు ఫొటోలకు మీకు నచ్చిన పాట, సంగీతం యాడ్ చేసుకోవచ్చు. ఇదే కొత్త ఆప్షన్. గతేడాది మార్చిలో ఇన్స్టాగ్రామ్ ఈ సదుపాయాన్ని కొన్ని ఎంపిక చేసిన దేశాల్లో లాంచ్ చేసింది. ప్రస్తుతం మన దేశంలో ఈ ఫీచర్‌ను వినియోగదారుల ముందుకు పూర్తి స్థాయిలో తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్‌ను వాడాలంటే యాప్‌ను అప్డేట్ చేసుకోవాల్సిందే.
కొత్త వెర్షన్ అప్డేట్ అయ్యాక స్టోరీస్ ఆప్షన్‌లోకి వెళ్లి ఏదైనా ఫొటో అప్లోడ్ చేసి స్టిక్కర్స్ బటన్ ట్యాప్ చేయాలి. అప్పుడు ఈ కొత్త ఫీచర్ కనిపిస్తుంది. అక్కడి నుంచి మీకు నచ్చిన సంగీతం లేదా పాటను ఫొటోకు జత చేసేకోవచ్చు. ఇలా యాప్ అప్డేట్ చేసినా కొత్త ఫీచర్ కనిపించకపోతే యాప్‌ను అన్ ఇన్స్టాల్ చేసి మళ్లీ ఇన్స్టాల్ చేయాలి. ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే ఈ మ్యూజిక్‌లో హిట్ సాంగ్స్, మోడ్స్, జెనర్స్ అంటూ మూడు రకాల ఆప్షన్లు ఉంటాయి. వాటి ద్వారా మీకు నచ్చిన పాటల్ని బ్రౌజ్ చేసి స్టోరీస్‌కు యాడ్ చేయొచ్చు. అలా స్టోరీస్‌లో యాడ్ చేసిన పాటతో పాటు ఆ పాట లిరిక్ కూడా వచ్చే ఆప్షన్ ను ఇన్స్టాగ్రామ్ అందుబాటులోకి తీసుకొచ్చింది.



థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం
5 hours ago

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021
ఇంకా